రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విజయవాడలోని గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి చరణ్ తో పాటుగా జాన్వీ, జగపతిబాబు, దివ్యందు శర్మ, ఏఆర్ రెహమాన్, రత్నవేలు తదితరులు హాజరయ్యారు. జాన్వీ తెలుగులో మాట్లాడి అలరించింది.''మీరు మాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. 'పెద్ది' సినిమా చూసినప్పుడు కూడా ఇదే ప్రేమతో బయటకి వస్తారని ఆశిస్తున్నాను. అదే మాకు ప్రతిరోజు కష్టపడి పని చేయడానికి బలం ఇస్తుంది. మేము చేసే ప్రతి పని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే. ఈ సినిమా చాలా స్పెషల్ గా ఉంటుంది. 'నీ ఐడెంటిటీని, నీ జీవితానికి అర్థం ఏంటి అనేది కనుక్కోవడం' ఈ సినిమాలో ఉన్న మెసేజ్. నా జీవితానికి మీనింగ్ ఏంటంటే.. సినిమాలు చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం. నా ఐడెంటిటీ కూడా ఈ భూమితో, మీ అందరితో చాలా డీప్ గా కనెక్ట్ అయి ఉంది. మీరు నా పట్ల చూపించే ప్రేమకి నేను చాలా గ్రేట్ ఫుల్ గా ఉన్నాను. ఈ సినిమాతో మీరంతా గర్వపడేలా చేస్తానని అనుకుంటున్నాను. మేము చేసిన ఈ సినిమా మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను''''పెద్ది' సినిమా రిలీజ్ కు ముందే నాకు చాలా ఇచ్చింది. రామ్ సార్ తో వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చింది. ఆయనొక జెమ్. అద్భుమైన నటుడు. బుచ్చిబాబు సర్ నాకు తెలిసిన మోస్ట్ ప్యాషనేట్ డైరెక్టర్. రాండీ నా ఫేవరెట్ డీఓపీ. రెహమాన్ గారు ఒక లెజెండ్. ప్రొడ్యూసర్ సతీష్ ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ ని చాలా వండర్ఫుల్ గా మార్చారు. టీమ్ మొత్తం ఈ సినిమాకి తమ బెస్ట్ ఇచ్చారు. అందరికీ థ్యాంక్స్. మీరు మాకోసం వస్తే మా కష్టానికి నిజమైన ఫలితం దొరికినట్టు అనిపిస్తుంది. ఈసారి మీరు నన్ను ఇంకా కొంచెం ఎక్కువసేపు చూస్తారు. థాంక్యూ సో మచ్'' అంటూ జాన్వీ కపూర్ తెలుగు స్పీచ్ తో అదరగొట్టింది. ఈ సందర్భంగా చిరంజీవి - శ్రీదేవి కలిసి నటించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాలోని 'మానవా మానవా' డైలాగ్ చెప్పమని యాంకర్ సుమ కనకాల కోరగా.. జాన్వీ కపూర్ తనదైన శైలిలో డైలాగ్ చెప్పి నవ్వులు పూయించింది.
Janhvi Kapoor Telugu Speech News
Latest updates from Telugu Digital news sources.

Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – క్రేజీ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ "పెద్ది". జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక విజయవాడలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ముఖ్యంగా ఆమె స్టేజ్ ఎక్కినప్పటి నుంచి దిగిపోయే వరకు తన మాటలతో, హావభావాలతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. ముద్దుముద్దుగా ఆమె తెలుగులో మాట్లాడిన తీరు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. మీరు చూపించే ప్రేమే మాకు బలం.. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. "నమస్కారం.. మీరు మాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ‘పెద్ది’ సినిమా థియేటర్లలోకి వచ్చినప్పుడు కూడా మీరు ఇదే ప్రేమను చూపిస్తారని ఆశిస్తున్నాను. మీ ప్రేమే మేము రాత్రి పగలు కష్టపడి పని చేయడానికి బలాన్ని ఇస్తుంది. మేము చేసే ప్రతి పని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే. ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది.. మీ జీవితానికి అర్థం ఏంటి? మీ ఐడెంటిటీ ఏంటి? అనేది కనుక్కోవడమే ఈ చిత్రం. నా జీవితానికి మీనింగ్ ఏంటంటే.. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం, సినిమాలు చేయడం. నా ఐడెంటిటీ కూడా మీ అందరితో చాలా డీప్‌గా కనెక్ట్ అయి ఉంది. ఐ హోప్.. నేను మిమ్మల్ని ప్రౌడ్‌గా ఫీలయ్యేలా చేస్తాను" అని ఎమోషనల్ అయ్యారు. రామ్ చరణ్ ఒక ‘జెమ్’.. బుచ్చిబాబు ‘రౌడీ’ డైరెక్టర్ సినిమా విశేషాల గురించి చెప్తూ.. "ఈ సినిమా రిలీజ్‌కు ముందే నాకు చాలా జ్ఞాపకాలను ఇచ్చింది. రామ్ చరణ్ సార్‌తో వర్క్ చేసే అవకాశం ఇచ్చింది. హి ఈజ్ ఎ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ జెమ్ ఆఫ్ ఎ పర్ఫామర్. జై చరణ్! ఇక బుచ్చిబాబు సార్ నాకు తెలిసిన మోస్ట్ ప్యాషనేట్ డైరెక్టర్. ఆయన చాలా సాదాసీదాగా, సింపుల్‌గా కనిపిస్తారు కానీ ఆయనో రౌడీ డైరెక్టర్ (నవ్వుతూ..). ప్రతి టేక్ తర్వాత ఆయన నన్ను ఇమిటేట్ చేస్తారు. 'అదిరిపోయింది మా.. అదిరిపోయింది.. కానీ మళ్లీ ఒకసారి టేక్' అంటారు. అంటే ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చేసి మళ్లీ ఇంకో టేక్ అడుగుతారన్నమాట. మా డీపీఐ రాండీ సార్, లెజెండ్ ఏఆర్ రెహమాన్ గారు, మా ప్రొడ్యూసర్స్ సతీష్ గారు, ప్రవీణ్ సార్.. ఇలా ఎంటైర్ టీమ్ మీకోసం బెస్ట్ ఇచ్చారు" అని పేర్కొన్నారు. స్టేజ్ పై ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ డైలాగ్! యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తన తల్లి, దివంగత నటి శ్రీదేవిని గుర్తుచేసుకున్నారు జాన్వీ. "తెలుగు ప్రేక్షకుల గురించి అమ్మ మీకు ఏం చెప్పేది?" అని యాంకర్ అడగ్గా.. "ఆడియన్స్ ఈజ్ గాడ్ (ప్రేక్షకులే దేవుడు).. అమ్మ నాకు ఎప్పుడూ ఇదే చెప్పేది. తెలుగు ప్రేక్షకులు ఇచ్చే ప్రేమ నాకు సర్వస్వం" అని జాన్వీ బదులిచ్చారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవిల ఆల్‌టైమ్ క్లాసిక్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’లోని ఇంద్రజ (అతిలోకసుందరి) ఐకానిక్ డైలాగ్‌ను స్టేజ్ పైన జాన్వీ కపూర్ రీ-క్రియేట్ చేశారు. స్క్రీన్ పై విజువల్స్ చూసిన అనంతరం జాన్వీ మైక్ అందుకుని.. "మానవా.. ఓ మానవా.. ఒక్కసారి నా చెయ్యి పట్టుకోవా.." అంటూ శ్రీదేవి స్టైల్లోనే డైలాగ్ చెప్పి అందరినీ మెప్పించారు. జాన్వీ నోట ఆ డైలాగ్ వినగానే మెగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. మొత్తానికి ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో జాన్వీ కపూర్ స్పీచ్, ఆమె అచ్చ తెలుగు ముచ్చట్లు అభిమానులను మస్త్ ఖుషీ చేశాయి.

జాన్వీ కపూర్ తెలుగులో స్పీచ్ రామ్ చరణ్ ఫిదా | Janhvi Kapoor Telugu Speech | PEDDI Pre Release Event ఈ వార్తకు సంబంధించిన