translateexpand_more

Ram Charan News News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy31 May, 10:03 am
విజయవాడలో పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్

గ్లోబల్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయవాడ వేదిక కానుంది. ఈ చిత్రం విడుదలకు ముందు భారీ స్థాయిలో అభిమానులను ఆకట్టుకునేలా ఈ వేడుకను నిర్వహించేందుకు చిత్రబృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అమరావతి, మే 31, (ఆంధ్రజ్యోతి): గ్లోబల్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ (Global Star Ram Charan) నటిస్తున్న భారీ చిత్రం పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు (Peddi Movie) విజయవాడ వేదిక కానుంది. ఈ చిత్రం విడుదలకు ముందు భారీ స్థాయిలో అభిమానులను ఆకట్టుకునేలా ఈ వేడుకను నిర్వహించేందుకు చిత్రబృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు(సోమవారం) సాయంత్రం 5 గంటల నుంచి ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ వేడుకలో హీరో రామ్ చరణ్‌తో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొననుంది. హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్‌ సందడి చేయనుండటంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పటికే విజయవాడ నగరంలో మెగా అభిమానుల సందడి కనిపిస్తోంది. ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానుల కోసం ప్రత్యేక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు కూడా చేపడుతున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్‌కు ముందు నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ సినిమా ప్రమోషన్లలో కీలక ఘట్టంగా మారనుంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ హాజరుకానుండటంతో

Zee Telugu28 May, 04:35 pm
పెద్ది' గురించి స్వయంగా అడిగి తెలుసుకున్న ప్రధాని మోదీ..రామ్ చరణ్ మోదీని కలిసి సమయంలో ఏం జరిగింది

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. PM Modi On Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'పెద్ది'. ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదల అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌ను చిత్రబృందం జోరుగా కొనసాగిస్తుంది. నిన్న మొన్న ముంబై, భోపాల్, బెంగళూరు పూర్తి చేసుకోని నేడు ఢిల్లీకి చేరుకుంది చిత్రబృందం. ఢిల్లీలో నిర్వహించిన గ్రాండ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్‌తో పాటు కీలక నటులు బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ తదితరులు పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ ప్రెస్‌మీట్‌లో హీరో రామ్ చరణ్ గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన భేటీని గుర్తుచేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను కొంత ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ రోడ్డు, ఎర్రకోట దగ్గర షూటింగ్ చేశారు. అయితే ఆ సమయంలో ప్రధాని మోదీతో రామ్‌చరణ్ ఫ్యామిలీ కలిశారు. "నేను గతంలో ప్రధాని మోదీని కలిసినప్పుడు.. 'పెద్ది' సినిమా దేని గురించి అని ఆయన అడిగారు. దానికి నేను సమాధానమిస్తూ.. ఓ రకంగా ఇది మన దేశ ప్రగతిని, 'వికసిత్

TV9 Telugu01 Jun, 03:14 am
విజయవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్.. అందరి కళ్లు ఆ గ్రాండ్ వేడుకపైనే

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ హేప్ క్రియేట్ చేయగా, ప్రస్తుతం అందరి కళ్ళు ఈరోజు జరగబోయే గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పైనే పడ్డాయి. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ ప్రమోషన్స్‌లో భాగంగా, మేకర్స్ నేడు (జూన్ 1) విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ వేడుక కోసం మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి టీమ్ సభ్యులు చాలా తక్కువ సమాచారాన్ని మాత్రమే పంచుకున్నారు. కానీ, ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల ముందుకు వస్తుంది పెద్ది టీమ్. ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ.. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సినిమా విశేషాలను పంచుకోనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్‌ను ఏ రేంజ్‌లో చూపించబోతున్నారు. అలాగే సినిమాలోని హైలైట్స్ ఏంటి అనే విషయాలపై మేకర్స్ మాట్లాడే మాటల కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. విజయవాడలో జరిగే ఈ ఈవెంట్‌కు భారీ ఎత్తున అభిమానులు తరలిరానున్నారు. కేవలం సినిమా ప్రమోషన్స్ మాత్రమే కాకుండా, ఏపీలో ప్రీమియర్స్ , టికెట్ ధరలకు సంబంధించిన అధికారిక సమాచారం కూడా ఇప్పటికే వచ్చేయడంతో సినిమాపై మరింత జోష్ పెరిగింది. ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే

TV9 Telugu29 May, 02:34 am
పెద్ది సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. రోజుకు 5 షోలతో పాటు టికెట్ ధరల పెంపు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈసినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తరవాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. బుచ్చిబాబు సన చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై బజ్ క్రియేట్ అయ్యింది. పైగా చరణ్ ఈ సినిమాలో మాస్ లుక్ లో కనిపించనుండటంతో ఆ అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సినిమా స్థాయిని ఆకాశానికి పెంచేసింది. ఈ ట్రైలర్ లో చరణ్ యాక్టింగ్, యాక్షన్స్ సీన్స్ ఆడియన్స్ కు పిచ్చెక్కించాయి. పల్లెటూరి యువకుడిగా రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 4న విడుదలకు సిద్ధం అవుతుంది. దాంతో ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. తాజాగా పెద్ది సినిమాకు ఏపీ ప్రభుత్వం బంపర్ న్యూస్ చెప్పింది. పెద్ది సినిమాకు టికెట్ రేట్స్ పెంచేసింది. జూన్ 3న రాత్రి 8 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షోలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలైన వారం రోజుల పాటు రోజుకు 5 షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ సర్కార్ అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 చొప్పున పెంచుకోవచ్చు. అలాగే ప్రీమియర్ షోలకు కూడా టికెట్ రేట్ ను ఫిక్స్ చేసింది.

TV9 Telugu29 May, 03:57 pm
అప్పుడు చిరు రాజ్ కుమార్.. ఇప్పుడు చరణ్ శివన్న.. ఆ సీన్ రీక్రియేట్ చేసిన పెద్ది టీమ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. పక్కా మాస్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో జగపతి బాబు, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకు విడుదలైన సాంగ్స్ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. మరోవైపు ట్రైలర్, టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెద్ది ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. తాజాగా చరణ్, శివన్న కలిసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ ఫోటో చూసి ఒకప్పుడు చిరంజీవి , కన్నడ హీరో కంఠీరవ రాజ్ కుమార్ అనుబంధం గురించి మాట్లాడుకుంటున్నారు. ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు. టాలీవుడ్ హీరో చిరంజీవి, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మధ్య మంచి అనుబంధం ఉందన్న విషయం తెలిసిందే. మొదటి నుంచి రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం కొనసాగుతుంది. అయితే గతంలో రాజ్‌కుమార్‌ కుటుంబానికి చెందిన శ్రీ వజ్రేశ్వరీ కంబైన్స్‌ నిర్మాణ సంస్థ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో కంఠీరవ రాజ్ కుమార్, చిరంజీవి ఇద్దరూ ఆప్యాయంగా కలుసుకున్నారు. ఇక ఇప్పుడు చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంలో కంఠీరవ రాజ్ కుమార్ కుమారుడు శివరాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి, రాజ్ కుమార్ కలిసిన ఫోటోను

TV9 Telugu28 May, 03:06 pm
పెద్ది గురించి స్వయంగా అడిగిన ప్రధాని మోదీ.. వికసిత్ భారత్ గురించి చెప్పే కథ అన్నాను.. రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఇదివరకు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదివరకే ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం దేశవ్యాప్తంగా ముమ్మరంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇప్పటికే భోపాల్, బెంగళూరు నగరాలలో సందడి చేసిన ఈ టీమ్, గురువారం దేశ రాజధాని దిల్లీలో ఒక గ్రాండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో హీరో రామ్ చరణ్, కథానాయిక జాన్వీ కపూర్, నటులు దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు పాల్గొని సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది.. ప్రధాని మోదీ స్ఫూర్తినింపే కథ చెప్పారు: రామ్ చరణ్ ఈ ప్రెస్‌మీట్‌లో రామ్ చరణ్ మాట్లాడుతూ గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన భేటీని గుర్తుచేసుకున్నారు. “నేను గతంలో ప్రధాని మోదీని కలిసినప్పుడు.. ‘పెద్ది’ సినిమా దేని గురించి అని ఆయన అడిగారు. ఓ రకంగా ఇది వికసిత్ భారత్ గురించి చెప్పే కథ అని వివరించాను. అప్పుడు ఆయన నాతో ఒక స్ఫూర్తినింపే నిజ జీవిత కథను పంచుకున్నారు” అని చరణ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని

Zee Telugu01 Jun, 02:56 pm
పెద్ది మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్.. ఫుల్ జోష్ లో రామ్ చరణ్ ఫ్యాన్స్

Ram Charan Peddi Movie Release Event Live Updates: విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియం పెద్ది నామస్మరణతో మార్మోగిపోతుంది. అతిథులు ఒక్కొక్కరుగా స్టేడియానికి చేరుకోగా.. యాంకర్ సుమ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నారు. Ram Charan Peddi Movie Release Event Live Updates: పెద్ది మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాంగణం వద్ద ప్రదర్శించిన ప్రచార జీప్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్రచార రథాన్ని పలు నగరాల్లో ప్రదర్శిస్తున్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రీ రిలీజ్ వేడుకల సందర్భంగా దీనిని ఏర్పాటు చేయడంతో అభిమానులు ఆసక్తిగా వీక్షిస్తూ ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Ram Charan Peddi Movie Release Event Live Updates: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మూవీ పెద్ది. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించేందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. ముంబై, భోపాల్, చెన్నై వంటి నగరాల్లో నిర్వహించిన ప్రమోషన్స్‌తో రెట్టింపు అయ్యాయి. నేడు తెలుగు ప్రేక్షకుల కోసం మేకర్స్ భారీ ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో జరుగుతున్న ఈ వేడుకను వీక్షించేందుకు మెగా ఫ్యాన్స్ మెగా అభిమానులు ఇప్పటికే చేరుకున్నారు. ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్, జాన్వీ