translateexpand_more

Nitin Gadkari News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy01 Jun, 04:03 pm
కాంట్రాక్టర్లకు నితిన్ గడ్కరీ వార్నింగ్

న్యూఢిల్లీ, జూన్01: జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే సహించేది లేదని కాంట్రాక్టర్లకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గట్టిగా హెచ్చరించారు. సోమవారం న్యూఢిల్లీలో జాతీయ రహదారుల నిర్వహణపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియా, పత్రికల్లో వచ్చిన ప్రజల ఫిర్యాదుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మంత్రి గడ్కరీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని జాతీయ రహదారుల నాణ్యతపై ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ ప్రత్యేకంగా చర్చించారు.

ఆంధ్రప్రదేశ్‌లో 8,512 కిలోమీటర్ల జాతీయ రహదారుల నెట్‌వర్క్‌పై నితిన్ గడ్కరీ కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో రోడ్డు భద్రతపై ముందస్తు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల (Black Spots) గుర్తించి.. తక్షణమే నివారణ చర్యలకు ఉపక్రమించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి రహదారుల మన్నికను మరింత పెంచాలని అధికారులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు

బాల్క సుమన్ కేసులో మరో ట్విస్ట్

For More AP News And Telugu News

Sakshi29 May, 02:42 am
వచ్చేస్తోంది.. ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్

దేశంలో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కీలక అడుగు వేస్తోంది. సంస్థ తన తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌ను జూన్ 3న భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి హాజరుకానున్నారు. ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు పెట్రోల్‌తో పాటు ఇథనాల్ మిశ్రమ ఇంధనాలపై కూడా నడుస్తాయి. ప్రస్తుతం భారతదేశంలో E20 ఇంధనం వినియోగంలో ఉండగా, భవిష్యత్తులో E85 నుంచి E100 వరకు ఉన్న అధిక ఇథనాల్ మిశ్రమాలకు అనుకూలమైన వాహనాలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని కూడా నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. హీరో మోటోకార్ప్ విడుదల చేయనున్న మోడల్ పేరు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ బైక్ సంస్థకు అత్యంత ప్రజాదరణ పొందిన స్ప్లెండర్ లేదా హెచ్‌ఎఫ్ డీలక్స్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడే అవకాశం ఉంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో హీరో ప్రదర్శించిన ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్ కూడా హెచ్‌ఎఫ్ డీలక్స్ ఆధారంగానే ఉండటం గమనార్హం. ఇప్పటికే భారత మార్కెట్లో కొన్ని ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా జిక్సర్ ఎస్‌ఎఫ్ 250 ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్‌ను విక్రయిస్తోంది. హోండా కూడా సీబీ300ఎఫ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. మరోవైపు ఫోర్‌ వీలర్‌ విభాగంలో మారుతి సుజుకి కూడా త్వరలోనే తన తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ మోడల్ వ్యాగన్ ఆర్ ఆధారంగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశంలో గ్రీన్ మొబిలిటీ

Sakshi25 May, 02:41 pm
May 25 2026 7:44 PM | Updated on May 25 2026 8:08 PM కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. కమర్షియల్...

May 25 2026 7:44 PM | Updated on May 25 2026 8:08 PM కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల కంటే వంటను చౌకగా చేయగల, కొత్త ఇథనాల్ ఆధారిత స్టవ్ టెక్నాలజీని ఆవిష్కరించారు. ఇది భారతదేశంలో అభివృద్ధి చెందు...