translateexpand_more

Man Puts His Leg Near Co Passenger News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu03 Jun, 09:15 am
మెట్రోలో ప్రయాణికుడి ఓవరాక్షన్.. బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు.. మ్యాటర్ ఏమిటంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Hyderabad metro officials serious on a man puts his feet near co passenger: హైదరాబాద్ మహానగరంలో చాలా మంది ప్రతిరోజు మెట్రోలో ప్రయాణాలు చేస్తారు. తక్కువ సమయంతో పాటు తమ గమ్యస్థానాలకు వేగంగా చేరుకొవడానికిమెట్రోల్లోజర్నీలు చేస్తారు. ఇటీవల మెట్రోలు కూడా చాలా రద్దీగా ఉంటున్నాయి. ఇదే అదనుగా భావించి కొంత మంది ఆకతాయిలు కూడా మెట్రోలో జర్నీలు చేస్తు తమ పాడు బుద్దిబైట పెడతారు. కొంత మంది చూసేందుకు చదువుకున్న వారిలా ఉన్న వాళ్లు చేసే పనులు, వాళ్లు మాట్లాడేమాటలకు అస్సలుపొంతన ఉండదు. ఈ క్రమంలో బస్సులు, రైల్వేలు, విమానసర్వీసుల్లో కొంత మంది ప్రయాణాలు చేసేటప్పుడు పక్క ఎదురు సీట్ల మీద కాళ్లు పెడుతుంటారు. ఇది సరైన పద్దతి కాదని, డీసెన్సీఅన్పించుకొదని చెప్పిన కొంత మంది మానుకొరు. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రోలో ఇటీవల చోటు చేసుకున్న ఘటన నెట్టింట విపరీతంగా వైరల్ గా మారింది. ఇటీవల నాగోల్ నుంచి రాయదుర్గం వైపు వెళ్లే మెట్రో ట్రైన్‌లో చైతన్య అనే ప్రయాణికుడు ఎక్కాడు. అతను రన్నింగ్ మెట్రోలో తన కాళ్లను కిటికీ మీద పెట్టుకున్నాడు. ఆ తర్వాత అక్కడి కొంత మంది ప్రయాణికులు చెబితే మరల తన కాళ్లను సీటు మీద పెట్టి పక్కనే వ్యక్తి ఉన్న అనాగరికంగా ప్రవర్తించాడు. సదరు ప్రయాణికుడు తనకు అసౌకర్యంగా ఉందని చెప్పిన అతనితో వాగ్వాదంకు దిగాడు. అతడ్ని వారించాలని చూస్తున్న వారితో గొడవకు దిగాడు. దీంతో కొంత మంది వీడియో తీసి దాన్నిసోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై మెట్రో అధికారులు సీరియస్ అయ్యారు. Read more: Snakes Video: అరెవావ్ .. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీసులో రెండు నాగు పాముల సయ్యాట.. అరుదైన వీడియో.. వెంటనే మెట్రో అధికారులు రంగంలోకి దిగి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. మెట్రోలో అనాగరికంగా ప్రవర్తించినందుకు గాను రాయదుర్గం పీఎస్ లో సదరు ప్రయాణికుడిపై ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో పోలీసులు సదరు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనతో మరోసారి సదరు వ్యక్తి మెట్రో జర్నీ వివాదం వార్తలలో నిలిచింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి