translateexpand_more

Peddi Movie Updates News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy31 May, 10:03 am
విజయవాడలో పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్

గ్లోబల్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయవాడ వేదిక కానుంది. ఈ చిత్రం విడుదలకు ముందు భారీ స్థాయిలో అభిమానులను ఆకట్టుకునేలా ఈ వేడుకను నిర్వహించేందుకు చిత్రబృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అమరావతి, మే 31, (ఆంధ్రజ్యోతి): గ్లోబల్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ (Global Star Ram Charan) నటిస్తున్న భారీ చిత్రం పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు (Peddi Movie) విజయవాడ వేదిక కానుంది. ఈ చిత్రం విడుదలకు ముందు భారీ స్థాయిలో అభిమానులను ఆకట్టుకునేలా ఈ వేడుకను నిర్వహించేందుకు చిత్రబృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు(సోమవారం) సాయంత్రం 5 గంటల నుంచి ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ వేడుకలో హీరో రామ్ చరణ్‌తో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొననుంది. హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్‌ సందడి చేయనుండటంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పటికే విజయవాడ నగరంలో మెగా అభిమానుల సందడి కనిపిస్తోంది. ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానుల కోసం ప్రత్యేక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు కూడా చేపడుతున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్‌కు ముందు నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ సినిమా ప్రమోషన్లలో కీలక ఘట్టంగా మారనుంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ హాజరుకానుండటంతో

NTV Telugu26 May, 11:10 am
Jagapathi Babu: ‘పెద్ది’ లో ‘పెద్దాయన’ పని అయిపోయింది.. డబ్బింగ్ కంప్లీట్ చేసిన అప్పలసూరి!

Jagapathi Babu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’. ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీలో కీలకమైన ‘అప్పలసూరి’ పాత్ర పోషిస్తున్న సీనియర్ నటుడు జగపతి బాబు తన డబ్బింగ్‌ను పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఒక ఇంటెన్స్ డబ్బింగ్ వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకోగా.. అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. జగ్గు భాయ్ షేర్ చేసిన ఈ వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అప్పలసూరి పాత్ర కోసం ఆయన డబ్బింగ్ చెబుతూ చూపించిన హావభావాలు, పలికిన భావోద్వేగ డైలాగులు థియేటర్లలో ఏ రేంజ్ రచ్చ ఉండబోతుందో హింట్ ఇస్తున్నాయి. ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. డబ్బింగ్‌లో జగ్గు భాయ్ చూపించిన ఇంటెన్సిటీకి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. “అప్పలసూరి క్యారెక్టర్ సినిమాలో నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మేకర్స్‌ గతంలో ఈ సినిమాలో జగపతి బాబు పోషిస్తున్న ‘అప్పలసూరి’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు సోషల్ మీడియాలో ఆ లుక్ ఎంత వైరల్ అయిందో తెలిసిన విషయమే. నిజానికి ఎప్పుడూ స్టైలిష్ విలన్‌గానో లేదా క్లాస్ తండ్రి పాత్రల్లోనో కనిపించే జగపతి బాబు, ఈ సినిమాలో ఊహించని మేకోవర్‌తో ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. చెదిరిన జుట్టు, ఒత్తైన గడ్డం, దారంతో కట్టిన విరిగిన కళ్లజోడుతో ఒక రా అండ్ ఇంటెన్సివ్ లుక్‌లో కనిపించారు. తాజాగా ఆయన ఈ సినిమాలో తన పాత్రకు

NTV Telugu28 May, 02:39 am
పెద్ది దుబాయ్ సెన్సార్ టాక్.. ఈ కథను ఒప్పుకోవడం ఒక పెద్ద సాహసమే

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేయగా, తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ సెన్సార్ టాక్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దుబాయ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దుబాయ్ సెన్సార్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం, సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్ సీన్స్ నుంచి సినిమా వేరే లెవెల్‌కు చేరుకుంటుందని టాక్. ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాల్లో రామ్ చరణ్, సీనియర్ నటుడు జగపతిబాబుల మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయట. వీరిద్దరి నటనను ప్రేక్షకులు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేలా బుచ్చిబాబు డిజైన్ చేశారని ఇన్సైడ్ టాక్.ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ‘పెద్ది’ మూవీ ప్రేక్షకులను ఎమోషనల్ రైడ్‌కు గురి చేస్తుందని సమాచారం. రామ్ చరణ్ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ను కంటతడి పెట్టించబోతున్నారట. దర్శకుడు బుచ్చిబాబు సన టేకింగ్, కథను నడిపించిన తీరు థియేటర్లలో ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఇంతటి పవర్‌ఫుల్ ఎమోషనల్ క్లైమాక్స్ రాలేదనే రేంజ్‌లో దుబాయ్ టాక్ వినిపిస్తోంది. ఒక స్టార్ హీరో అయి ఉండి రామ్ చరణ్ ఇంతటి ఇంటెన్స్ ఎమోషనల్ కథను ఒప్పుకోవడం నిజంగా ఒక పెద్ద సాహసమనే చెప్పాలి. సినిమా మొత్తానికి సెకండాఫ్‌లోని చివరి 45 నిమిషాలు అతిపెద్ద

TV9 Telugu01 Jun, 03:14 am
విజయవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్.. అందరి కళ్లు ఆ గ్రాండ్ వేడుకపైనే

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ హేప్ క్రియేట్ చేయగా, ప్రస్తుతం అందరి కళ్ళు ఈరోజు జరగబోయే గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పైనే పడ్డాయి. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ ప్రమోషన్స్‌లో భాగంగా, మేకర్స్ నేడు (జూన్ 1) విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ వేడుక కోసం మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి టీమ్ సభ్యులు చాలా తక్కువ సమాచారాన్ని మాత్రమే పంచుకున్నారు. కానీ, ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల ముందుకు వస్తుంది పెద్ది టీమ్. ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ.. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సినిమా విశేషాలను పంచుకోనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్‌ను ఏ రేంజ్‌లో చూపించబోతున్నారు. అలాగే సినిమాలోని హైలైట్స్ ఏంటి అనే విషయాలపై మేకర్స్ మాట్లాడే మాటల కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. విజయవాడలో జరిగే ఈ ఈవెంట్‌కు భారీ ఎత్తున అభిమానులు తరలిరానున్నారు. కేవలం సినిమా ప్రమోషన్స్ మాత్రమే కాకుండా, ఏపీలో ప్రీమియర్స్ , టికెట్ ధరలకు సంబంధించిన అధికారిక సమాచారం కూడా ఇప్పటికే వచ్చేయడంతో సినిమాపై మరింత జోష్ పెరిగింది. ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే

Asianet News Telugu31 May, 01:51 pm
డైరెక్టర్ బుచ్చిబాబు ఫన్నీ స్పీచ్ పడిపడి నవ్విన చరణ్, రెహ్మాన్

Buchi Babu Speech: డైరెక్టర్ బుచ్చిబాబు ఫన్నీ స్పీచ్ పడిపడి నవ్విన చరణ్, రెహ్మాన్ | Asianet Telugu ఈ వార్తకు సంబంధించిన

Peddi Movie Updates News Keyword | Telugu Digital