translateexpand_more

Ongole News News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu30 May, 06:13 am
బార్ లో బీరు సీసాలతో రచ్చ.. తల పగిలినా కూల్ గా 'లాస్ట్ పెగ్' వేసి

మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ, ఆ తర్వాత ఓ యువకుడు ప్రవర్తించిన తీరు ఒంగోలులో చర్చనీయాంశంగా మారింది. మే 23న పాత మార్కెట్ సమీపంలోని కేవీయస్ బార్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈమనిపాలేనికి చెందిన ప్రేమ్ కుమార్, అజయ్ మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మే 23న వీరిద్దరూ తమ స్నేహితులతో కలిసి సదరు బార్‌లో మద్యం సేవించడానికి కూర్చున్నారు. మాటల మధ్యలో పాత గొడవలు ప్రస్తావనకు రావడంతో ఒక్కసారిగా వివాదం రేగింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ప్రేమ్ కుమార్, అతని స్నేహితులు కలిసి అజయ్‌పై బీరు సీసాలతో ఘోరంగా దాడి చేశారు. ఈ దాడిలో అజయ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, బార్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి. అక్కడ అంత పెద్ద దారుణం జరిగి, రక్తం ఓడుతున్నా.. గ్రూపులోని ఓ యువకుడు మాత్రం ఏమాత్రం చలించలేదు. గొడవను పట్టించుకోకుండా ఎంతో నింపాదిగా తన గ్లాసులో ‘చివరి పెగ్’ కలుపుకుని, తీరిగ్గా తాగి అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. గొడవ ఎంత పెద్దదైనా.. లాస్ట్ పెగ్ మిస్ అవ్వకూడదు అనే రేంజ్‌లో ఉన్న ఆ యువకుడి తీరుపై నెటిజన్లు మీమ్స్, ట్రోల్స్‌తో తెగ ఆటాడుకుంటున్నారు. Jio: జియో బంపర్‌ ఆఫర్‌..కేవలం రూ.200కే అన్నీ..! ఉద్యోగం పోయిందని సంబరాలు.. “ఇప్పుడే నా జీవితం మొదలైంది” అంటున్న యువతి మార్స్ లో మనుషులు జీవించడానికి మొదటి అడుగు! మృత్యువు ఇలా కూడా