translateexpand_more

Brs Nri Cell News

Latest updates from Telugu Digital news sources.

Telugu Times02 Jun, 12:42 pm
ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. ప్రవాసులకు మహేష్ బిగాల శుభాకాంక్షలు

Mahesh Bigala: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ బీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఓషియానియా వంటి అన్ని ఖండాల్లోనూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఎంతో ఉత్సాహంగా, ఘనంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. విశ్వవ్యాప్తంగా తెలంగాణ సంబరాలు.. అమెరికా, కెనడా, లండన్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, జర్మనీ, బహ్రెయిన్ ,ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, సహా గల్ఫ్ దేశాలు అలాగే ఆఫ్రికాలోని దక్షిణాఫ్రికా, టాంజానియా వరకు అనేక దేశాల్లో తెలంగాణ పండుగ వాతావరణం వైభవంగా కొనసాగుతోంది. మన రాష్ట్ర ఆత్మగౌరవాన్ని, ఉద్యమ విశేషాలను అంతర్జాతీయ సమాజానికి చాటిచెప్పేలా ఎన్‌ఆర్‌ఐలు ఈ కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో గర్వకారణమని ఆయన కొనియాడారు. ముఖ్య అతిథిగా కేటీఆర్.. ఈ సారి వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మలేషియాలో నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, కేటీఆర్ రాక కోసం మలేషియాలోని తెలుగు సంఘాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని మహేష్ బిగాల వెల్లడించారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమ త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్ర ప్రగతి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలను ఏకం చేయడానికి ఈ వేడుకలు ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తున్నాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ కీర్తిని మరింత పెంపొందించేందుకు ప్రతి ప్రవాస తెలంగాణవాసి బాధ్యతగా భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Brs Nri Cell News Keyword | Telugu Digital