translateexpand_more

Railway Safety News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu03 Jun, 09:19 am
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు

రైలు హారన్ సౌండ్ వినపడగానే ఎవరికైనా గుండెలదురుతాయి. ఎంతటివారైనా సరే భయంతో రైలు పట్టాలకు దూరంగా జరుగుతారు. కానీ ముంబైలో మాత్రం ఓ వ్యక్తి ఏకంగా రైలు ముందే.. అది కూడా పట్టాలపై అత్యంత తాపీగా నడుస్తూ అందరికి షాకిచ్చాడు. లోకో పైలట్ ఎంత గట్టిగా హారన్ కొడుతున్నా ఏమాత్రం పట్టించుకోని అతనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ముంబై లోని ఓ రైల్వే స్టేషన్ ‌నుంచి లోకల్ ట్రైన్ బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. రైలు కొద్ది దూరం వెళ్లగానే పట్టాలపై ఓ వ్యక్తి నడుస్తూ కనిపించాడు. అది గమనించిన లోకో పైలట్ అప్రమత్తమై వెంటనే రైలు వేగాన్ని తగ్గించాడు. ఆ వ్యక్తిని పట్టాల పైనుంచి పక్కకు తప్పుకోవాలంటూ నిరంతరాయంగా హారన్ కొడుతూ సంకేతాలు ఇచ్చాడు. అయితే, ఆ వ్యక్తిలో ఏమాత్రం చలనం లేదు. వెనకాలే రైలు వస్తున్నా, హారన్ మోత మోగుతున్నా దర్జాగా నడుస్తూనే ఉన్నాడు. ట్రైన్‌లో ఉన్న ప్రయాణికులు ఆ దృశ్యాన్ని చూసి షాకయ్యారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. కొంతమంది ఈ వింతను తమ మొబైల్ ఫోన్‌లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. “ఆ రోజు ఆ రైలు ఎందుకు ఆలస్యమైందో నాకిప్పుడు అర్థమైంది” అని ఒకరు కామెంట్ చేసారు..”అది బోరివిలి వెళ్లే ట్రైన్, ఆ సమయంలో నేను కూడా అదే రైలులో ఉన్నాను” అని మరొకరు రాసుకొచ్చారు. “జీవితంలో ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే చాలు ఎక్కడైనా బతికేయొచ్చు” అని కొందరు, “అతడు బాగా మందు తాగి ఉన్నట్టున్నాడు.. లేదంటే ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడా?” అని ఇంకొందరు కామెంట్లు చేసారు. ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్! ఈ కోడిని కూర వండుకుని తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష తప్పదు గొర్రెల కాపరి ఉద్యోగానికి భారీ క్యూ.. జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు

Railway Safety News Keyword | Telugu Digital