translateexpand_more

Ram Charan Mother Role News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu03 Jun, 06:10 am
రామ్ చరణ్ 'పెద్ది' సినిమాని రిజెక్ట్ చేసిన మలయాళీ బ్యూటీ.. నేను చేయను అని చెప్పిందట

Swasika Rejected Peddi: మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న 'పెద్ది' సినిమా రిలీజ్ దగ్గర పడింది. నేటి సాయంత్రం ఈ సినిమా ప్రీమియర్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించనున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ బయటపెట్టింది ఓ మలయాళ హీరోయిన్. 'పెద్ది' సినిమాలో నటించే ఛాన్స్‌ను వదులుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఎంతో మంది నటీనటులు తమకు చిన్న ఛాన్స్ వచ్చినా తనదైన గుర్తింపు తెచ్చుకువాలని కృషి చేస్తుంటారు. కానీ, ఈ బ్యూటీ ఏకంగా రామ్‌చరణ్ నటించిన 'పెద్ది' సినిమాలో నటించే ఛాన్స్ వదులుకుందట. అయింతే అందుకు ఓ పెద్ద కారణం ఉందని ఆమె చెబుతోంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? మలయాళ, తమిళ సినీ ఇండస్ట్రీల్లో సక్సెస్‌ఫుల్ నటిగా కొనసాగుతున్న హీరోయిన్ శ్వాసిక.. అందంతో పాటు నేచురల్‌గా పలికించే హావభావాలతో ఆమె ఎంతో ఫేమస్ అయ్యింది. అదే విధంగా తన అందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా 'పెద్ది' సినిమాలో నటించే అవకాశాన్ని తిరస్కరించిందట. అయితే ఆమెను చిత్రబృందం సంప్రదించింది హీరోయిన్ పాత్ర కోసం కాదు. హీరో రామ్‌చరణ్ తల్లి పాత్ర కోసం ఆమె దగ్గరకి వెళ్లారట. 'పెద్ది' సినిమాలో నటించే ఛాన్స్ అంటే నటి శ్వాసిక ఎంతో సంతోషించిదట. చిన్న పాత్ర అయినా పర్లేదు చేసేందుకు వెనుకాడను అని చెప్పిందట. అయితే ఈ సినిమాలో రామ్‌చరణ్ తల్లి పాత్రలో నటించాలని చిత్రబృందం చెప్పేసరికి ఆ అవకాశాన్ని వద్దని అనుకున్నారట. 34 ఏళ్ల వయసులో తల్లి పాత్రలు చేయడం ఇష్టం లేదని ఆమె ఈ సినిమాలో నటించే అవకాశాన్ని తిరస్కరించింద. తమిళ మూవీ 'లబ్బర్ పందు'లో హీరోయిన్‌ తల్లిగా నటించిన కారణంగా ఆమెకు ఇప్పటికీ తల్లి రోల్స్ వస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో తల్లి పాత్రలను రిజెక్ట్ చేస్తున్నట్లు చెప్పింది. ఈ క్రమంలో 'పెద్ది' సినిమాలో హీరో తల్లి పాత్ర నటించే అవకాశం వచ్చినా.. తనకు రామ్‌చరణ్ కు తల్లిగా నటించాలని ఇష్టం లేదంటూ ఆమె చెప్పింది. ఇందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగులో 'తమ్ముడు' (నితిన్ సినిమా)లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

Ram Charan Mother Role News Keyword | Telugu Digital