translateexpand_more

Pawan Kalyan Janasena News

Latest updates from Telugu Digital news sources.

Eenadu31 May, 03:13 pm
జెన్ జీ కోసం సేనాగళం

అమరావతి: జనసేన పార్టీ సంస్థాగత కమిటీలపై ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ దృష్టి పెట్టారు. ఆదివారం పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘సేనాగళం’ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జెన్‌జీ గళం వినిపించడమే ‘సేనాగళం’ లక్ష్యమని వెల్లడించారు. అభ్యుదయ భావాలతో ఈ కమిటీ ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఏ కులం వారిని ఆ కులం వారితో తిట్టించే ధోరణి పోవాలన్నారు. వ్యక్తుల తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలని చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. స్కూటీపై సెల్ఫీ తీసుకుంటూ.. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ఘటన అల్లూరి జిల్లా పాడేరులో జరిగింది.

Zee Telugu01 Jun, 01:36 pm
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు తెలంగాణ ప్రభుత్వం ఝలక్..భారీ బహిరంగ సభకు అనుమతి నిరాకరణ

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Janasena Sabha In Telangana: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో‌ జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించేందుకు తలపెట్టిన భారీ బహిరంగ సభకు తెలంగాణ ప్రభుత్వం బ్రేక్ వేసింది. రేపు గచ్చిబౌలి వేదికగా జరగాల్సిన 'తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ'కు అనుమతి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. దీంతో జనసేన పార్టీ తదుపరి కార్యచరణ ఏమిటంటూ ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా రెండు కారణాలను పోలీసులు, అధికార యంత్రాంగం పేర్కొంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అధికారిక ఉత్సవాలు జరుగుతుండటంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఉత్సవాల్లో భాగంగా భద్రతా కారణాలు, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ సభకు అనుమతి నిరాకరించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టుకు జనసేన? కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో జనసేన శ్రేణులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యాయి. సభ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో సభ నిర్వహణకు అనుమతి నిరాకరించడంతో జనసేన ముఖ్య నేతలు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రేపు ఉదయమే హైకోర్టును ఆశ్రయించాలని జనసేన లీగల్ టీమ్ యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ సభపై రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ వేడి రాజుకుంది. ఈ సభను వ్యతిరేకిస్తూ

Eenadu01 Jun, 01:12 pm
హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ

హైదరాబాద్‌: రాయదుర్గంలోని సంధ్య కన్వెన్షన్ వేదికగా జూన్‌ 2న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం’ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు, శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించినట్లు వెల్లడించారు. దీనిపై శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తల్లూరి రామ్ జూన్ 2న సంధ్య కన్వెన్షన్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారు 2 వేల మంది కార్యకర్తలతో నిర్వహించాలనుకున్న జనసేన సాధకుల సమావేశానికి అనుమతి కోరినట్లు చెప్పారు. ‘‘సమావేశం అనుమతి విషయంపై దర్యాప్తు చేశాం. ఏపీలో ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ వ్యాఖ్యలపై నమోదైన కేసులు, వాటి కారణంగా తెలంగాణలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు, అలాగే కొందరు ఏపీ రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని దర్యాప్తులో తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, వ్యతిరేక ఆందోళనలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సమయంలో ఈ సమావేశం వల్ల భారీ స్థాయిలో నిరసనలు, ప్రదర్శనలు, ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడొచ్చు. ఈ పరిస్థితుల్లో సమావేశం నిర్వహిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది. మరోవైపు, సమావేశానికి వచ్చే సుమారు 2 వేల మంది కోసం సరిపడా పార్కింగ్ సదుపాయం లేదని వేదిక యాజమాన్యం ధ్రువీకరించింది. ఈ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని జనసేన సమావేశానికి అనుమతి నిరాకరించాం’’అని డీసీపీ తెలిపారు. జనసేన సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై జనసేన నేత మహేందర్‌రెడ్డి

Eenadu26 May, 03:19 pm
Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కలిసిన సినీ నిర్మాతలు

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను (Pawan Kalyan) తెలుగు సినీ నిర్మాతలు కలిశారు. రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న ఆయనతో సినీ నిర్మాతలు రవి శంకర్‌, సతీశ్‌, నాగవంశీ, సాహు గారపాటి తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పవన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు నష్టాల్లో నడుస్తున్నాయని, వాటి యజమానుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. మల్టీప్లెక్స్‌ తరహాలోనే వచ్చిన లాభాల్లో నిర్మాతల నుంచి కొంత పర్సంటేజీ ఇస్తే, థియేటర్లు నిలదొక్కుకుంటాయన్నారు. ప్రభుత్వ పరంగా చొరవ తీసుకుని ఒక నిర్దిష్టమైన పాలసీని రూపొందించాలని కోరారు. గత కొంతకాలంగా థియేటర్ల నిర్వహణ వ్యయం పెరిగిందని, నెల వారీ ఖర్చులు కూడా అధికమయ్యాయని వివరించారు. విద్యుత్‌ ఛార్జీల్లో రాయితీ ఇవ్వడం ద్వారా థియేటర్‌ యజమానులపై భారం తగ్గుతుందని పవన్‌ దృష్టికి తెచ్చారు. నిర్మాతలు చెప్పిన సమస్యలు విన్న విన్న డిప్యూటీ సీఎం పవన్‌ సానుకూలంగా స్పందించారు. సినీ రంగ సమస్యలు పరిష్కరించేలా దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని అభయమిచ్చారు. నిర్మాతలు చేసిన ప్రతిపాదనలను పరిశీలన చేయాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కు సూచించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. తమన్‌ సంగీతం అందిస్తున్న కొత్త చిత్రాల్లో ‘ఇట్లు అర్జున’ ఒకటి. ఇందులోని ఓ పాటను మరో మ్యూజిక్‌

Eenadu26 May, 06:39 am
Pawan: గోదావరిలోకి పరిశ్రమ వ్యర్థాలు.. డిప్యూటీ సీఎం పవన్‌ ఆగ్రహం

రాజమహేంద్రవరం: పవిత్ర గోదావరిలో కాలుష్య నివారణకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ రంగంలోకి దిగారు. తూర్పుగోదావరి జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా వెంకటనగరం వద్ద ఆంధ్రాపేపర్‌ మిల్స్‌ కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని పరిశీలించారు. పరిశ్రమ వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలస్తుండటంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాలని అధికారులను ఆదేశించారు. వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని, ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. గోదావరి కాలుష్య నివారణకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నట్టు పవన్‌ ఇప్పటికే ప్రకటించారు. డిప్యూటీ సీఎం వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌, స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు ఉన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu25 May, 09:57 am
రాజమహేంద్రవరం: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గోదావరి నదిలో పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను...

రాజమహేంద్రవరం: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గోదావరి నదిలో పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల గురించి పవన్‌కు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ క...

Eenadu25 May, 03:13 pm
రాజమహేంద్రవరం: అన్నీ పోగొట్టుకునేందుకు సిద్ధంగా ఉండి రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. కొన్ని...

రాజమహేంద్రవరం: అన్నీ పోగొట్టుకునేందుకు సిద్ధంగా ఉండి రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. కొన్ని వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ను ఉద్దేశించి ఆయన ఆగ్రహం వ్...

Eenadu29 May, 08:42 am
పారిశ్రామిక కాలుష్య నివారణకు నిరంతర తనిఖీలు చేయాలి

అమరావతి: ‘స్వచ్ఛ గోదావరి- పవిత్ర పుష్కరాల’ నేపథ్యంలో అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)కీలక ఆదేశాలు ఇచ్చారు. కాలుష్యరహిత గోదావరి, పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఆరు జిల్లాల్లో 262 పుష్కర పంచాయతీలను గుర్తించారు. మురుగురహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. మురుగు నీరు నేరుగా గోదావరిలో కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. మున్సిపాలిటీ సామర్థ్యానికి తగిన విధంగా మురుగు శుద్ధి ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. పీసీబీ మంజూరు చేసిన రూ.100 కోట్ల నుంచి కూడా నిధుల వినియోగించాలని ఆదేశించారు. రోజువారీ 104 మిలియన్ లీటర్ల మురుగునీరు జీవనదిని కలుషితం చేస్తోందన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి 8.38 మిలియన్ లీటర్ల మురుగు నీరు గోదావరిలో కలుస్తోందని పేర్కొన్నారు. పారిశ్రామిక వ్యర్థాల్లో ఆంధ్ర పేపర్‌ మిల్లు వెదజల్లే రోజువారీ కాలుష్యమే 32 మిలియన్ లీటర్లు ఉంటుందన్నారు. నిత్యం గోదావరిలో కలిసే 13.24 మిలియన్ లీటర్ల ఆక్వా కాలుష్యం వీటికి అదనమని పేర్కొన్నారు. పారిశ్రామిక కాలుష్య నివారణకు నిరంతర తనిఖీలు చేయాలని సూచించారు. ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూం ద్వారా నిరంతరం ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్‌కి కంట్రోల్ రూం నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.