translateexpand_more

Ram Charan Peddi News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu01 Jun, 03:23 am
పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎందుకంత సీక్రెట్ గా దాచేస్తున్నారు

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది మూవీ చిత్రం మరో మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. జూన్ 4న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. జూన్ 3న రాత్రి ప్రీమియర్స్ తో షోలు ప్రారంభం అవుతాయి. పెద్ది చిత్రానికి సంబందించిన బిగ్గెస్ట్ ప్రమోషనల్ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని విజయవాడలో ప్లాన్ చేశారు. జూన్ 1న నేడు సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ లు ఎవరు వస్తారు అనేది ఇంకా రివీల్ చేయలేదు. ఈవెంట్ కి హాజరయ్యే అతిథుల విషయంలో చిత్ర యూనిట్ సీక్రెట్ మైంటైన్ చేస్తోంది. ఎందుకు ఇంతలా దాచేస్తున్నారు అనే అనుమానాలు అభిమానుల్లో నెలకొన్నాయి. అయితే కొన్ని రూమర్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కి హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మెగా బ్రదర్స్ ఇద్దరూ ఈవెంట్ కి హాజరైతే అభిమానుల్లో జోష్ వేరే లెవల్ లో ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరో ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఏ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడం లేదు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ ఈవెంట్ ని నిర్వహించనున్నారు. పెద్ది చిత్రంలో రాంచరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించగా శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బొమన్ ఇరానీ

Chitrajyothy01 Jun, 06:25 am
టాలీవుడ్ వర్క్ కల్చర్ పై దీపికాకు జాన్వీ కౌంటర్

టాలీవుడ్ సినిమా మేకింగ్ స్టైల్, వర్క్ కల్చర్‌పై బాలీవుడ్ భామల మధ్య సరికొత్త చర్చ నడుస్తోంది. తాజాగా యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సౌత్ సినిమా ఇండస్ట్రీ, ముఖ్యంగా టాలీవుడ్‌లో ఉండే పని వాతావరణాన్ని తెగ పొగిడేసింది. అయితే ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు పరోక్ష కౌంటర్ లాగా మారడంతో ఇప్పుడు సినీ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా నిలిచింది.

‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న జాన్వీ కపూర్ ఇక్కడి వర్క్ కల్చర్‌పై ప్రశంసలు కురిపించింది. ‘పెద్ది’ (Peddi) ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ.. ‘‘టాలీవుడ్‌లో వర్క్ కల్చర్ చాలా బాగుంది. ఇక్కడ పని గంటలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా లంచ్ బ్రేక్ సమయంలో నటీనటుల నుంచి టెక్నీషియన్ల వరకు అందరూ కాసేపు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత మళ్లీ సెట్స్‌పైకి వచ్చి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. నా అనుభవంలో నేను రోజుకు 9 గంటలకు మించి ఎప్పుడూ పని చేయలేదు’’ అంటూ టాలీవుడ్ టైం మేనేజ్‌మెంట్‌ను మెచ్చుకుంది. ‘దేవర’, ‘పెద్ది’.. ఈ రెండు సినిమాల సెట్స్‌లో తనకు ఎదురైన మధురమైన అనుభవాలనే ఇలా ఆమె పంచుకుంది.

అయితే, జాన్వీ చేసిన ఈ వ్యాఖ్యలు గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) చేసిన కామెంట్స్‌ను టార్గెట్ చేసినట్లు ఉన్నాయని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. గతంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘స్పిరిట్’ సినిమాలో ముందు ఆమెకే అవకాశం వచ్చింది. ఆ తర్వాత నడిచిన కొన్ని కాంట్రవర్సీల అనంతరం సౌత్ మేకింగ్ స్టైల్‌ను ఉద్దేశిస్తూ.. టాలీవుడ్‌లో

Eenadu01 Jun, 01:39 pm
ఏపీలో పెద్ది’ ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ .. టికెట్ ధర ఇలా

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘పెద్ది’ (Peddi Movie). రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో చిత్ర బృందం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. పాన్‌ ఇండియా మూవీగా విడుదలవుతున్న నేపథ్యంలో అందుకు తగినట్లుగానే కీలక నగరాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలు చిత్రాలు విడుదల ముందు రోజు కాదు కదా కొన్ని గంటల ముందు వరకూ బుకింగ్స్‌ ఓపెన్‌ కాక, అభిమానులు, సినీ ప్రేక్షకులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇందుకు అనేక అంశాలు కారణమైనా, అంతిమంగా టికెట్లు బుక్‌ కావడమే ప్రేక్షకుడు చూస్తాడు. ఈ విషయంలో ‘పెద్ది’ మూడు అడుగులు ముందే ఉంది. జూన్‌ 4న మూవీ విడుదల కానుండగా, జూన్‌ 3న రాత్రి 8 గంటలకు ప్రీమియర్స్‌ వేసేందుకు సిద్ధమైంది. ప్రీమియర్‌ టికెట్‌ ధరల పెంపు, స్పెషల్‌ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, సోమవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలోని పలు నగరాల్లో బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. అంతేకాదు, జూన్‌ 5న ఉదయ ఆటకు సంబంధించిన టికెట్స్‌ను కూడా కొన్ని థియేటర్స్‌ అందుబాటులోకి తెచ్చాయి. జూన్‌ 3 రాత్రి 8 గంటలకు స్పెషల్‌ ప్రీమియర్‌ షో వేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ షోకు టికెట్‌ ధర రూ.600 (జీఎస్‌టీతో కలిపి), అలాగే జూన్‌ 4 నుంచి 10 రోజుల పాటు ప్రస్తుతమున్న టికెట్‌ ధరలపై సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.100 చొప్పున, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 చొప్పున పెంచుకునేందుకు అవకాశమిచ్చింది. వీటితో పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు వీలు కల్పిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్‌

TV9 Telugu01 Jun, 12:43 pm
గ్రాండ్ గా పెద్ది మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీగా చేరుకున్న అభిమానులు

పెద్ది ఈవెంట్ గ్రాండ్ జరగనుండటంతో భారీగా అభిమానులు చేరుకోవడంతో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.. విజయవాడలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఏర్పాటు చేసిన మూవీ టీమ్.. రామ్ చరణ్ కటౌట్స్ తోపాటు బుచ్చిబాబు, జాన్వీకపూర్ కటౌట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా బుచ్చిబాబు పహిల్వాన్ గెటప్ లో ఉన్న కటౌట్స్ వైరల్ అవుతున్నాయి మరికాసేపట్లో పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్ మొదలు కానుంది. ఇప్పటికే స్టేడియం కు భారీగా అభిమానులు చేరుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా జూన్ 1వ తేదీన ( నేడు) విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు ‘పెద్ది’ టీమ్. ఈ వేడుకకు ‘పెద్ది’ చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.. అభిమానులు ఇప్పటికే స్టేడియం బయట భారీగా చేరుకున్నారు.. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Eenadu01 Jun, 09:58 am
థియేటర్ లో ఒకే ఒక్కడు.. ఓటీటీలో యాక్షన్ హంగామా మిస్సవ్వొద్దు

సంక్రాంతి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఆశించిన చిత్రాలేవీ రాలేదు. ఆ లోటును భర్తీ చేయడానికి సిద్ధమయ్యాడు ‘పెద్ది’ (Peddi Movie). రామ్‌చరణ్‌ కథానాయకుడి బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ఇది. జాన్వీకపూర్‌ కథానాయిక. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం (peddi songs) అందించారు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ఆసక్తిని పెంచిన ఈ మూవీ జూన్‌ 4న (Peddi release date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకరోజు ముందుగానే జూన్‌ 3న (peddi premiere show) రాత్రి 8గంటలకు ప్రీమియర్‌ షోలతోనూ సందడి చేయనుంది. ఏపీలో ఇప్పటికే ఇందుకు సంబంధించిన అనుమతులు రాగా, తెలంగాణలో ఏం జరుగుతుందో చూడాలి. పెద్ది రన్‌ టైమ్‌ (Peddi run time) సుమారు మూడు గంటలపైనే ఉంటుందని టాక్‌. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ (Dhurandhar: The Revenge) భారత్‌లో ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ‘జియో హాట్‌స్టార్‌’ వేదికగా జూన్‌ 5 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. జూన్‌ 4న రాత్రి 7 గంటలకు డిజిటల్‌ ప్రీమియర్‌ ప్రదర్శించనున్నట్లు తెలిపింది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. మిగిలిన దేశాల్లో సినీ అభిమానులు ఈ మూవీని ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Dhurandhar 2 OTT) వేదికగా చూడొచ్చు. మలయాళ అగ్ర హీరోలు మమ్ముట్టి (Mammootty), మోహన్‌లాల్‌ (Mohanlal) కలిసి నటించిన సినిమా ‘పేట్రియాట్‌’ (Patriot Movie). ఈ మూవీ ‘జీ 5’ (Zee 5) వేదికగా జూన్‌ 5 (Patriot Movie Streaming date) నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉండనుంది. దేశభక్తితో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. నయనతార,

TV9 Telugu01 Jun, 05:01 pm
మీకోసం చేతులు విరగకొట్టుకోవడమే కాదు రక్తం చిందిస్తా

రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఇదివరకు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదివరకే ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం దేశవ్యాప్తంగా ముమ్మరంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. విజయవాడలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లా లేదు .. సక్సెస్ మీట్ లా ఉంది. విజయవాడలో చెయ్యాలని అనుకున్నాం.. ఇది మాకు లక్కీయాస్ట్ సిటీ.. ఆ లక్కు కోసమే ఇక్కడకి వచ్చాము.. పెద్ది అన్ని విజువల్స్ చూశారు.. ఎన్నో కథలు వింటుంటాం.. కొన్ని కథలు నచ్చుతాయి, కొన్ని కథలు ఆశ్చర్యపరుస్తాయ్.. కానీ పెద్ది కథ నా గుండెలను తాకిన కథ.. నిజంగా ఇలాంటి సినిమాలు పదేళ్లకు ఒకసారి వస్తాయ్. పెద్ది సినిమా చాలా చేసింది.. వ్యక్తిగతంగా నన్ను ఒక మంచి దారిలోకి మార్చింది.. ఒక యాక్టర్ గా చాలా సంతృప్తి ఇచ్చింది. ఇది మామూలు సబ్జెక్ట్ కాదు.. కిందకి పడి.. పడిన మనిషి లేని ఎలా నిల్చుంటాడో తెలిసేలా చేసిన కథ ఇది.. ఇలాంటి కథ కోసం కాకపోతే ఎప్పుడు కష్టపడతాం..? బహుశా మగధీర, రంగస్థలం, ట్రిపుల్ ఆర్ తర్వాత నాకు పెద్దిలో ఆ అద్భుతం కనిపిస్తుంది.. రాసిపెట్టుకోండి.. ఇండియాలో నెంబర్ 3,4లో టాప్ డైరెక్టర్స్‌లో బుచ్చిబాబు పేరు ఉంటుంది. ఇలాంటి సినిమా ఒప్పుకోవడానికి కారణం అభిమానులే.. మీకోసం చేతులు విరగకొట్టుకోవడమే కాదు రక్తం చిందిస్తా.. నాకు తెలిసింది సినిమా మాత్రమే.. చనిపోయేవరకు ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాం.. అలాగే రెహమాన్ గారు 280 రోజులు మేం పని చేస్తే.. దానికి ప్రాణం పోస్తున్నారు.. ఆయనకు థ్యాంక్యూ.. జాన్వీ గారిని చూసి శ్రీదేవి గారు ఎక్కడున్నా గర్వంగా, ఆనందంగా ఫీల్ అవుతుంటారు.. ఎప్పుడైనా ఆట ఓడిపోతే.. ఒక దేశం మొత్తం ఓడిపోయినట్లు.. అలాగే ఈ పెద్ది గాడు ఆటాడలేదు.. పోరాడాడు.. పెద్ది గాడి ఆత్మగౌరవాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్తారని మనస్పూర్తిగా దుర్గమ్మను కోరుకుంటున్నాను.. మీ కుటుంబ సభ్యులను అడిగానని చెప్పండి..

Eenadu01 Jun, 04:30 pm
తెలుగులో మాట్లాడిన జాన్వీ.. జగదేక వీరుడు..’ డైలాగ్ తో నవ్వులు పంచిన బ్యూటీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతి మనిషి జీవితానికి అర్థం ఏంటనేది కనుక్కోవడమే ‘పెద్ది’ మూవీ ఇచ్చే సందేశమని కథానాయిక జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) అన్నారు. రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది. జూన్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన ప్రీరిలీజ్‌ వేడుకలో జాన్వీ తెలుగులో మాట్లాడి అలరించారు. ‘‘మీరు చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంది. ‘పెద్ది’పైనా ఇలాంటి ప్రేమే చూపిస్తారని ఆశిస్తున్నా. అదే మాకు రోజూ కష్టపడి పనిచేయడానికి బలాన్ని ఇస్తుంది. మేము చేసే ప్రతి పని మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికే. నా జీవితానికి అర్థం అంటే.. మిమ్మల్ని (ప్రేక్షకులు) అలరించడమే. మేము చేసిన ఈ మూవీ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈ మూవీలో నటించే అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు’ అని జాన్వీ అన్నారు. ఈ సందర్భంగా జగదేకవీరుడు అతిలోక సుందరిలోని శ్రీదేవి చెప్పిన ‘మానవ.. ఒక్కసారి నీ వామహస్తమును నాకు అందించి నన్ను ఆదుకొనవా’ అన్న డైలాగ్‌లోను వేదికపై చెప్పి నవ్వులు పూయించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ‘పెద్ది’. జాన్వీకపూర్‌ కథానాయిక. జూన్‌ 4న పాన్‌ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిఖిల్‌ కథానాయకుడిగా భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ (Swayambhu). రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ‘పెద్ది’. జాన్వీకపూర్‌ కథానాయిక.

Telugu Cinema01 Jun, 07:34 am
హిందీ ఓపెనింగ్ కీలకం

రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన “పెద్ది” (Peddi) సినిమా మరో మూడు రోజుల్లో మన ముందుకు రానుంది. తెలుగునాట కళ్ళు చెదిరే ఓపెనింగ్ రాబట్టుకునేలా ఉంది. సినిమాకి సూపర్ హైప్ వచ్చింది. ఐతే, తెలుగులో ఓపెనింగ్ బాగుంటుంది, సినిమా బాగుంటే రెండు వారాలు కుమ్మి పారేస్తుంది అని కచ్చితంగా చెప్పొచ్చు. మరి హిందీ పరిస్థితి ఏంటి? ఇప్పటికే హిందీ కోసం ఢిల్లీలో ఈవెంట్, భోపాల్ లో ఈవెంట్, ముంబై లో ప్రెస్ మీట్ పెట్టి రామ్ చరణ్ ప్రచారం చేశాడు. ఐతే, పెద్ది హిందీ ట్రైలర్ కి పెద్ద ఊపు రాలేదు. స్పందన కూడా తక్కువే ఉంది అని యూట్యూబ్ మిలియన్ వ్యూస్ చెప్తున్నాయి. ఐతే, హిందీ మార్కెట్ లో ఓపెనింగ్ రోజు వచ్చే కలెక్షన్లు తక్కువే ఉన్నా ఆ తర్వాత ఊపందుకొని కళ్ళు చెదిరే హిట్స్ కొట్టిన సినిమాల లిస్ట్ పెద్దదే పుష్ప సినిమాకి అలాగే జరిగింది. ధురంధర్ చిత్రం విషయంలోనూ అదే జరిగింది. ఐతే మొదటి వీకెండ్ కనీసం గౌరవప్రదమైన అమౌంట్ పోస్ట్ చేసి, మంచి టాక్ తెచ్చుకుంటే ఓవరాల్ కలెక్షన్లు భారీగా ఉంటాయి. పెద్ది విషయంలో అలాగే జరుగుతుంది అని నిర్మాతల నమ్మకం. మొదటి రోజు భారీ ఓపెనింగ్ రాకపోయినా… సినిమా విడుదలైన తర్వాత టాక్ తో సూపర్ గా పుంజుకుంటుంది అని భావిస్తోంది ఈ సినిమా టీం. ఒక్క తెలుగు మార్కెట్ కలెక్షన్లతో ఈ సినిమా బడ్జెట్ ని రాబట్టుకోవడం కష్టం. అలాగే తెలుగులో మాత్రమే పెద్ద హిట్ ఐతే కలెక్షన్ మొత్తం మూడు, నాలుగు వందలే కనిపిస్తుంది. 800, 1000 కోట్ల భారీ అమౌంట్ కనపడాలంటే హిందీ మార్కెట్ కీలకం.

TV9 Telugu01 Jun, 04:09 pm
నా జీవితానికి అర్ధం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే

మెగా స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. జూన్ 4న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా పీ రిలీజ్ ఈవెంట్ ను విజయవాడలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నటుడు జాన్వీ మాట్లాడుతూ..మాట్లాడుతూ.. తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. మీరు మా పై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పెద్ది సినిమా పై కూడా ఇదే ప్రేమ చూపిస్తారని అనుకుంటున్నా.. ఈ సినిమా చాలా స్పెషల్.. ఈ సినిమాలో చాలా విషయం ఉంది.. మీ జీవితానికి అర్ధం ఏంటి అనేది ఈ సినిమాలో చూస్తారు. నా జీవితానికి అర్ధం మిమ్మల్ని అలరించడం, సినిమాలు చేయడం.. నా ఐడెంటిటీ ఈ భూమితో, మీతో కనెక్ట్ అయ్యి ఉంది. మేము చేసిన ఈ సినిమా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా.. ఈ సినిమా నాకు చాలా ఇచ్చింది. చరణ్ తో నటించే ఛాన్స్ ఇచ్చింది.. బుచ్చి బాబు నాకు తెలిసిన మోస్ట్ ప్యాషినేట్ డైరెక్టర్.. సినిమా టీమ్ అందరూ సినిమా కోసం బెస్ట్ ఇచ్చారు.. మీరందరూ ఇలా వస్తే మా కష్టానికి ఫలితం దక్కిందని అనుకుంటున్నా.. అంటూ అద్భుతంగా తెలుగులో మాట్లాడింది జాన్వీ. ప్రేక్షకులు దేవుళ్ళు అని మా అమ్మ చెప్తుంటుంది. జగదేకవీరుడు సినిమాలోని శ్రీదేవి చెప్పిన డైలాగ్ చెప్పిన జాన్వీ..

Eenadu01 Jun, 04:09 pm
మైండ్ బ్లోయింగ్ .. చరణ్ ఇంత కష్టపడ్డారా? మస్స మస్స’ ఫుల్ సాంగ్

విజయవాడ: రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ‘పెద్ది’ (Peddi). జాన్వీకపూర్‌ కథానాయిక. జూన్‌ 4న పాన్‌ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం చిత్ర బృందం విజయవాడలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఇందులో క్రేజీ పాట ‘మస్స మస్స’ పాటను విడుదల చేశారు. ఇందులో మూవీ మేకింగ్‌ విజువల్స్‌, రామ్‌చరణ్‌ పడిన కష్టం చూస్తుంటే మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంది.

Andhra Jyothy31 May, 10:03 am
విజయవాడలో పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్

గ్లోబల్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయవాడ వేదిక కానుంది. ఈ చిత్రం విడుదలకు ముందు భారీ స్థాయిలో అభిమానులను ఆకట్టుకునేలా ఈ వేడుకను నిర్వహించేందుకు చిత్రబృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అమరావతి, మే 31, (ఆంధ్రజ్యోతి): గ్లోబల్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ (Global Star Ram Charan) నటిస్తున్న భారీ చిత్రం పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు (Peddi Movie) విజయవాడ వేదిక కానుంది. ఈ చిత్రం విడుదలకు ముందు భారీ స్థాయిలో అభిమానులను ఆకట్టుకునేలా ఈ వేడుకను నిర్వహించేందుకు చిత్రబృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు(సోమవారం) సాయంత్రం 5 గంటల నుంచి ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ వేడుకలో హీరో రామ్ చరణ్‌తో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొననుంది. హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్‌ సందడి చేయనుండటంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పటికే విజయవాడ నగరంలో మెగా అభిమానుల సందడి కనిపిస్తోంది. ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానుల కోసం ప్రత్యేక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు కూడా చేపడుతున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్‌కు ముందు నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ సినిమా ప్రమోషన్లలో కీలక ఘట్టంగా మారనుంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ హాజరుకానుండటంతో

Chitrajyothy31 May, 09:52 am
సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్ చిత్రం

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్‌ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ జూన్ 4న విడుదల కానుంది. జూన్ 1న విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్.. దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా మంచు బ్రదర్స్ హడావుడి.. సందీప్ వంగా సమర్పణలో రోమాంచకం, టైటిల్ లుక్ పోస్టర్ విడుదల.. తన కుమార్తె పెళ్లికి ప్రధాని మోదీని ఆహ్వానించిన సీనియర్ నటి ఖుష్భూ.. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండిక!

Chitrajyothy31 May, 06:53 pm
చిరంజీవి వారసుడిలా నా వారసుడు కూడా ఎదగాలి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’ (Peddi) దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోన్న విషయం తెలిసిందే. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు సిద్ధమైంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నైలో జరిగిన గ్రాండ్ ప్రెస్ మీట్‌లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈ కార్యక్రమంలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి (Chiranjeevi) బిగ్గెస్ట్ స్టార్. ఆయన స్థాయిని అందుకోవడం అంత తేలిక కాదు. అయితే ఆయన కుమారుడిగా రామ్ చరణ్ కొత్త ప్రమాణాలను నెలకొల్పి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక ఐడెంటిటీ, ఇమేజ్ సంపాదించుకోవడం చాలా కష్టం. కానీ ఆయన వారసత్వాన్ని ఘనంగా నిలబెట్టాడు రామ్ చరణ్. నా వారసుడు కూడా సంగీతంలో ఇలానే ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను.

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. కీరవాణి, మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్, థమన్ వంటి అద్భుతమైన సంగీత దర్శకులు ఉన్న పరిశ్రమలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కథను బుచ్చిబాబు చెప్పినప్పుడు నాకు చాలా స్ఫూర్తిగా అనిపించింది. చాలా మంచి కథ, మట్టి కథ ఇది. ఈ చిత్రానికి పని

Andhra Jyothy31 May, 01:28 am
తిరుపతిలో సెటిలవుతా.. ఆ సినిమాలో నాకన్న ముందు నా సోదరినే అనుకున్నారు

అప్పుడెప్పుడో ఎన్టీఆర్‌ సరసన ‘దేవర’లో మెరిసి, బాలీవుడ్‌ చెక్కేసిన జాన్వీ కపూర్‌... ఈసారి ‘పెద్ది’తో జోడి కట్టి జోరు మీదుంది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ రస్టిక్‌ లుక్‌తో కనిపిస్తుంటే... అచ్చియమ్మగా తన గ్లామర్‌లుక్‌తో ఆకట్టుకుంటోంది జానూ. ఈ సందర్భంగా ఆమె చెబుతున్న కొన్ని క్యూట్‌ కబుర్లివి...

‘పెద్ది’ సినిమాలో హీరోయిన్‌గా ముందు నా సోదరి ఖుషీకపూర్‌ అనుకున్నారు బుచ్చిబాబు. కానీ ఆ తర్వాత ఆ ఆఫర్‌ నా దగ్గరకి వచ్చింది. అచ్చియమ్మగా ఓ విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల్ని అలరించడానికి వస్తున్నా.

నేనుండేది ముంబాయిలో కానీ హైదరాబాద్‌ నాకు రెండో ఇల్లుగా అనిపిస్తుంది. ఇక నుంచి రెగ్యులర్‌గా తెలుగుతో పాటు.. తమిళ సినిమాల్లో కూడా కనిపించాలనుకుంటున్నా.

నాకు వేటికైనా ముద్దు పేర్లు పెట్టడం అలవాటు. పెంపుడు జంతువులకే కాదు... కొన్నిసార్లు వస్తువులకు కూడా ముద్దుపేర్లు పెట్టేస్తుంటా. అలా నా వాటర్‌ బాటిల్‌కి ‘చుస్కీ’ అని పేరు పెట్టా.

నేను జ్యోతిషం నమ్ముతా. నాది మీనరాశి. ఈ రాశిలో పుట్టినవారు ఎక్కువగా పగటికలలు కంటారట. అదేం మహిమో తెలియదుగానీ నాకూ ఆ అలవాటు ఉందండోయ్‌...

ఒంటరిగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. నేను చాలా ఎమోషనల్‌ పర్సన్‌. నా చుట్టూ ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండాల్సిందే.

నాకొక వింత అలవాటు ఉంది. కొన్నిసార్లు నాలో నేను మాట్లాడుకుంటుంటా. అది కూడా ఎప్పుడో తెలుసా? నాన్నకు చెప్పని, చెప్పలేని విషయాలను అలా మాట్లాడుకోవడం అలవాటుగా మారింది.

చిన్నప్పుడు నాన్నతో సిగరెట్‌ మానిపించడానికి... బాత్‌రూమ్‌లోకి సిగరెట్స్‌ తీసుకు వెళ్లి వాటికి టూత్‌పేస్ట్‌ పూసేదాన్ని. అలాగే సిగరెట్స్‌ కనిపిస్తే వాటిని విరిచేసేదాన్ని. అంత కోపంగా ఉండేది వాటిని చూస్తే.

అమ్మ చనిపోయాక

AP7AM30 May, 06:08 am
అందరికీ నచ్చాల్సిన పనిలేదు.. మా కష్టాన్ని గుర్తించండి

సినిమాలు థియేటర్లలోకి రాకముందే సోషల్ మీడియాలో కొందరు వాటి భవిష్యత్తుపై తీర్పులు ఇచ్చేస్తున్న ట్రెండ్‌పై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. తన నియంత్రణలో లేని అభిప్రాయాల గురించి ఆలోచించే కన్నా, తన పనిపైనే దృష్టి పెడతానని ఆయన స్పష్టం చేశారు.ఓ సినిమాను చూడకుండానే దానిపై విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేయడం గురించి ఐఏఎన్‌ఎస్‌తో మాట్లాడుతూ చరణ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "దీనిపై నాకంటూ ప్రత్యేక అభిప్రాయం లేదు. మన నియంత్రణలో ఉన్నది మాత్రమే మనం చేయగలం. నాకు అర్థం కాని, అదుపు చేయలేని విషయాలపై నేను స్పందించను. నా పని నేను చేసుకోవాలి" అని చెర్రీ అన్నారు.రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా విడుదల తేదీ రెండుసార్లు మారడంతో ఆన్‌లైన్‌లో దీనిపై విస్తృతమైన చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే చరణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. "మేం మా పని పట్ల నిజాయతీగా ఉన్నాం. చివరికి మేం సంతోషంగా ఉన్నాం. ప్రతి ఒక్కరికీ మా పని నచ్చాల్సిన అవసరం లేదు. కానీ, కనీసం మా శ్రమను గుర్తిస్తారని ఆశిస్తున్నా. వారికి అది నచ్చకపోయినా పర్వాలేదు" అని చరణ్ వివరించారు.బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న 'పెద్ది' ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. ఇందులో రామ్ చరణ్ క్రికెట్, రెజ్లింగ్, స్ప్రింటింగ్ వంటి మూడు క్రీడల్లో రాణించే అథ్లెట్‌గా కనిపించనున్నారు. జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ వంటి భారీ తారాగణం న‌టించిన‌ ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'మగధీర'తో స్టార్‌డమ్

TV9 Telugu01 Jun, 04:45 pm
నిజాయితీ గల హీరో కథను నమ్మి తీస్తే ఎలా ఉంటుందో పెద్ది చూస్తే తెలుస్తుంది

పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బుచ్చిబాబు మాట్లాడుతూ.. సినిమా రెండు రోజుల్లో విడుదల కానుంది టెన్షన్ గా ఉంది. న చేతులు కాళ్లు వణుకుతున్నాయి. ఉప్పెన తర్వాత ఐదేళ్ల తర్వాత సినిమా చేశా.. ఉప్పెనకు అవార్డు వచ్చింది.. ఇన్నేళ్లు ఎందుకు టైం తీసుకున్నా అంటే పెద్ది కోసమే తీసుకున్నా.. ఉప్పెన స్టోరీ ఇక్కడ విజయవాడలోనే రాశా.. ఉప్పెన తర్వాత ఎవరితో చేయాలా అనుకుంటున్నపుడు సుకుమార్ చరణ్ గారికి పరిచయం చేశారు.. దేవుడికి దండం పెట్టుకొని చరణ్ కు స్టోరీ చెప్పా.. పెద్ది కమర్షియల్ సినిమా కాదు.. ఇది ఎమోషనల్ మూవీ, ఒక ఆటగాడి సినిమా.. ఒక ఆట ఎలాంటి గుర్తింపు తెస్తుంది అనేది చూపిస్తుంది.. ఈ జర్నీలో చరణ్ గారితో గడిపిన క్షణాలు మర్చిపోలేనివి.. రెండో సినిమాకే మీలాంటి స్టార్ ఇవ్వడం మాములు విషయం కాదు.. నా కథను నమ్మారు.. ఓ నిజాయితీ గల హీరో కథను నమ్మి తీస్తే ఎలా ఉంటుందో పెద్ది చూస్తే అర్ధమవుతుంది. క్లైమాక్స్ చూసినప్పుడల్లా నాకళ్ళ వెంట నీళ్ళలొచ్చాయ్.. చాలా మంది అదే చెప్పారు. లాస్ట్ 40నిముషాలు చాలా ఎమోషనల్ గా ఉంటుంది.. సినిమా జూన్ 4న విడుదలవుతుంది ఫ్యామిలీతో వెళ్లి చూడండి.. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది ఈ సినిమాలో చూస్తారు. నన్ను నమ్మినందుకు మిమ్మల్ని ఎప్పడూ మర్చిపోలేను.. జీవితంలో రుణపడి ఉంటా.. జానీ నటనలో హీరోయిజం ఉంటుంది.. క్లైమాక్స్ లో జాన్వీ నటన అద్భుతంగా ఉంటుంది. రెహమాన్ గారు అందించిన సాంగ్స్ అన్ని హిట్ అయ్యాయి.. ఈ సినిమాకు రెహమాన్ గారు మ్యూజిక్ చేయడం అనేది నా చిరకాల కోరిక అది పెద్దితో నెరవేరింది. రామ్ చరణ్ సార్.. మీరు లేకపోతే నేను లేను..అంటూ ఎమోషనల్ అయ్యారు బుచ్చిబాబు. ఫ్యామిలీతో సినిమాచూడండి.. పెద్దితో ఆడతారు, పాడతారు.. పెద్ది మీవెంట వస్తాడు.. చరణ్ గారి నటన చూస్తే మీకు కన్నీళ్లు కచ్చితంగా వస్తాయి అంటూ చెప్పుకొచ్చారు బుచ్చిబాబు.

Asianet News Telugu29 May, 02:05 pm
పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది మూవీ గ్రాండ్ రిలీజ్ కి అన్ని ఏర్పాట్లు చక చకా పూర్తవుతున్నాయి. టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. భోపాల్ జరిగిన మ్యూజిక్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ముంబైలో లాంచ్ చేసిన ట్రైలర్ ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. బుచ్చిబాబు ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఇదిలా ఉండగా జూన్ 4న రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని అసలు ఎందుకు చూడాలి అని ప్రశ్నించుకున్నప్పుడు 5 కారణాలు కనిపిస్తాయి. అవేంటో అప్పుడు చూద్దాం. రాంచరణ్ ఈ చిత్రంలో నట విశ్వరూపం ప్రదర్శించినట్లు ప్రచారం జరుగుతోంది. నటన మాత్రమే కాదు క్రికెటర్ గా, కుస్తీ వీరుడిగా, రన్నర్ గా కనిపించేందుకు చరణ్ తన ఫిజిక్ ని మార్చుకున్న విధానం అద్భుతం అని అంటున్నారు. రాంచరణ్ నటనలో, బాడీలో ఇంకెన్ని వేరియేషన్స్ ఉంటాయో సినిమా చూసే తెలుసుకోవాలి. కొన్ని సన్నివేశాల్లో చరణ్ నటన కంటతడి పెట్టించేలా ఉంటుంది అంటూ ప్రచారం జరుగుతోంది. ముందు నుంచి జాన్వీ కపూర్ గ్లామర్ ని హైలైట్ చేస్తూ వస్తున్నారు. ట్రైలర్, సాంగ్స్ లో జాన్వీ గ్లామరస్ గా కాస్త కొంటెతనం ఉన్న అమ్మాయిలా కనిపిస్తోంది. రాంచరణ్, జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెద్ది కనుక హిట్టై, అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ వస్తే బుచ్చిబాబు నేరుగా క్రేజీ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. బుచ్చిబాబుకి ఇది రెండవ చిత్రం మాత్రమే. బుచ్చిబాబు పెద్ది చిత్రంతో ఇచ్చే సర్ప్రైజ్ ఎలిమెంట్స్

Eenadu30 May, 02:00 pm
స్టార్ డమ్ ను వదిలి విజయ్ రాజకీయాల్లో రావడం హర్షణీయం

చెన్నై: సినీ కెరీర్‌ అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు, ఆ స్టార్‌డమ్‌ను వదిలి ప్రజాసేవ కోసం నటుడు విజయ్‌ రాజకీయాల్లోకి రావడం హర్షణీయమని కథానాయకుడు రామ్‌చరణ్‌ (Ram Charan) అన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో ఆయన నటించిన తాజా చిత్రం ‘పెద్ది’. జూన్‌ 4న (peddi movie release date) పాన్‌ ఇండియా మూవీగా విడుదల కానుంది. జాన్వీకపూర్‌ కథానాయిక. చిత్ర ప్రచారంలో భాగంగా చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో రామ్‌చరణ్‌, దర్శకుడు బుచ్చిబాబు, నటుడు శివరాజ్‌కుమార్‌, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడారు. ‘‘సీఎం జోసెఫ్‌ విజయ్‌ను చూసి సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా నేను ఎంతో గర్వపడుతున్నా. విజయ్‌తో పాటు తమిళనాడు ప్రజలకు శుభాకాంక్షలు. చెన్నై వచ్చినప్పుడల్లా సొంత ఊరికి వచ్చినట్లు అనిపిస్తుంది. మా కుటుంబానికి ఈ నగరంతో ఎంతో అనుబంధం ఉంది. ‘పెద్ది’ కోసం మేమంతా రెండున్నరేళ్లు కష్టపడ్డాం. నేను 285 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నా. మా దర్శకుడు బుచ్చిబాబు (peddi movie director) అయితే.. ఐదారేళ్లు కష్టపడ్డాడు. ఏఆర్‌ రెహమాన్‌ అద్భుతమైన పాటలు ఇచ్చారు. గత పది, పదిహేను రోజులుగా నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు. శివన్న తెరపై కనిపిస్తే ఒక ఫైర్‌ వచ్చినట్లు అనిపిస్తుంది. ‘జైలర్‌’లో ఆయన ప్రజెన్స్‌ గూస్‌బంప్స్‌ వచ్చేలా ఉంటుంది. కళ్లతోనే హావభావాలు, నటన పలికిస్తారు’’ ‘‘రోబో’ సహా ఎన్నో అద్భుతమైన సినిమాలకు రత్నవేలు పనిచేశారు. ఆయన ప్రతి ఫ్రేమ్‌ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాకు ఆయన అనుభవం ఎంతో పనికొచ్చింది. దివ్యేందు (divyenndu in peddi), నేను ఒకే ఎత్తు ఉన్నా, సినిమాలో మా యాటిట్యూడ్‌ ఆరున్నర అడుగుల పైనే ఉంటుంది. ఈ సినిమాను కష్టంతో కాదు, ఇష్టంతో చేశాం.

NTV Telugu29 May, 03:22 pm
నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో

Jagapathi Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు, వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు తన నటనతో, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్, నటన గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నటుడు కాకపోతే మీరు ఏమయ్యేవారు? అనే ప్రశ్నకు జగపతి బాబు సమాధానమిస్తూ.. “నిజం చెప్పాలంటే నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం తెలియదు. ఆ విషయంలో నేను పూర్తిగా జీరో. నా లైఫ్‌లో, నా డిక్షనరీలోనే యాక్టింగ్ అనేదే లేదు అనుకుంటే నేను ఏమైపోయేవాడినో నాకే తెలియదు. నాకు బయట ఏదో చేసేయాలి, సాధించేయాలి అనే తపన కూడా అస్సలు ఉండదు. నాకున్న తపన, కసి అంతా ఒట్టి యాక్టింగ్‌లోనే చూపిస్తాను. నా తృప్తి అంతా నటనలోనే ఉంది” అని ఆయన చెప్పుకొచ్చారు. కెరీర్‌లో ఒకే రకమైన పాత్రలు చేయడం తనకు అస్సలు నచ్చదని జగపతి బాబు స్పష్టం చేశారు. “నేను చేసిన పాత్రలనే మళ్లీ మళ్లీ చేస్తే నాకు బోర్ కొట్టేస్తుంది. అందుకే ఎవరైనా సరికొత్త పాత్రతో నా ముందుకు వస్తే కచ్చితంగా చేయాలనుకుంటాను. కొత్తదనం ఉంటేనే నాకు చేయడానికి బాగుంటుంది” అని అన్నారు. దర్శకులతో పనిచేసే విధానం గురించి మాట్లాడుతూ.. “కొత్త డైరెక్టర్ అయినా, సీనియర్ డైరెక్టర్ అయినా నేను వాళ్లను ఒకటే అడుగుతాను.. ‘నేను ఏం చేయగలనో పక్కన పెట్టండి, ఈ పాత్ర కోసం మీకేం కావాలో చెప్పండి’ అని అడుగుతాను. వాళ్ల విజన్ ఏంటో చెబితేనే పాత్రలో కొత్తదనం వస్తుంది. లేదంటే నేను గతంలో చేసిన యాక్టింగే

NTV Telugu23 May, 05:23 pm
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!

- రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా రగ్గడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ నుంచి ఇప్పటికే విడుదలైన అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్‌బస్టర్ సాంగ్స్, మైండ్ బ్లోయింగ్ థియేట్రికల్ ట్రైలర్‌తో ఈ చిత్రం దేశవ్య... - ఈ క్రమంలో ఈరోజు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో కనీవినీ ఎరుగని రీతిలో ‘పెద్ది కి ఆవాజ్’పేరిట బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించారు.ఈ గ్రాండ్ వేడుకలో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్, ఆయన బృందం లైవ్ పర్ఫార్మెన్స్‌తో స్టేజ్... - వేలాదిగా తరలివచ్చిన జనసందోహం మధ్య జరిగిన ఈ ఈవెంట్‌లో మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్… మీడియాలో వైరల్ అవుతున్నాయి.

NTV Telugu26 May, 11:10 am
Jagapathi Babu: ‘పెద్ది’ లో ‘పెద్దాయన’ పని అయిపోయింది.. డబ్బింగ్ కంప్లీట్ చేసిన అప్పలసూరి!

Jagapathi Babu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’. ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీలో కీలకమైన ‘అప్పలసూరి’ పాత్ర పోషిస్తున్న సీనియర్ నటుడు జగపతి బాబు తన డబ్బింగ్‌ను పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఒక ఇంటెన్స్ డబ్బింగ్ వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకోగా.. అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. జగ్గు భాయ్ షేర్ చేసిన ఈ వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అప్పలసూరి పాత్ర కోసం ఆయన డబ్బింగ్ చెబుతూ చూపించిన హావభావాలు, పలికిన భావోద్వేగ డైలాగులు థియేటర్లలో ఏ రేంజ్ రచ్చ ఉండబోతుందో హింట్ ఇస్తున్నాయి. ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. డబ్బింగ్‌లో జగ్గు భాయ్ చూపించిన ఇంటెన్సిటీకి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. “అప్పలసూరి క్యారెక్టర్ సినిమాలో నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మేకర్స్‌ గతంలో ఈ సినిమాలో జగపతి బాబు పోషిస్తున్న ‘అప్పలసూరి’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు సోషల్ మీడియాలో ఆ లుక్ ఎంత వైరల్ అయిందో తెలిసిన విషయమే. నిజానికి ఎప్పుడూ స్టైలిష్ విలన్‌గానో లేదా క్లాస్ తండ్రి పాత్రల్లోనో కనిపించే జగపతి బాబు, ఈ సినిమాలో ఊహించని మేకోవర్‌తో ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. చెదిరిన జుట్టు, ఒత్తైన గడ్డం, దారంతో కట్టిన విరిగిన కళ్లజోడుతో ఒక రా అండ్ ఇంటెన్సివ్ లుక్‌లో కనిపించారు. తాజాగా ఆయన ఈ సినిమాలో తన పాత్రకు

Eenadu29 May, 05:06 am
ఆ రెండేళ్ల కష్టాలకు.. ప్రతిఫలం దక్కింది

ఇంటర్నెట్‌ డెస్క్: అప్పలసూరిగా ‘పెద్ది’లో తన నటనతో ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు నటుడు జగపతి బాబు (Jagapathi Babu). రామ్ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా (Peddi) జూన్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు తన కెరీర్‌ గురించి మాట్లాడారు. మన కష్టానికి తగిన ఫలితం కచ్చితంగా లభిస్తుందన్నారు. ‘‘సినిమా రంగంలో ఉన్నంత ఆనందం నాకు ఇంక ఎందులోనూ కనిపించదు. ఇందులో ఏదైనా సాధ్యమవుతుంది. సహజంగా నా జీవితంలో ప్రతిదీ ఆలస్యంగా వస్తుంది. కెరీర్‌లో కూడా మొదట ఫ్లాప్‌ల నుంచి హిట్‌లకు వచ్చాను. అందుకే పరాజయాలను పెద్దగా పట్టించుకోను. ఏదో ఒకరోజు విజయం తప్పక వస్తుంది నమ్ముతా. జీవితం మన అంచనాలకు అందదు. తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. కానీ, ప్రతి ఒక్కరికి కష్టాలు కామన్‌గా ఉంటాయి. నేనూ ఎన్నో కష్టాలు పడ్డాను. ఇలా జరిగిందేంటని ఎప్పుడూ బాధపడలేదు. వాటి నుంచి ఏదో కొత్త పాఠం నేర్చుకున్నాను. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని ఎప్పుడూ నమ్ముతాను. బాధ వెనక సంతోషం కచ్చితంగా ఉంటుంది. నేను 2011 నుంచి 2013 వరకు ఎంతో బాధ అనుభవించా. దానికి తగిన సంతోషం ఇప్పుడు వచ్చింది. నా టైమ్‌ ఇప్పుడు స్టార్ట్‌ అయింది అనుకుంటున్నా’’ అని జగపతి బాబు అన్నారు. సినిమాల విషయంలో ఎప్పుడూ ఒత్తిడికి గురి కాలేదని జగపతి బాబు ఈ సందర్భంగా తెలిపారు. ఫ్యామిలీ ఇష్యూ కాకుండా ఇంకా దేనిని పెద్ద సమస్యగా తీసుకోనని అన్నారు. ‘పెద్ది’లో తనకు, రామ్ చరణ్‌కు (Ram Charan) మధ్య ఉండే బంధం అందరికీ నచ్చుతుందన్నారు. చరణ్ అన్ని సినిమాలకు కష్టపడతారని.. ఈ చిత్రంలో శరీరాకృతిని మార్చుకోవడం కోసం

Eenadu28 May, 09:09 am
పెద్ది’ పైరసీకి అడ్డుకట్ట.. మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు

ఇంటర్నెట్‌ డెస్క్: ‘పెద్ది’ సినిమా పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఈ సినిమాకు యాంటీ-పైరసీ ఇంజంక్షన్‌ జారీ చేసింది. సినిమా కాపీరైట్‌కు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు వెకేషన్ బెంచ్‌ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ సినిమాను (Peddi) ఇంటర్నెట్‌లో అక్రమంగా అప్‌లోడ్ చేయడం, ప్రసారం చేయడం, కాపీ చేయడాన్ని నిరోధిస్తూ న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది. సినిమా అనధికారికంగా ఇంటర్నెట్‌లో లీక్ అయితే నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుందని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ‘యాంటీ పైరసీ ఇంజంక్షన్‌’ (Anti-Piracy Injunction) అనేది కాపీరైట్ హక్కుదారులు తమ కంటెంట్ (సినిమాలు, వెబ్‌సిరీస్‌లు) అక్రమంగా కాపీ కాకుండా, పైరసీ వెబ్‌సైట్లలో ప్రసారం కాకుండా కోర్టుల ద్వారా పొందే ఒక న్యాయపరమైన రక్షణ ఉత్తర్వు. ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసిన వెంటనే, కొత్త యూఆర్‌ఎల్‌తో అదే కంటెంట్‌ రాకుండా కొత్త సైట్‌లను కూడా ఆటోమెటిక్‌గా బ్లాక్ చేయడానికి ఈ ‘డైనమిక్ ఇంజంక్షన్’ (Dynamic Injunction) ఉత్తర్వులను కోర్టులు జారీ చేస్తుంటాయి. గతకొంత కాలంగా ఇండస్ట్రీని పైరసీ బూతం వెంటాడుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల కూడా విజయ్‌ ‘జననాయగన్‌’ విడుదలకు ముందే నెట్టింట ప్రత్యక్షమైంది. ఇలాంటివి జరగకుండా ‘పెద్ది’ టీమ్‌ ముందడుగు వేయడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ జూన్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలు దీనిపై అంచనాలు పెంచేశాయి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన

Eenadu26 May, 05:12 am
Divyenndu: ఆయన కోసమైనా ‘పెద్ది’లో నటించాలని అనుకున్నా: దివ్యేందు శర్మ

ఇంటర్నెట్‌ డెస్క్: ‘పెద్ది’ డైరెక్టర్‌ బుచ్చిబాబుపై ప్రశంసలు కురిపించారు బాలీవుడ్‌ నటుడు దివ్యేందు శర్మ. ఆయన కోసమైనా ‘పెద్ది’ చేయాలని అనుకున్నట్లు చెప్పారు. రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం ‘పెద్ది’. ఇందులో దివ్యేందు శర్మ కీలక పాత్రలో నటించారు. జూన్‌ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా దివ్యేందు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ సినిమా అంగీకరించడానికి కారణం వెల్లడించారు. ‘‘నేను ఉత్తరాఖండ్‌లో షూటింగ్‌లో ఉన్నప్పుడు ఈ చిత్ర బృందం నుంచి ఫోన్‌ వచ్చింది. వీలున్నప్పుడు వస్తాను అని చెప్పా. తర్వాత ‘మిమ్మల్ని కలవాలి’ అని బుచ్చిబాబు (Buchi Babu) చాలా మెసేజ్‌లు పెట్టారు. దీంతో నేను ఆ షూట్‌ మధ్యలోనే ఆపేసి ఎంతోసేపు ప్రయాణించి చాలా కష్టపడి అక్కడినుంచి ఇక్కడికి వచ్చాను. బుచ్చిబాబును చూసి ఆశ్చర్యపోయాను. ఎంతో ప్రేమతో వ్యవహరించారు. కళకు ఎంత గౌరవం ఇస్తారో చూశాను. నా పాత్రను వివరించేటప్పుడే నిర్ణయించుకున్నా. ఈ సినిమా (Peddi) ఎలా ఉన్నా బుచ్చిబాబు కోసం చేయాలి అని. వెంటనే ఓకే చేశా. ఆయన నన్ను అంత ప్రభావితం చేశారు’’ అని దివ్యేందు (Divyenndu) తెలిపారు. ఇక పెద్ది కథ గురించి మాట్లాడుతూ..‘‘స్టోరీ చూసి షాక్‌ అయ్యాను. ఎంత గొప్పగా రాశారో అనుకున్నా. ఎన్నో ట్విస్ట్‌లు, గొప్ప గొప్ప పాత్రలు ఉన్నాయి. గుర్తింపు కోసం ఎంత యుద్ధమైనా చేయొచ్చని ఈ సినిమా చూశాక అర్థం అవుతుంది. ‘పెద్ది’ తన గుర్తింపు కోసం ఎంతో పోరాడతాడు. ఆ అంశం నాకు చాలా నచ్చింది’’ అని చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ

Samayam Telugu01 Jun, 10:47 am
ఐపీఎల్ సమరం ముగిసింది.. పెద్ది’తో ఇండస్ట్రీ కరువు తీరుతుందా

సమ్మర్ సీజన్ లో కీలకమైన మే నెల ముగిసింది. టాలీవుడ్ బాక్సాఫీస్ బోసిపోయింది. థియేటర్లన్నీ వెలవెలబోయాయి. మార్చి, ఏప్రిల్ నెలల మాదిరిగానే 'మే' కూడా వృధాగా పోయింది. వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ.. వచ్చిన సినిమాలన్నీ వచ్చినట్టే వెళ్లిపోయాయి. ఒక్కటంటే ఒక్క హిట్ కూడా పడలేదు. అన్నీ కలుపుకొని పాతిక సినిమాల వరకూ విడుదలయ్యాయి కానీ.. బాక్సాఫీస్ దగ్గర నిలబడిన సినిమా ఒక్కటి కూడా లేదు. తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం', కమెడియన్ సత్య 'జెట్లీ', సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన', రవిబాబు 'రేజర్', నందు 'అగ్లీ స్టోరీ' సినిమాలు మే నెలలో రిలీజ్ అయ్యాయి. 'వీరభద్రుడు', 'పేట్రియాట్', 'దృశ్యం 3', 'రాజా శివాజీ', 'బ్లాస్ట్' లాంటి డబ్బింగ్ చిత్రాలతో పాటుగా 'మరీచిక', 'రమణి కల్యాణం', 'పురుషః' వంటి మరికొన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిల్లో 'వీరభద్రుడు' మూవీ మాత్రమే తెలుగులో ఓ మోస్తరు వసూళ్లను రాబట్టింది. మిగతావన్నీ తీవ్ర నిరాశ పరిచాయి. మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయాయి.'నిన్ను కోరి', 'అతిథి', '1 నేనొక్కడినే' లాంటి రీ-రిలీజ్ సినిమాలు కూడా ఇదే నెలలో వచ్చాయి. మహేష్ బాబు క్రేజ్ తో ఉన్నంతలో కాస్తో కూస్తో కలెక్షన్స్ వచ్చాయి. ఓవరాల్ గా చూసుకుంటే, మే నెలలో చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. థియేటర్లలో సందడి కనిపించలేదు. కొన్ని సిమిమాలకు జనాలు లేక షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి వచ్చింది. అంతో ఇంతో అంచనాలు పెట్టుకున్న చిత్రాలు సైతం ఆకట్టుకోలేకపోయాయి. దీంతో తీవ్ర నష్టాలతో మే నెల టాలీవుడ్ బాక్సాఫీస్ ముగిసింది.అయితే సమ్మర్ సీజన్ మరీ ఇంత డల్ గా ఉండటానికి 'ఇండియన్ ప్రీమియర్ లీగ్' క్రికెట్ ( IPL 2026 ) ఒక కారణమనే

TV9 Telugu27 May, 11:42 am
మాస్ నుంచి ఎమోషన్స్ వైపు హీరోల మలుపు.. ఇప్పుడు కన్నీళ్లు గ్యారెంటీ

సీనియర్లు మాత్రమే కాదు.. ఈ జనరేషన్ హీరోల అడుగులు సైతం ఎమోషనల్ కథల వైపే వెళ్తున్నాయి. ఒక్కసారైనా కంటతడి పెట్టించే కథ చేయకపోతే ఎలా అన్నట్లు.. అంతా మూకుమ్మడిగా అలాంటి మనసును కదిలించే కథలనే ఎంచుకుంటున్నారు. రామ్ చరణ్ అయితే ఈ రేసులో అందరికంటే ముందున్నారు. మరి ఆయనతో పోటీ పడుతున్న హీరోలెవరో చూద్దాం.. రంగస్థలంకు ముందు రామ్ చరణ్‌తో మాస్ సినిమాలే వర్కవుట్ అవుతాయనుకున్నారంతా. కానీ సిట్టిబాబు వచ్చాక సీన్ అంతా మారిపోయింది. ఆఫ్టర్ రంగస్థలం చరణ్ నటనలో మెచ్యూరిటీ పెరిగింది. RRRలో ఎమోషనల్ సీన్స్‌తో ఏడిపించారు. గేమ్ ఛేంజర్‌లో అప్పన్నగా అలరించారు. ఇప్పుడు పెద్దిలో మరోసారి ఎమోషనల్ డ్రామా పండిస్తున్నారు మెగా వారసుడు. పెద్ది కమర్షియల్ సినిమాలాగే కనిపిస్తున్నా.. హై రేంజ్ ఎమోషనల్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు బుచ్చిబాబు. ముఖ్యంగా ఢిల్లీ ఎపిసోడ్ కన్నీరు పెట్టిస్తుందంటున్నారు. ప్రభాస్ సైతం హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీలో ఎమోషన్స్‌తో మ్యాజిక్ చేయబోతున్నారు. సీతా రామం తర్వాత మనసును కదిలించే మరో కథతో రాబోతున్నారు హను. దానికి ప్రభాస్ స్టార్ పవర్ హెల్ప్ కానుంది. విజయ్ దేవరకొండ సైతం మనసు మార్చుకుని.. ఎమోషన్స్ వైపు పరుగులు పెడుతున్నారు. రణబాలి, రౌడీ జనార్ధన విభిన్నమైన జోనర్స్‌లో వస్తున్నాయి. ఆ తర్వాత హాయ్ నాన్న ఫేమ్ శౌర్యుతో హైలీ ఎమోషనల్ కథకు ఓకే చెప్పారు రౌడీ బాయ్. కిరణ్ అబ్బవరం సైతం చెన్నై లవ్ స్టోరీతో మనసు బరువెక్కిస్తానంటున్నారు. మొత్తానికి ఎమోషనల్ సినిమాల ట్రెండ్ మొదలైందిప్పుడు. సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు US Visa Rules: ‘అమెరికా ఫస్ట్’ కొత్త

NTV Telugu27 May, 03:24 am
పెద్ది ఫస్ట్ ట్రైలర్ మిక్డ్స్ రెస్పాన్స్.. సెకండ్ ట్రైలర్ రిలీజ్ కు మేకర్స్ ప్లాన్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది‘ ప్రమోషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి.జూన్ 4న పెద్ది వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పటివరకు విడుదలైన కంటెంట్‌లో కేవలం పాటలు సినిమాపై హైప్ పెంచగా ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం ఆశించినంత లేకపోవడంతో ఫ్యాన్స్ కొంత డిజప్పోయింట్ అయ్యారు. ట్రైలర్ ఏమంత కొత్తగా లేదని అనేక సినిమాల రిఫరెన్సులు కనిపించాయని ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పుడు ఒక పవర్‌ఫుల్ మాస్టర్ ప్లాన్‌ రెడీ చేస్తున్నారు. సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు ‘సెకండ్ ట్రైలర్‘ అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ రిలీజ్ ట్రైలర్‌లో ఇప్పటివరకు చూపించని అసలు కథను రివీల్ చేయబోతున్నారట. ముఖ్యంగా ఈ చిత్రంలో హైలైట్‌గా నిలిచే ఎమోషన్ మరియు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఇంటెన్సిటీని ఈ సెకండ్ ట్రైలర్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. కథలోని అసలైన సంఘర్షణ ఏంటనేది ఈ ట్రైలర్‌తో స్పష్టత రానుంది. అంతేకాదు ఈ పవర్‌ఫుల్ ట్రైలర్‌లో రామ్ చరణ్ అల్టిమేట్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ థియేటర్లలో విజిల్స్ వేయించే రేంజ్ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, మరియు గూస్‌బంప్స్ తెప్పించే ఎలివేషన్స్ ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సెకండ్ ట్రైలర్ కట్ మెగా ఫ్యాన్స్‌కు థియేటర్లలో ఫుల్ మీల్స్ గ్యారెంటీ ఇస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ సరికొత్త అస్త్రంతో ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!

Samayam Telugu29 May, 04:15 pm
పెద్ది’ ప్రీరిలీజ్ ఈవెంట్ .. తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలి వేడుక.. ఎప్పుడంటే

రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని ‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ రైటింగ్‌లో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2025లో సమయంలో చేరిన రాజశేఖర్.. సినిమా రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌లు, విశ్లేషణలు, స్పెషల్ స్టోరీలు రాస్తున్నారు. సినిమాల గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. సోషల్ మీడియా పోస్టులను ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. రాజశేఖర్ జేఎన్‌టీయూ-హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ నుంచి ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ పొందారు. తుపాకీ న్యూస్, ఏబీపీ దేశం, ఇండియా హెరాల్డ్ డాట్ కామ్ లాంటి మీడియా సంస్థల్లో సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు. 2019 ఎన్నికల టైంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి