translateexpand_more

Janhvi Kapoor At Peddi Pre Release Event News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu01 Jun, 04:48 pm
పెద్ది’ ప్రీరిలీజ్ ఈవెంట్ .. తెలుగు స్పీచ్ తో అదరగొట్టిన జాన్వీ.. మానవా మానవా’ అంటూ నవ్వులు

రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ‘పెద్ది’. ఇందులో జాన్వీ కపూర్‌ కథానాయికగా నటించింది. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జూన్‌ 4న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విజయవాడలోని గ్రాండ్ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. దీనికి చరణ్ తో పాటుగా జాన్వీ, జగపతిబాబు, దివ్యందు శర్మ, ఏఆర్ రెహమాన్, రత్నవేలు తదితరులు హాజరయ్యారు. జాన్వీ తెలుగులో మాట్లాడి అలరించింది.''మీరు మాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. 'పెద్ది' సినిమా చూసినప్పుడు కూడా ఇదే ప్రేమతో బయటకి వస్తారని ఆశిస్తున్నాను. అదే మాకు ప్రతిరోజు కష్టపడి పని చేయడానికి బలం ఇస్తుంది. మేము చేసే ప్రతి పని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే. ఈ సినిమా చాలా స్పెషల్ గా ఉంటుంది. 'నీ ఐడెంటిటీని, నీ జీవితానికి అర్థం ఏంటి అనేది కనుక్కోవడం' ఈ సినిమాలో ఉన్న మెసేజ్. నా జీవితానికి మీనింగ్ ఏంటంటే.. సినిమాలు చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం. నా ఐడెంటిటీ కూడా ఈ భూమితో, మీ అందరితో చాలా డీప్ గా కనెక్ట్ అయి ఉంది. మీరు నా పట్ల చూపించే ప్రేమకి నేను చాలా గ్రేట్ ఫుల్ గా ఉన్నాను. ఈ సినిమాతో మీరంతా గర్వపడేలా చేస్తానని అనుకుంటున్నాను. మేము చేసిన ఈ సినిమా మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను''''పెద్ది' సినిమా రిలీజ్ కు ముందే నాకు చాలా ఇచ్చింది. రామ్ సార్ తో వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చింది. ఆయనొక జెమ్. అద్భుమైన నటుడు. బుచ్చిబాబు సర్ నాకు తెలిసిన మోస్ట్ ప్యాషనేట్ డైరెక్టర్. రాండీ నా ఫేవరెట్ డీఓపీ. రెహమాన్ గారు ఒక లెజెండ్. ప్రొడ్యూసర్ సతీష్ ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ ని చాలా వండర్ఫుల్ గా మార్చారు. టీమ్ మొత్తం ఈ సినిమాకి తమ బెస్ట్ ఇచ్చారు. అందరికీ థ్యాంక్స్. మీరు మాకోసం వస్తే మా కష్టానికి నిజమైన ఫలితం దొరికినట్టు అనిపిస్తుంది. ఈసారి మీరు నన్ను ఇంకా కొంచెం ఎక్కువసేపు చూస్తారు. థాంక్యూ సో మచ్'' అంటూ జాన్వీ కపూర్ తెలుగు స్పీచ్ తో అదరగొట్టింది. ఈ సందర్భంగా చిరంజీవి - శ్రీదేవి కలిసి నటించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాలోని 'మానవా మానవా' డైలాగ్ చెప్పమని యాంకర్ సుమ కనకాల కోరగా.. జాన్వీ కపూర్ తనదైన శైలిలో డైలాగ్ చెప్పి నవ్వులు పూయించింది.