translateexpand_more

Mega Dsc Transparency News

Latest updates from Telugu Digital news sources.

Vaartha02 Jun, 11:16 am
మళ్లీ గెలుపుపై ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

CM Chandrababu Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ ప్రజాప్రతినిధులకు కీలక దిశానిర్దేశం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కేవలం ఒకే ఒక్కసారి గెలిచిన ‘వన్‌టైమ్ ఎమ్మెల్యేలుగా’ మిగిలిపోకూడదని, నిరంతరం ప్రజల్లో ఉంటూ మళ్లీ మళ్లీ విజయాలు సాధించాలని స్పష్టం చేశారు. అభివృద్ధి, సుపరిపాలన ద్వారానే ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెతను గుర్తుచేస్తూ.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (గొడ్డలి పార్టీ) విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు. లేకుంటే ఆ పార్టీ విషం చిమ్ముతూనే ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురం, కుప్పం వంటి నియోజకవర్గాల్లో టీడీపీ వరుసగా గెలుస్తూనే ఉందని, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అటువంటి నియోజకవర్గాల సంఖ్య పెరగాలని ఆకాంక్షించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పోరాటాలు చేశానని, కానీ ఇలాంటి నీచులతో ఎప్పుడూ పోరాడలేదని వ్యాఖ్యానించారు. Read Also: Weather Update: కేరళను తాకనున్న రుతుపవనాలు..భారీ నుంచి అతి భారీ వర్షాలు: IMD కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు మొదటి సంతకం పెట్టి మెగా డీఎస్సీ నిర్వహించామని చంద్రబాబు (Chandrababu) గుర్తుచేశారు. ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి కొందరు 241 కేసులు వేసినప్పటికీ, వాటన్నింటినీ చట్టపరంగా ఎదుర్కొని అత్యంత పారదర్శకంగా నియామకాలు పూర్తి చేశామన్నారు. పారదర్శకంగా జరిగిన డీఎస్సీపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలకు మన ప్రజాప్రతినిధులు గట్టిగా కౌంటర్లు ఇవ్వడం వల్లే వారు ఇప్పుడు తోకముడిచారని అన్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SSR) ప్రక్రియపై ఎమ్మెల్యేలకు నిర్వహించిన శిక్షణ తరగతులకు కొందరు నేతలు హాజరుకాకపోవడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2002 తర్వాత జరుగుతున్న అతిపెద్ద ఓటర్ల జాబితా సవరణ ఇదని, ఇందులో కూటమి ఓట్లను తొలగించి దొంగ ఓట్లను చేర్చేందుకు ప్రతిపక్షం కుట్రలు చేసే అవకాశం ఉందని ఆరోపించారు. జూలై 14 లోపు ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించాలని, ఎంపీలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నేతలతో కలిసి క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పార్టీ ప్రాధాన్యతను, సైకిల్ గుర్తు ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సరికొత్త పంథాను చంద్రబాబు ప్రకటించారు. CM Yogi : స్నేహం ముసుగులో దాడులా? సహించేది లేదు:: సీఎం ఆదిత్య‌నాథ్‌ Hayagreeva Movie: క్రైమ్ థ్రిల్లర్ ‘హయగ్రీవ’ మూవీ రివ్యూ! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Pawan Kalyan: గద్దర్‌పై పవన్ కల్యాణ్ భావోద్వేగ వ్యాఖ్యలు Ramprasad Reddy: వైసీపీ ప్రభుత్వం అమరావతిని అల్లకల్లోలం చేసింది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి Pawan Kalyan: తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?.. రావొద్దనడానికి అంటూ పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం Pawan kalyan: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మేం పోటీ చేస్తాం: పవన్ కల్యాణ్ Food Adulteration: ఆహార భద్రతపై కూటమి సర్కార్ ఫోకస్ Collector Himanshu Shukla: గిరిజనులకు మౌలిక వసతులు తక్షణమే కల్పించాలి రానున్న ఐదేళ్లలో భూమిపై భరించలేని వేడి పెరగనుందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.... తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో తెల్లవారుజామున ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అమిత వేగమే ఇద్దరి ప్రాణాలను... పాయకరావుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) సాకేటి శంకర్ రావుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని ఆంధ్రప్రదేశ్... పరిశ్రమలు పంచాయతీలకు పన్ను చెల్లించకపోవడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాలు సంపాదించే పరిశ్రమలు పన్నులు... భారత్-నేపాల్ మధ్య ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. నేపాల్ ప్రధాని... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు... తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (జూన్ 2, 2026) రాష్ట్రవ్యాప్తంగా అత్యంత వైభవంగా... ఐపీఎల్ (IPL) సీజన్ ముగింపు వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు ఒక ఊహించని... సంఘర్షణలతో ప్రభావితమైన దక్షిణ సూడాన్ దేశంలో పౌరులను రక్షించడంలో మరియు శాంతి స్థాపన ప్రయత్నాలకు మద్దతు... దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రేషన్ కార్డుదారుల కోసం కేంద్ర ప్రభుత్వం సార్థక్ పీడీఎస్ పథకం...