translateexpand_more

N Chandrababu Naidu News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy03 Jun, 10:08 am
తెలుగు రాష్ట్రాలు విడిపోయి 12 ఏళ్లయింది.. ఇప్పుడెందుకు ఈ వివాదాలు

అమరావతి, జూన్ 03: రాష్ట్రాలు వేరైనా తెలుగువారంతా ఒక్కటేనని, అనవసర వివాదాలతో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించడం సరికాదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడైనా రాజకీయం చేసే హక్కు ఉంటుందని చంద్రబాబు గుర్తుచేశారు.

ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘గతంలో నేను తమిళనాడు వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కూడా ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్లారు. బీఆర్ఎస్ (BRS) పార్టీ తాము జాతీయ పార్టీ అని ప్రకటించుకుంది కదా.. ఇప్పుడెందుకు అనవసరంగా మాట్లాడుతున్నారు. అమెరికాలో కూడా తెలుగువారు సెనేటర్లు అవుతున్నారు. ప్రజాసేవ చేసినవారినే ప్రజలు ఆదరిస్తారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు తెలంగాణలో మాట్లాడుతున్న మాటలు ఎంతమాత్రం కరెక్ట్ కాదు. రెండు రాష్ట్రాలుగా విడిపోయి 12 ఏళ్లు అవుతోంది. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడెందుకు మళ్లీ ఇవన్నీ సృష్టిస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ.. తెలుగువారిగా అంతా కలిసికట్టుగా ఉండాలి. రెండు రాష్ట్రాలనూ ప్రగతి పథంలో నడిపించుకోవడమే అందరి లక్ష్యం కావాలి’ అని అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

‘సర్‌’ను సీరియస్‌గా తీసుకోండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

సునీల్ కుమార్ వ్యాఖ్యలపై విచారణ చేయాలి: రఘురామకృష్ణరాజు

Read Latest  AP News And Telangana News And National News

And Telugu News

Eenadu03 Jun, 09:32 am
ఈసారి కృష్ణానది వెస్ట్ బైపాస్ రోడ్డుపై యోగా కార్యక్రమం

అమరావతి: ఆరోగ్యాంధ్రప్రదేశ్‌, స్వర్ణాంధ్రప్రదేశ్‌ సాధించాలంటే యోగాంధ్ర చాలా ముఖ్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో యోగా కార్యక్రమంపై ఆయన మీడియాతో మాట్లాడారు. జీవన విధానంలో యోగాను భాగం చేసేందుకు యోగాంధ్రను ఏటా జరపాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. ఈ ఏడాది యోగా దినోత్సవానికి ‘యోగా ఫర్‌ హెల్తీ ఏజ్‌’ థీమ్‌ను పాటిస్తున్నట్లు చెప్పారు. వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సంజీవని పథకంలో యోగాను అనుసంధానం చేస్తామని తెలిపారు. ‘‘ఈ నెల 7 నుంచి 20 వరకు 14 రోజులపాటు యోగా కార్యక్రమాలను నిర్వహించాలి. ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలు అందరూ భాగస్వామ్యం కావాలి. ప్రతి జిల్లా, మండల కేంద్రం ఇలా ఎన్ని చోట్ల వీలైతే అన్ని చోట్ల యోగా కార్యక్రమాలు నిర్వహించాలి. యోగాంధ్ర 2026లో కనీసం కోటి మంది పాల్గొనేలా లక్ష్యం పెట్టుకోవాలి. 10 లక్షల మంది సర్టిఫైడ్‌ యోగా సాధకులను తయారు చేయాలి. గతేడాది యోగా కార్యక్రమాలతో అనేక రికార్డులు సాధించాం. ప్రపంచమంతా ఏపీ వైపు చూసేలా చేయగలిగాం. నిరుడు విశాఖ బీచ్‌ పక్కన రోడ్డుపై యోగా చేశాం. ఈసారి కృష్ణా నది వెస్ట్‌ బైపాస్‌ రోడ్డుపై యోగా చేస్తాం. అమరావతి అందాన్ని ప్రపంచానికి చూపించే అవకాశం కూడా ఉంటుంది’’ అని చంద్రబాబు అన్నారు. 21 వ్యాధులకు సంబంధించి యోగాసనాల వీడియోలను ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు రూపొందించారని చంద్రబాబు తెలిపారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. 8142404888 కాల్ సెంటర్‌ను సంప్రదించి సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చని చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఐటీఐ విద్యార్థులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జేఎన్‌టీయూ గురజాడ విద్యాలయం ముందుకొచ్చింది.

N Chandrababu Naidu News Keyword | Telugu Digital