
కూటమిలో కుతకుతలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి రాజకీయాల్లో అధికార కూటమిలో మరోమారు వేడి రాజుకుంది. వైఎస్సార్సీపీ బహిష్కృత నేత మన్నెమాల సుకుమార్‌రెడ్డి కూటమిలోకి ఎంట్రీ అంశం ఇప్పుడు టీడీపీ, జనసేన వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఒక వైపు మన్నెమాల టీడీపీలో చేరే ప్రయత్నాలపై ఆ పార్టీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్న చర్చ.. ఇంకో వైపు మన్నెమాలను జనసేన ఇన్చార్జిగా తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే కావ్య ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం.. వెరసి కూటమి రాజకీయాలు కుతకుతలాడుతున్నాయి. కూటమిలో అంతర్గత రాజకీయాల వెనుక జనసేనను బలహీన పరిచి టీడీపీ ఆధిపత్యాన్ని మరింత పెంచుకునే వ్యూహమనే ప్రచారం ఇప్పుడు కావలి రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. మన్నెమాల ఎంట్రీకి మోకాలడ్డు? వైఎస్సార్సీపీలో కీలకంగా పని చేసిన మన్నెమాల సుకుమార్‌రెడ్డిని ఆ పార్టీ సస్పెండ్ చేయడంతో కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన అనంతరం ఆయన రాజకీయ భవిష్యత్‌పై కావలిలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికార కూటమిలోకి చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం మొదలైనప్పటి నుంచి టీడీపీలోనే అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన్నెమాలను టీడీపీలోకి తీసుకురావడంపై ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఆయన వర్గం సానుకూలంగా లేదు. ఈ క్రమంలో మన్నెమాల ఎంట్రీకి బీద రవిచంద్ర మోకాలడ్డినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కావలి రాజకీయాల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మధ్య నిప్పు.. ఉప్పులా ఉండగా మన్నెమాల వ్యవహారం ఆ అంతర్గత విభేదాలకు మరింత ఆజ్యం పోస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన ఇన్చార్జిగా మన్నెమాల? మన్నెమాల సుకుమార్‌రెడ్డిని జనసేన కావలి ఇన్చార్జిగా తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ మేరకు ఎమ్మెల్యే కావ్య సైతం మన్నెమాలతో మంతనాలు సాగిస్తున్నారన్న ప్రచారం ఇప్పుడు మరింత ఆసక్తిని రేపుతోంది. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కావ్య.. రాజకీయంగా తటస్థంగా ఉన్న మన్నెమాలను నేరుగా టీడీపీలోకి తీసుకురావడంపై ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో











