translateexpand_more

Police Permission To Nava Nirmana Sankalpa Sabha News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu01 Jun, 01:21 pm
పవన్ కళ్యాణ్ కు షాకిచ్చిన తెలంగాణ పోలీసులు.. జనసేనకు అనుమతి నిరాకరణ

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ నేతల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తున్న వేళ.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు.. షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. జనసేన పార్టీ హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన సభకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ సభకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడం గమనార్హం. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ నిర్వహించాలని జనసేన పార్టీ ప్లాన్ చేయగా.. దానికి పవన్ కళ్యాణ్ హాజరు కానుండగా.. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో జనసేన నేతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని భావిస్తుండగా.. ఇందుకోసం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం నిర్వహించాలని జనసేన నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ హాల్‌లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభను నిర్వహించేందుకు ఇప్పటికే జనసేన పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలోనే ఈ సభకు పోలీసుల అనుమతి లేకపోవడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా మారింది. అయితే తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో.. జనసేన పార్టీ నేతలు న్యాయపోరాటం చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. ఈ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణలోని అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు.. పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వేళ.. ఈ సభ ఏర్పాటు చేయడం, దానికి పోలీసులు అనుమతి నిరాకరించకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది.