translateexpand_more

Telangana Formation Day News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 02:36 pm
తెలంగాణ అమరవీరుల కలలు కన్న రీతిలో రాష్ట్రం లేదు

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అలానే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, టీజీ బీజేపీ చీఫ్ రామచందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, ప్రజల పోరాట స్ఫూర్తిని కొనియాడుతూ, అభివృద్ధి పథంలో రాష్ట్రం మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

'చిన్న రాష్ట్రాల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ లాంటి రాష్ట్రాలు ఏర్పాటు చేశాం. తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చాం. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తున్నా. అమరవీరుల కలలు కన్న రీతిలో ఇంకా రాష్ట్రం వెనుకబడి ఉంది. చిన్నమ్మ సుష్మా స్వరాజ్ తెలంగాణ ఏర్పాటుకు కృషి చేశారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారు అధికారంలో ఉన్నారు. రాష్ట్రా అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. జార్ఖండ్ ఏర్పాటు సమయంలో జార్ఖండ్ ఏర్పాటు కానివ్వం అన్నవారే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంస్కృతిని ముందుకు తీసుకువెళ్లాలన్నది బీజేపీ సంకల్పం' అని నితిన్ నబీన్ అన్నారు.

'తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. పీఎం కిసాన్ యోజన ,ముద్ర లోన్లు, జన్ ధన్ ఖాతాలు అందించాం. మౌలిక వసతులు,రోడ్లు,రహదారులు,రైల్వేలైన్లు ఏర్పాటు చేస్తున్నాం. వికసిత భారత్ కావాలంటే వికసిత తెలంగాణ కావాలి. ఒక అవినీతి పరుడు చేతుల్లోంచి మరో అవినీతి పరుడి చేతుల్లోకి వెళ్ళింది. తెలంగాణ కలలును సాకారం చేస్తాం' అని నితిన్ నబీన్ పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్

తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఉత్తేజం పొందాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Asianet News Telugu02 Jun, 02:32 pm
తెలంగాణ మీ జాగిరా.? పూర్తిగా ఓపెన్ అయిన ప వ న్ క ళ్యాణ్

తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలు కొనసాగుతాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో పార్టీ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పినా, పార్టీ కార్యకర్తలు, మద్ధతుదారుల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఎన్నికల బరిలోకి దిగే అవకాశాన్ని సూచించారు. ప్రజలు కోరుకుంటే తెలంగాణలో కూడా పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమైతే జనసేన ఆ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై సహజసిద్ధమైన వ్యతిరేకత లేదని పవన్ అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు దశాబ్దాలుగా కలిసి జీవిస్తున్నారని, ఉద్యోగాలు, వ్యాపారాలు, సినీ రంగం వంటి అనేక రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతోందని చెప్పారు. కొంతమంది రాజకీయ నాయకులు లేదా వ్యక్తులు ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను విడదీసే రాజకీయాల కంటే అభివృద్ధి, ఉపాధి, సంక్షేమ అంశాలపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏమైనా ఇక్క‌డి రాజ‌కీయ నాయ‌కుల జాగీరా అంటూ ప్ర‌శ్నించారు. తనను తెలంగాణకు రావొద్దని కొందరు హెచ్చరిస్తున్నారని, కానీ అలాంటి వ్యాఖ్యలకు తాను వెనక్కి తగ్గబోనని పవన్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్లే హక్కు ప్రతి భారతీయుడికి ఉందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా ఎదుర్కొన్న ఒత్తిళ్లు, బెదిరింపులతో పోలిస్తే ఇవి పెద్ద విషయాలు కాదని వ్యాఖ్యానించారు. భయపెట్టి రాజకీయంగా అణచివేయాలనే ప్రయత్నాలు ఫలించవని చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి మీడియా సమావేశం Live Link: https://t.co/Y6j4NhJdgl #PawanKalyanTelanganaPressMeet#TelanganaFormationDay#JanaSenaTelangana#JaiTelangana తెలంగాణతో తనకు భావోద్వేగ అనుబంధం ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తానని చెప్పారు. గతంలో కూడా తెలంగాణ ప్రాంతంలోని పలు సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహాయం అందించానని గుర్తు చేశారు. ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నా వాటిపై స్పందించడం తన బాధ్యతగా భావిస్తానని అన్నారు. తెలంగాణలో జరిగే అన్యాయాలపై కూడా అవసరమైతే గళమెత్తుతానని స్పష్టం చేశారు. రాష్ట్ర ఏర్పాటై దశాబ్దానికి పైగా గడిచిన తరువాత కూడా కొన్ని సమస్యలకు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కారణంగా చూపడం సరైన విధానం కాదని పవన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఉపాధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాంతీయ విభేదాల కంటే ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల ముఖ్యమని చెప్పారు. రాజకీయ పార్టీలు ప్రజల మధ్య విభజనలు సృష్టించే బదులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. తెలంగాణలో జనసేన భవిష్యత్తు పాత్ర, పార్టీ విస్తరణ అవకాశాలు, ప్రాంతీయ రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రానున్న రోజుల్లో జనసేన తెలంగాణలో ఎలాంటి కార్యాచరణ చేపడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Zee Telugu02 Jun, 01:32 pm
నిరుద్యోగులకు బంపర్ శుభవార్త.. నుంచి ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

TGPSC announces three govt job notifications: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వేళ టీజీపీఎస్సీ మూడు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ క్రమంలో నిరుద్యోగులు మాత్రం టీజీపీఎస్సీ చెప్పిన మాటలు నిలబెట్టుకొవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పార్టీలకతీతంగా నేతలు తమపార్టీ ఆఫీసుల్లో, వివిధ ప్రాంతాల్లో జెండాలను ఎగుర వేశారు. మరోవైపు తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల త్యాగాలను కూడా స్మరించుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణలో ప్రస్తుతం జాబ్ నోటిఫికేషన్ పై టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది.తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మూడు నోటిఫికేషన్లను ప్రకటించింది. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులో రోడ్లు భవనాల శాఖలో ఈఏఈ 222, సివిల్ 49 ఉద్యోగాలు ఉన్నాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుడు బుర్రా వెంకటేశం తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖలో 3800 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని.. వీటి భర్తీకి త్వరలో నోటిఫికేషన్స్ ఇస్తామని వెంకటేశం కీలక ప్రకటన చేశారు. టీజీపీఎస్సీ చెప్పిన విధంగానే మూడు నోటిఫికేషన్లను విడుదల చేయడంతో నిరుద్యోగ అభ్యర్థులు సంబరాల్లో మునిగి తెలుతున్నారు. ఇందులో రోడ్లు భవనాల శాఖలో ఈఏఈ 222, సివిల్ 49, పోస్టులతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 19 అసిస్టెంట్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి వయోపరిమితి 18 నుంచి 44 ఏళ్లుగా నిర్ణయించారు. అంతే కాకుండా.. సివిల్ పోస్టులకు జూన్ 6 నుంచి 13 వరకు, ఎలక్ట్రిక్ పోస్టులకు జూన్ 8 నుంచి జులై 15 వరకు అప్లై చేసుకొవచ్చు. ఆ తర్వాత.. ఎన్విరాన్ మెంటల్ పోస్టులకు జూన్ 10 నుంచి జులై 17 వరకు అప్లై చేసుకొవచ్చు. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన అర్హతలు, ఎగ్జామ్ విధానం, సిలబస్ ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో కోరింది. గత కొన్ని ఏళ్లుగా నిరుద్యోగ యువతీ, యువకులు అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్ లలో హస్టల్ లలో, రూమ్ లలో ఉంటూ, కొంత మంది పార్ట్ టైమ్ లో జాబ్ లు చేస్తు మరీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో గతంలో పలు మార్లు నోటిఫికేషన్ ల కోసం అభ్యర్థులు అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్ లలో రోడ్డు మీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీల మేరకు అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో ఒకేసారి మూడు నోటిఫికేషన్లు విడుదల కావడంతో నిరుద్యోగ అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ప్రతినెల ఇప్పటి నుంచి నోటిఫికేషన్ లు విడుదల చేసేలా టీజీపీఎస్సీ చర్యలు తీసుకుంటుందని, ఈ ఎగ్జామ్ లు కూడా పూర్తిగా పారదర్శకంగా ఎలాంటి అక్రమాలు జరక్కుండా నిర్వహిస్తామని టీజీపీఎస్సీ తెల్చి చెప్పింది. ఎలాంటి ఫెక్ ప్రచారాలు, పుకార్లను నమ్మోద్దని టీజీపీఎస్సీ నిరుద్యోగ అభ్యర్థుల్ని ఒక ప్రకటనలో కోరింది.

SkyC Media02 Jun, 12:55 pm
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్

తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం సృష్టిస్తూ పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ కార్యక్రమాలకు అనుమతి నిరాకరించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎవరి సొత్తు కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జనసేన పార్టీ పుట్టిందే హైదరాబాద్ గడ్డపై అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాము కేవలం రాష్ట్ర విభజన జరిగిన తీరును మాత్రమే వ్యతిరేకించామని పవన్ స్పష్టం చేశారు. ఈ పరిణామాల వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో జనసేన ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజా పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం అటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీల్లోనూ కొత్త చర్చకు దారితీసింది. పట్టణ ప్రాంత ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా జనసేన అడుగులు వేస్తోంది. తాము బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని పవన్ కల్యాణ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అనుమతులు నిరాకరిస్తే ఇళ్ల నుంచే పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉండగా పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ అధికార పక్షం కూడా అంతే తీవ్రంగా స్పందించింది. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటూ పక్క రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య సరికొత్త రాజకీయ వివాదానికి తెరలేపాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను ఒక పెయిడ్ ఆర్టిస్ట్‌గా ఆయన అభివర్ణించారు. పవన్‌కు అహంకారం ఎక్కువైందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఫలితంగా కాంగ్రెస్, జనసేన శ్రేణుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సెంటిమెంట్ పాలిటిక్స్ మళ్లీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలు ఇంటర్‌స్టేట్ రాజకీయ వివాదంగా మారుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే 2026 నుంచి 2028 మధ్య కాలంలో తెలంగాణలో బలం పుంజుకోవాలని జనసేన భావిస్తోంది. అందులో భాగంగానే పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని యువత, అర్బన్ ఓటర్లే లక్ష్యంగా జనసేన వ్యూహాలు రచిస్తోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడం జనసేనకు పెద్ద సవాలుగా మారనుంది. టీడీపీ, జనసేన కూటమి తెలంగాణలో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. తెలంగాణ రాజకీయాల్లో ఇదొక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా పవన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాబోయే రోజుల్లో జనసేన తెలంగాణలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆంక్షలను ఎదుర్కొంటూనే ప్రజా క్షేత్రంలోకి వెళ్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ వ్యూహం కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu Times02 Jun, 12:42 pm
ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. ప్రవాసులకు మహేష్ బిగాల శుభాకాంక్షలు

Mahesh Bigala: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ బీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఓషియానియా వంటి అన్ని ఖండాల్లోనూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఎంతో ఉత్సాహంగా, ఘనంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. విశ్వవ్యాప్తంగా తెలంగాణ సంబరాలు.. అమెరికా, కెనడా, లండన్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, జర్మనీ, బహ్రెయిన్ ,ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, సహా గల్ఫ్ దేశాలు అలాగే ఆఫ్రికాలోని దక్షిణాఫ్రికా, టాంజానియా వరకు అనేక దేశాల్లో తెలంగాణ పండుగ వాతావరణం వైభవంగా కొనసాగుతోంది. మన రాష్ట్ర ఆత్మగౌరవాన్ని, ఉద్యమ విశేషాలను అంతర్జాతీయ సమాజానికి చాటిచెప్పేలా ఎన్‌ఆర్‌ఐలు ఈ కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో గర్వకారణమని ఆయన కొనియాడారు. ముఖ్య అతిథిగా కేటీఆర్.. ఈ సారి వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మలేషియాలో నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, కేటీఆర్ రాక కోసం మలేషియాలోని తెలుగు సంఘాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని మహేష్ బిగాల వెల్లడించారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమ త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్ర ప్రగతి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలను ఏకం చేయడానికి ఈ వేడుకలు ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తున్నాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ కీర్తిని మరింత పెంపొందించేందుకు ప్రతి ప్రవాస తెలంగాణవాసి బాధ్యతగా భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

NTV Telugu02 Jun, 12:01 pm
తెలంగాణ మీ అయ్య జాగీరా..? పవన్ ఫైర్

Pawan Kalyan: తెలంగాణ మీ అయ్య జాగీరా..? అంటూ ఫైర్‌ అయ్యారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌... హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో లక్షలాది మంది జనసేన కార్యకర్తలు ఉన్నారని, రాష్ట్ర ప్రజల సమస్యలపై మాట్లాడే హక్కు తమ పార్టీకి ఉందని ఆయన అన్నారు. జనసేన పార్టీని హైదరాబాద్ నడిబొడ్డునే స్థాపించామని గుర్తు చేసిన పవన్ కల్యాణ్, తెలంగాణపై తమకు కొత్తగా ప్రేమ పుట్టలేదని చెప్పారు. తెలంగాణ గురించి జనసేన ఎందుకు మాట్లాడుతోందని కొందరు ప్రశ్నిస్తున్నారని, అయితే రాష్ట్ర ప్రజల సమస్యలపై స్పందించడం రాజకీయ పార్టీగా తమ బాధ్యత అని పేర్కొన్నారు. తాను తెలంగాణలోని నాలుగు మూలలూ తిరిగానని, రాష్ట్ర అభివృద్ధిని ఎప్పుడూ కోరుకునే వ్యక్తినని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆదిలాబాద్ వంటి నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించానని, ప్రస్తుతం విమర్శలు చేస్తున్న చాలామంది అప్పట్లో అక్కడికి వెళ్లలేదని వ్యాఖ్యానించారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, రాష్ట్ర విభజన జరిగిన విధానంపైనే తన అభ్యంతరం అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఎలాంటి విద్వేషం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతారని కొందరు ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తెలంగాణ ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని, ఎవరూ తనను బెదిరించలేరని వ్యాఖ్యానించారు. తన ఇంటి చిరునామా చెప్పడానికే ప్రెస్‌మీట్ పెట్టానని, బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. గత 12 ఏళ్లలో కేసీఆర్ లేదా తెలంగాణ నాయకులపై తాను వ్యక్తిగత విమర్శలు చేయలేదని పవన్ కల్యాణ్ తెలిపారు. తనను గతంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బెదిరించారని, కానీ తెలంగాణ ప్రజల నుంచి అలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని చెప్పారు. తెలంగాణలో ఉపాధి అవకాశాల కొరత లేదా ప్రజా సమస్యలపై మాట్లాడితే తనను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎవరైనా అన్యాయాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అందులో తాను ఉన్నా మినహాయింపు అవసరం లేదని పేర్కొన్నారు. తనపై భూకబ్జా ఆరోపణలు వస్తే వెంటనే విచారణ జరపాలని పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. తాను చెరువు లేదా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఉంటే ఆస్తులను సీజ్ చేయాలని, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ గురించి ప్రస్తావించిన పవన్ కల్యాణ్, ఆయన జీవించి ఉన్న సమయంలో చాలా మంది పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో గద్దర్ తనను సహాయం కోరగా, తాను వెంటనే వాహనం కొనిచ్చానని గుర్తు చేశారు. తెలంగాణలో జనసేన పార్టీ తప్పకుండా ఉంటుందని, భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అవసరమైతే తానే తెలంగాణ అంతటా పర్యటిస్తానని, ప్రజా సమస్యలపై ఇదే విధంగా మాట్లాడుతూనే ఉంటానని తెలిపారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Namasthe Telangana02 Jun, 11:36 am
జూలూరుపాడులో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జూలూరుపాడు, జూన్ 02 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగ‌ళ‌వారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షుడు చాపలమడుగు రామ్మూర్తి ఆధ్వర్యంలో స్థానిక సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ నివాసం వద్ద ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా యల్లంకి సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించగా, పార్టీ సీనియర్ నాయకులు యదలపల్లి వీరభద్రం బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల పాటు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో రాష్ట్రం అభివృద్ధికి చిరునామాగా మారిందని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన లకావత్ గిరిబాబు మాట్లాడుతూ.. ఉద్యమ తెలంగాణ నేడు ఉజ్వల తెలంగాణగా రూపుదిద్దుకుందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు, పరిపాలనా రంగాల్లో కొత్త రాష్ట్రం విశేష పురోగతి సాధించిందని కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని, రాష్ట్ర అభివృద్ధి మోడల్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు దుద్దుకూరి నాగేశ్వరరావు, భూక్యా సేవా, భూక్యా జోహార్ లాల్, యల్లంకి సత్యనారాయణ , సాయిన్ని హరీష్, తాళ్లూరి రామారావు, పురస్తపురవు రామకృష్ణ, బండారి వెంకయ్య, లేళ్ల సీతయ్య, ధర్మరాజుల నరసింహారావు, నిమ్మటూరి కనకయ్య, పొన్నెబోయిన పుల్లయ్య, నూతి నరసింహారావు, బానోత్ హనుమంతరావు, ఈసం వెంకటేశ్వర్లు, మోదుగు నరసింహారావు, పోతురాజు కృష్ణ, ఉప సర్పంచులు బాదావత్ నరేష్, నూనావత్ నవీన్, కుంజా రవిలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జూలూరుపాడులో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Namasthe Telangana02 Jun, 08:58 am
బచ్చన్నపేటలో మిన్నంటిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

బచ్చన్నపేట, జూన్ 2 : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని స్థానిక చౌరస్తాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్థూపానికి, ప్రజాకవి కాలోజీ నారాయణరావు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు అంటూ చేసిన నినాదాలతో చౌరస్తా మార్మోగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అల్వాల నర్సింగరావు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మహమ్మద్ ఫిరోజ్ మాట్లాడుతూ.. ఎందరో అమరవీరుల త్యాగాలు, సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. నాటి ఉద్యమ స్ఫూర్తిని గుండెల్లో ఉంచుకుని, రాష్ట్ర ప్రగతికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు కోనేటి స్వామి, గౌరవ సలహాదారులు నల్లగోని బాలకృష్ణ గౌడ్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గౌరవ సలహాదారులు బోడకుంటి మల్లయ్య, దొంతుల చంద్రమౌళి, అల్లాదుర్గం వెంకటేశ్వర్లు, ఫోరం ప్రధాన కార్యదర్శి రాపేల్లి వెంకటేశ్వర్లు గిరబోయిన బాల్ సిద్ధులు, ఎండీ జావిద్, షబ్బీర్, ముసిని శ్రీశైలం గౌడ్, అఖిల్ మాల, మల్లయ్య, వార్డు సభ్యులు కర్రె ప్రశాంత్, మినలాపురం మల్లేశం పాల్గొన్నారు.

Andhra Jyothy02 Jun, 03:14 am
అంబేడ్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ ఆవిర్భావం

అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ నంబర్ 3 ద్వారా తెలంగాణ ఏర్పాటైందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రాజకీయ పార్టీలకు అతీతంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. త్వరలోనే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారిని గౌరవిస్తామని మాటిచ్చారు. సిద్దిపేట జిల్లా, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Telangana Minister Ponnam Prabhakar) హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదికను చదివి మంత్రి వినిపించారు. అలాగే, హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను మంత్రి ఎగురవేశారు. హుస్నాబాద్ అంబేడ్కర్ సర్కిల్ దగ్గర జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ నంబర్ 3 ద్వారా తెలంగాణ ఏర్పాటైందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రాజకీయ పార్టీలకు అతీతంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. త్వరలోనే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారిని గౌరవిస్తామని మాటిచ్చారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. తెలంగాణ అనేది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదని, కోట్లాదిమంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పుకొచ్చారు. త్యాగాల పునాదులపై నిర్మితమైన తెలంగాణ, నేడు అభివృద్ధి సంక్షేమానికి చిరునామాగా నిలిచిందని ఉద్ఘాటించారు. తెలంగాణను ప్రజాపాలన ప్రభుత్వంలో మరింత సమానత్వంతో, మరింత ప్రగతితో ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Sakshi02 Jun, 01:05 am
వ వసంతంలోకి తెలంగాణ.. రాష్ట్రవ్యాప్తంగా ఘన సంబురాలు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా నేడు ఘన వేడుకలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ సహా జిల్లా కేంద్రాల్లో జరిగే ప్రధాన కార్యక్రమాలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు వేడుకల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ శాసనమండలిలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధన కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. ఇక తెలంగాణ ఉద్యమ ప్రముఖులు విజయశాంతి, కోదండరాం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. మరోవైపు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అంతకు ముందు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం పరేడ్‌ గ్రౌండ్స్‌లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గత ఏడాది పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్‌ కార్యాచరణపై సీఎం తన సందేశాన్ని ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. వేడుకల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. బేగంపేట, బోయినపల్లి, తిరుమలగిరి వైపు వెళ్లే మార్గాల్లో మధ్యాహ్నం వరకు వాహనాల రాకపోకలకు పరిమితులు విధించారు. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రజా ప్రతినిధుల కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తిచేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. భర్తతో కలిసి జపాన్ ట్రిప్‌లో రష్మిక.. ఇప్పటికీ దాచేస్తోంది!(ఫొటోలు) సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌.. అవతరణ అదిరేలా (ఫొటోలు) ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు) రాయల్‌ ఛాలెంజర్స్‌ రాజసం.. ఫైనల్‌లో దుమ్మురేపిన బెంగళూరు (ఫొటోలు) చైతూ 'మై లేడీ'.. శోభిత 'బంగారం'.. బర్త్ డే స్పెషల్ (ఫొటోలు) పేకాటలో ఫస్ట్ వస్తే టీచర్ ఉద్యోగం, సొల్లు కబుర్లు చెప్పడం కాదు నన్ను గెలవలేవ్ అన్నారు సీఎంగా మీ ముందుకొచ్చా నాకు అది ఇష్టం లేదు పెళ్లి, పిల్లలుపై క్లారిటీ ఇచ్చిన ప్రవల్లిక బెంగళూరులో జరగాల్సింది అహ్మదాబాద్ లో ..బాంబు పేల్చిన DK శివకుమార్