translateexpand_more

Janasena Party News

Latest updates from Telugu Digital news sources.

AP7AM01 Jun, 02:05 pm
పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ... తీవ్రంగా స్పందించిన జనసేన పార్టీ

తెలంగాణలో పవన్ కల్యాణ్ తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ'కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ చర్య పూర్తిగా అర్థరహితమని, రాజకీయ దురుద్దేశంతోనే తమ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని పార్టీ వర్గాలు ఆరోపించాయి.వివరాల్లోకి వెళితే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం' పేరిట ఓ ఇండోర్ కార్యక్రమం నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. సుమారు 2000 మంది పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ హాల్‌లో ఈ సమావేశం తలపెట్టారు. రాష్ట్ర అభివృద్ధిలో జనసేన పాత్ర, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతం వంటి అంశాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.అయితే, పార్కింగ్ సమస్యను కారణంగా చూపుతూ ప్రభుత్వం ఈ సభకు అనుమతి నిరాకరించింది. ఈ నిర్ణయాన్ని జనసేన తీవ్రంగా తప్పుబట్టింది. నిత్యం ఎన్నో సాంస్కృతిక, రాజకీయ, కార్పొరేట్ సమావేశాలు జరిగే సంధ్య కన్వెన్షన్‌లో, కేవలం తమ కార్యక్రమానికే పార్కింగ్ సమస్యను కారణంగా చూపడం సహేతుకం కాదని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వివాదం ముగిసిపోయిన అధ్యాయమని, ఆయనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని జనసేన గుర్తుచేసింది. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఉండబోవని స్వయంగా పవన్ కల్యాణ్ స్పష్టం చేశారని వెల్లడించింది. అయినప్పటికీ, ఆ వ్యవహారాన్ని సాకుగా చూపి సభను అడ్డుకోవడం సరికాదని పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

Oneindia Telugu31 May, 03:10 pm
జెన్ జీ యువత కోసం 'సేనా గళం' కమిటీ

సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ.. ముఖ్యంగా జెన్ జీ యువత ఆశయాలకు అనుగుణంగా గళం వినిపించడమే లక్ష్యంగా సేనా గళం అనే కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. సమకాలీన రాజకీయాల్లో రాజ్యాంగానికి కట్టుబడి, అన్ని వర్గాలకు గౌరవం ఇస్తూ, దేశ సమగ్రతకు భంగం కలగకుండా వ్యవహరించేలా ఈ కమిటీ పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.ముల్లును ముల్లుతోనే తీయాలి.. కాపులు తిడితే కాపులతోనే తిట్టించాలి. రెడ్లు , కమ్మవారు విమర్శిస్తే ఆ సామాజిక వర్గాలతోనే ప్రతి విమర్శ చేయించాలి. షెడ్యూలు కులాల వారు ఆరోపణలు చేస్తే అదే కులాలవారితో ఆరోపణలు చేయించాలి అనే బూర్జువా ధోరణిని తోసిరాజంటూ సేనా గళం పని చేయాలని స్పష్టం చేశారు. జనసేన అభ్యుదయ భావాలతో ముందుకు వెళ్లాలని.. పాతబడి బూజుపట్టిన విధానాలకు తిలోదకాలు ఇవ్వాలని జనసేనాని నిర్ణయించారు.⁠రాజకీయ పార్టీగా సామాజిక బాధ్యతతో జనసేన పార్టీ ముందుకు వెళ్తూ సేనా గళం ఏర్పాటు చేసినట్లు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో కొందరు వ్యక్తుల తప్పులను వారి వ్యక్తిగత చర్యలుగా కాకుండా, వారు చెందిన కులం, మతం లేదా వర్గాలతో ముడిపెట్టి సామాజిక విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇది సమాజంలో విద్వేషాలకు కారణం అవుతోందని అన్నారు.తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కొందరు కులం, మతం, ప్రాంతీయత వంటి భావావేశాల ముసుగు వేసుకుని దాక్కొనే ప్రయత్నం చేస్తున్నారనీ.. ఇటువంటి రాజకీయ సంస్కృతిని నేటి యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్న వాస్తవాన్ని అందరూ గుర్తించాలని అన్నారు. వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి తప్ప, సామాజిక వర్గాలను ఆ వ్యవహారంలోకి లాగకూడదనే స్పష్టమైన విధానాన్ని జనసేన పార్టీ అవలంబిస్తోందని పవన్ కల్యాణ్

NTV Telugu01 Jun, 04:32 pm
పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ

Janasena: హైదరాబాద్‌లో నిర్వహించాలనుకున్న జనసేన పార్టీ ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’కు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడంపై జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సభకు అనుమతి ఇవ్వకపోవడానికి పోలీసులు చూపిన కారణాలు సమంజసంగా లేవని, అవి కేవలం సాకుల్లా కనిపిస్తున్నాయని పార్టీ నేతలు విమర్శించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు పేర్కొనడాన్ని జనసేన ప్రశ్నించింది. ఒక రాజకీయ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలు, వాటికి ఇచ్చిన సమాధానాలు ఎలా లా అండ్ ఆర్డర్ సమస్యగా మారతాయని పార్టీ నేతలు ప్రశ్నించారు. అసలు ప్రాంతీయ భావోద్వేగాలను చర్చలోకి తీసుకువచ్చింది ఎవరో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, సభ నిర్వహించాలనుకున్న జనసేనపై మాత్రమే ఆంక్షలు విధించడం సరైన పద్ధతి కాదని పార్టీ అభిప్రాయపడింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా సెలెక్టివ్ నేరేటివ్స్, హాఫ్ కట్ వీడియోలను ప్రచారం చేస్తూ ముందుగానే సభను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించింది. అలాగే, కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ విరాళం అందించినప్పుడు ప్రాంతీయత గుర్తుకు రాలేదా అని పార్టీ ప్రశ్నించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సభ నిర్వహించాలనుకున్నప్పుడు మాత్రమే ప్రాంతీయ భావోద్వేగాల అంశాన్ని ముందుకు తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏమిటని నిలదీసింది.

Zee Telugu01 Jun, 01:36 pm
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు తెలంగాణ ప్రభుత్వం ఝలక్..భారీ బహిరంగ సభకు అనుమతి నిరాకరణ

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Janasena Sabha In Telangana: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో‌ జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించేందుకు తలపెట్టిన భారీ బహిరంగ సభకు తెలంగాణ ప్రభుత్వం బ్రేక్ వేసింది. రేపు గచ్చిబౌలి వేదికగా జరగాల్సిన 'తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ'కు అనుమతి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. దీంతో జనసేన పార్టీ తదుపరి కార్యచరణ ఏమిటంటూ ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా రెండు కారణాలను పోలీసులు, అధికార యంత్రాంగం పేర్కొంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అధికారిక ఉత్సవాలు జరుగుతుండటంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఉత్సవాల్లో భాగంగా భద్రతా కారణాలు, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ సభకు అనుమతి నిరాకరించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టుకు జనసేన? కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో జనసేన శ్రేణులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యాయి. సభ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో సభ నిర్వహణకు అనుమతి నిరాకరించడంతో జనసేన ముఖ్య నేతలు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రేపు ఉదయమే హైకోర్టును ఆశ్రయించాలని జనసేన లీగల్ టీమ్ యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ సభపై రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ వేడి రాజుకుంది. ఈ సభను వ్యతిరేకిస్తూ

Chitrajyothy31 May, 02:54 pm
ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నా.. పవన్ పై బండ్ల గణేష్ పోస్ట్ వైరల్

<p>పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), నిర్మాత బండ్ల గణేష్‌ (Producer Bandla Ganesh)ల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్‌ను తన ‘దేవుడు’గా కొలిచే బండ్ల గణేష్.. తరచూ ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన గురించి నా మనసులో ఉన్న విషయాలను ప్రపంచానికి చెప్తానంటూ బండ్ల గణేష్ వేసిన ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక వారం, పది రోజులుగా పవన్ కళ్యాణ్‌‌‌ని కొందరు ఎలా టార్గెట్ చేశారో తెలియంది కాదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. అంతా పవన్ జపమే. యూట్యూబ్‌ పెయిడ్ బ్యాచ్ అంతా దిగిపోయి, ఆయనని ఇబ్బంది పెట్టడానికి తెగ ట్రై చేస్తున్నారు. జనవరి 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’ పేరుతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున ఓ సభను నిర్వహించబోతున్నారు. దీనిని అడ్డుకునేందుకే అనేలా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ కనిపించని బ్యాచ్ కూడా డ్యూటీ ఎక్కారు. </p><div id="articlebodyAdsDiv"></div><br/><p>మరోవైపు పవన్ కళ్యాణ్ అనేటోడి గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలియజేయాలని ఉందని, ఆ క్షణం కోసం వేచి చూస్తున్నానని బండ్ల గణేష్ చేసిన పోస్ట్.. ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. బండ్ల గణేష్ తన పోస్ట్‌లో.. ‘‘పవన్ కళ్యాణ్ సార్ ముందు మనసు విప్పి మాట్లాడే అవకాశం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఆ రోజు వస్తే ఆయన గురించి నాకు తెలిసిన నిజాలను, ఆయన గొప్ప మనసును,

Samayam Telugu29 May, 08:22 am
పవన్ కళ్యాణ్ ఆయనకు పదవి ఇచ్చారు.. అందుకే జేడీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్ జనసేనను వీడారు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. తెలంగాణ, జాతీయ వార్తలు సైతం ఆయన రాస్తుంటారు. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. 2024 ఏపీ ఎన్నికల కవరేజీలో అత్యుత్తమ పనితీరు కనబర్చినదుకు గానూ తిరుమల బాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు. తిరుమల బాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ, సాక్షి మీడియా, టీవీ5 సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, బుక్స్ చదడానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

10TV Telugu25 May, 03:29 pm
Pawan Kalyan Interesting Comments on his movies Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన...

Pawan Kalyan Interesting Comments on his movies Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కెరీర్, సినీ ప్రయాణంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి పార్లమెంటరీ స్థాయ...

Zee Telugu26 May, 12:40 am
సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్,...

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ...

Andhra Jyothy28 May, 07:55 am
రూ.2 కిలో బియ్యం పథకం స్ఫూర్తితోనే అన్నా క్యాంటీన్లు

మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన నివాళులు అర్పించారు. అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం ఓ పోస్టు పెట్టారు. ‘కథానాయకుడిగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుని రాజకీయ జీవితంలోకి వచ్చి- ప్రజాపక్షం వహించిన దివంగత నేత ఎన్టీరామారావు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అందించిన సేవలు మరువలేనివి. ఎన్టీ రామారావు గారు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. రూ.2లకే కిలోబియ్యం పథకం ద్వారా పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో పని చేశారు. ఆ స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తోంది’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. మహానాడులో సీఎం చంద్రబాబు పంచ్ డైలాగ్స్ మహానాడులో లోకేశ్ సంచలన నిర్ణయం... మహిళలకు 33శాతం మహిళా రిజర్వేషన్ల ప్రతిపాదన

Samayam Telugu26 May, 01:13 am
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది....

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార...

Zee Telugu29 May, 01:38 pm
ప్రొఫెసర్ నాగేశ్వర్ కాలిగోటికి సరిపోడు.. పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజీ స్టార్

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Prof Nageshwar Case: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజీ స్టార్ అని తెలంగాణలోని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావును విమర్శించే స్థాయి పవన్ కల్యాణ్‌కు లేదని స్పష్టం చేశారు. నాగేశ్వర్‌ను అరెస్టు చేస్తే ముందు ప్రొఫెసర్‌ కన్న ముందు తనను అరెస్టు చేయాలని సవాల్‌ చేశారు. ఆంధ్రవాళ్లు ఇంకా తెలంగాణలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అమరావతికి వెళ్లిపోవచ్చు కదా అని పవన్‌ కల్యాణ్‌కు ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి సూచించారు. Also Read: TV Serial Chance: టీవీ సీరియల్‌ పేరిట డాక్టర్‌కు కుచ్చుటోపీ.. తీగలాగితే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం పాత బజార్ ప్రాంతంలో ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులకు సీఎస్‌ఆర్ ఫౌండేషన్ అరబిందో ఫార్మా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే అనిరుధ్‌ మీడియాతో మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మధ్య సాగుతున్న వివాదంపై స్పందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను విమర్శించే స్థాయి కాదని స్పష్టం చేశారు. ఆయన ఒక పొలిటికల్ ఎనలిస్టు అని.. ఆయనపై కేసులు ఎలా పెడతారని? ప్రశ్నించారు. Also Read: Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఏం జరిగిందంటే? జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్

Oneindia Telugu01 Jun, 01:51 pm
పవన్ కు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్.. నో పర్మిషన్

జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ కు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. జనసేన సభకు అనుమతి నిరాకరించింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, శాంతి భద్రతల దృష్ట్యా ఈ మేరకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించారు.ఇదే విషయంపై జనసేన నేత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తాము సభ పెట్టడం లేదని.. కేవలం సమావేశం మాత్రమే నిర్వహించుకుంటున్నామని తెలిపారు. కన్వెన్షన్ సెంటర్లలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుందని అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఎలాంటి కారణాలు లేకుండా తమ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని.. దీనిపై తాము హైకోర్టుకు వెళ్తామని తెలిపారు.మరోవైపు జనసేన సభకు ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని లీగల్ గా గెలిచి సభను ఏర్పాటు చేసుకుంటామని జనసేన నేతలు చెబుతున్నారు. ఇక ఇప్పటికే సభను అడ్డుకుంటామని తెలంగాణ వాదులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే అంశంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.&amp;nbsp;