translateexpand_more

Middle Class Housing Crisis News

Latest updates from Telugu Digital news sources.

Telugu Times01 Jun, 01:37 pm
కొందామంటే కోట్లు కావాలి.. ఉందామంటే వేలు చాలవు.. హైదరాబాద్ లో అద్దె ఇళ్ల కష్టాలు

Hyderabad:మహానగరంలో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు సొంతిల్లు కొనడం ఒక కలగానే మిగిలిపోతుండగా, కనీసం అద్దె ఇంట్లోనైనా ఉందామన్నా కిరాయిలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నగరంలో ప్రతి సంవత్సరం విపరీతంగా పెరుగుతున్న అద్దెల కారణంగా మధ్యతరగతి కుటుంబాలపై మోయలేని ఆర్థిక భారం పడుతోంది. సాధారణంగా వేసవి సెలవుల సమయంలో ఇళ్లు ఎక్కువగా ఖాళీ అవుతుంటాయి. ఆ తర్వాత జూన్ నెల వచ్చేసరికి ఉద్యోగుల బదిలీలు, పిల్లలను కొత్త స్కూళ్లు, కాలేజీలలో చేర్పించడం, అలాగే ఉపాధి కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి వచ్చేవారి వలసల కారణంగా అద్దె ఇళ్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే మణికొండ వంటి ప్రాంతాల్లో ‘టులెట్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నగరంలో భారీ అద్దెలను భరించలేక చాలామంది ప్రజలు శివార్లకు వెళ్లిపోతున్నారు. ఆకాశాన్ని తాకుతున్న ధరలు.. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే ఐటీ కారిడార్ పరిధిలో ఇళ్ల అద్దెలు మరీ ఎక్కువగా ఉన్నాయి. మణికొండ పంచవటి కాలనీలో ఒక 3 BHK ఫ్లాట్ అద్దె నెలకు రూ. 40,000 నుండి రూ. 50,000 మధ్య పలుకుతుండగా, 2 BHK ఫ్లాట్‌కు రూ. 25,000 నుండి రూ. 30,000 వరకు డిమాండ్ చేస్తున్నారు. వీకర్ సెక్షన్ ఏరియాల్లో సైతం అద్దెలు రూ. 18,000 నుండి రూ. 20,000 కు చేరాయి. బాచుపల్లిలోని కొత్త ఫ్లాట్లలో 2 BHK కిరాయి రూ. 20,000 వరకు ఉండగా, కిస్మత్‌పూర్‌లో రూ. 25,000 గా ఉంది. కేపీహెచ్‌బీ పాత ఫ్లాట్లలో సైతం రూ. 20,000 నుండి రూ. 25,000 వరకు అద్దెలు వసూలు చేస్తున్నారు. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, నల్లగండ్ల, గండిపేట వంటి ఐటీ ప్రాంతాలలోని గేటెడ్ కమ్యూనిటీలలో అద్దెలు మరింత దారుణంగా