translateexpand_more

Raj Tarun News

Latest updates from Telugu Digital news sources.

Telugu Times02 Jun, 01:00 pm
హీరో రాజ్ తరుణ్ చేతుల మీదుగా పెళ్ళైంది కాని కహాని సినిమా పోస్టర్ లాంఛ్

శ్రీహరి హీరోగా నటిస్తున్న సినిమా “పెళ్ళైంది కాని NO కహాని”. ఈ చిత్రంలో స్మిత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని మై3 సినిమాస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఏడుకొండలు తాడిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ద్వారా రాబోతోంది. ఈ రోజు ఈ చిత్ర పోస్టర్ ను హీరో రాజ్ తరుణ్ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీహరి మాట్లాడుతూ – ఈరోజు మా సినిమా పోస్టర్ లాంఛ్ చేసేందుకు అతిథిగా వచ్చిన హీరో రాజ్ తరుణ్ గారికి థ్యాంక్స్. అలాగే గెస్ట్ గా వచ్చిన ఐఎఫ్ఎక్స్ అధినేత పద్మనాభరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నాం. “పెళ్ళైంది కాని NO కహాని” సినిమా చాలా బాగా వచ్చింది. మరో నెలన్నర సమయంలో మీ ముందుకు రిలీజ్ కు తీసుకురాబోతున్నాం. సినిమా ఆద్యంతం హిలేరియస్ ఫన్ తో ఎంటర్ టైన్ చేస్తుంది. డైరెక్టర్ ఏడుకొండలు గారు చాలా బాగా రూపొందించారు. హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ – “పెళ్ళైంది కాని NO కహాని” మూవీ పోస్టర్ లాంఛ్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ఈ మూవీ దర్శక నిర్మాతలు నాకు పరిచయం ఉన్నవారు. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను దర్శకుడు ఏడుకొండలు తెరకెక్కించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఈ మూవీ టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ చెబుతున్నా. అన్నారు. ఐఎఫ్ఎక్స్ అధినేత పద్మనాభరెడ్డి మాట్లాడుతూ – “పెళ్ళైంది కాని NO కహాని” సినిమా పోస్టర్ లాంఛ్ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈ చిత్ర హీరో శ్రీహరి గారితో పాటు టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. అన్నారు. డైరెక్టర్ ఏడుకొండలు తాడిశెట్టి మాట్లాడుతూ – మా “పెళ్ళైంది కాని NO కహాని” మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. రెండు మూడు రోజుల్లో సెన్సార్ కు సినిమా వెళ్తోంది. వచ్చే నెలలో చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. తెలుగు వారికి సంక్రాంతి పండుగ ఎంత సరదాగా ఉంటుందో, ఈ సినిమా కథాంశం కూడా అంతే ఎంటర్ టైనింగ్ సరదాగా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా కలిసి మూవీ చూడొచ్చు. అన్నారు. నటుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ – కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలనైనా మన ప్రేక్షకులు సక్సెస్ చేస్తారు. మేము కొత్త వాళ్లమైనా స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వస్తున్నాం. మా సినిమా నవ్వుల విందులా ఉంటుంది. మీకు మూవీ తప్పకుండా నచ్చుతుందనే గ్యారెంటీ ఇవ్వగలను. మూవీ మీకు నచ్చకపోతే టికెట్ రిటర్న్ ఇవ్వొచ్చు. అంత గ్యారెంటీ ఎంటర్ టైనర్ ఇది. మా డైరెక్టర్ సీన్స్ చెబుతున్నప్పుడే మా టీమ్ అంతా ఆ కామెడీని ఎంజాయ్ చేశాం. అన్నారు.

10TV Telugu02 Jun, 10:53 am
పెళ్ళైంది కాని నో కహాని’ పోస్టర్ రిలీజ్.. రాజ్ తరుణ్ చేతుల మీదుగా

Raj Tarun : శ్రీహరి, స్మిత జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘పెళ్ళైంది కాని నో కహాని’. మై3 సినిమాస్ బ్యానర్ పై ఏడుకొండలు తాడిశెట్టి దర్శకత్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఈ సినిమా. త్వరలో థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ ని హీరో రాజ్ తరుణ్ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దర్శక నిర్మాతలు నాకు పరిచయం ఉన్నవారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ సినిమా కూడా హిట్ అవ్వాలి అన్నారు. అనంతరం హీరో శ్రీహరి మాట్లాడుతూ.. మా సినిమా పోస్టర్ లాంఛ్ చేసేందుకు హీరో రాజ్ తరుణ్, ఐఎఫ్ఎక్స్ అధినేత పద్మనాభరెడ్డి గారికి కృతజ్ఞతలు. ‘పెళ్ళైంది కాని నో కహాని’ సినిమా బాగా వచ్చింది. నెలన్నరలో ఈ సినిమా రిలీజ్ కానుంది. సినిమా ఫుల్ ఫన్ ఎంటర్టైన్ చేస్తుంది అని అన్నారు. Also Read : Buchibabu Sana : ఎన్టీఆర్ పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్లి చేస్తా.. బుచ్చిబాబు కామెంట్స్ వైరల్.. డైరెక్టర్ ఏడుకొండలు తాడిశెట్టి మాట్లాడుతూ.. పెళ్ళైంది కాని నో కహాని సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండు మూడు రోజుల్లో సెన్సార్ కు సినిమా వెళ్తోంది. వచ్చే నెలలో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

Raj Tarun News Keyword | Telugu Digital