translateexpand_more

Rajya Sabha News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy03 Jun, 01:25 pm
కాంగ్రెస్ కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం తమ కీలక భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్‌కు రాజ్యసభ స్థానం కేటాయించింది. తమిళనాడు నుంచి రాజ్యసభ స్థానానికి జూన్ 18న ఎన్నిక జరుగనుంది. కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటును కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి విజయ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

'ఈనెల 18న తమిళనాడులో రాజ్యసభకు ఎన్నిక జరుగనుంది. ఆ రాజ్యసభ సీటును మా భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్‌కు కేటాయించాలని టీవీకే నిర్ణయం తీసుకుంది' అని విజయ్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మైలం నియోజకవర్గం నుంచి ఎన్నికైన రాష్ట్ర మాజీ మంత్రి సీవీ షణ్ముగం తన రాజ్యసభ స్థానానికి మే 7న రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జూన్ 8వ తేదీ వరకూ రిటర్నింగ్ అధికారి ముందు నామినేషన్లు దాఖలు చేసుకోవలసి ఉంటుంది. 9వ తేదీ ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 11వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఒకరు కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే జూన్ 18వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 వరకూ సెక్రటేరియట్‌లో పోలింగ్ నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి..

మమతకు షాక్.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా రెబల్ ఎమ్మెల్యే

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం