
KTR : రుకో జరా. సబర్ కరో. దూకుడు మంచిదే. కానీ లైన్ దాటొద్దు. టగ్ స్లిప్ కావొద్దు. అటెన్షన్ కోసమో..లేక మీడియాలో హైలెట్ కావడం కోసమో నోరు జారితే అసలుకే ఎసరు వస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నాం. కాస్త జాగ్రత్త. ఆచితూచి మాట్లాడండి అంటూ..పార్టీ లీడర్లకు దిశార్దేశం చేశారట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏది పడితే అది మాట్లాడి పార్టీని చిక్కుల్లో పడేయొద్దని.. కారు స్పీడుకు బ్రేకులు వేయొద్దని డైరెక్షన్స్ ఇచ్చారట. బాల్క సుమన్ ఎపిసోడ్‌తో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం..దూకుడుగా వెళ్తున్న నేతలను కంట్రోల్ చేసే ప్లాన్ చేస్తున్నట్లు టాక్. బహిరంగ సమావేశం అయినా..ఇంటర్నల్ మీటింగ్ అయినా..సోషల్ మీడియాలో పోస్ట్ అయినా..కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ఏడిపడితే అది మాట్లాడి మీరు చిక్కుల్లో పడొద్దు. పార్టీకి ఇబ్బందులు తీసుకురావద్దు. కారు పార్టీ యువ నేతలకు..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లాస్ తీసుకున్నారంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. బాల్క సుమన్ ఎపిసోడ్‌తో అలర్ట్ అయిన గులాబీ పార్టీ అధిష్టానం దూకుడుగా వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విమర్శలు ధీటుగా సమాధానం చెప్పాల్సిందే కానీ వ్యవస్థలపై మాట్లాడేటప్పుడు మాత్రం కంట్రోల్ తప్పొద్దని ఆదేశించినట్లు టాక్. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ వ్యాఖ్యలు, నమోదైన కేసులు, అరెస్ట్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశముందని భావించి బీఆర్ఎస్ అధిష్ఠానం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పార్టీ నాయకుల భాష, ప్రజా వేదికలపై వారు చేసే వ్యాఖ్యల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువనేతలు, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో యాక్టివ్‌గా ఉండే నేతలకు కేటీఆర్ ప్రత్యేకంగా