translateexpand_more

Ram Charan Pehlwan Look News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu01 Jun, 03:58 pm
పెద్ది సినిమాలో కధే పెద్ద హీరో

తెలుగు సినిమాను చూసి ప్రపంచం మొత్తం ఉలికిపడే రోజు, రామ్ చరణ్ రూపంలో తెరమీద అద్భుతాన్ని చూసి హాలీవుడ్ సైతం అదిరిపడే రోజు ఇంకెంతో దూరంలో లేదు. ఆ రోజు 'పెద్ది' బల్లగుద్ది రికార్డులు బద్దలకొట్టి మరి నిరూపించుకునే రోజు జూన్ 4, 2026! అన్నారు లిరిసిస్ట్ అనంత శ్రీరాం. పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ ఆ రోజు మొదలు మీ జోరు, మీ హుషారు ఎవ్వరూ ఆపలేరు అని గంటాపథంగా తెలియజేస్తున్నా. పెద్ది ఎవరో కాదు.. ఒక క్రాస్ ఓవర్ అథ్లీట్! కాగితం మీద కథ రాయడం, తెర మీద ఆ కథని తీయడం అన్న రెండు ఆటల్ని ఒకే చోట, ఒకే సమయంలో ఆడిన ఆ క్రాస్ ఓవర్ అథ్లీట్ మరెవరో కాదు.. ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా ఇంటి పేరు నిలబెట్టాలనుకుంటారేమో, అందుకనే మమ్మల్ని అందరినీ ఇలా సానబడుతూ ఉంటారు; మా మెదళ్లకు అలా సానపెడుతూనే ఉంటారు. రేపు నాలుగో తారీఖున మీరు చూడబోయేది 'పెద్ది' సినిమా మొదటి ఆట కాదు, 'పెద్ది'ని గెలిపించడానికి బుచ్చిబాబు చివరి వరకు చేసిన పోరాటం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ సినిమా టీంలో ఎవరి గురించి ఎంత చెప్పినా, ఆ ఒక్కరి గురించి మాత్రం ఏం చెప్పినా తక్కువే. ఆయన ఎవరో కాదు.. ఈ చిత్రాన్ని నడిపించిన కథానాయకుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. గాయాలపాలైనా షూటింగ్‌లో పాల్గొన్న ఆయన అంకితభావం, మాలలో ఉన్నా సరే మల్లయోధుడిగా తన శరీరాన్ని మలుచుకున్న ఆయన కష్టం, వాటి వెనకాలున్న కథలు వింటూ ఉంటే మీకు ఒక్కొక్కరికీ రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం.కాని, ఈ సినిమాకి రామ్ చరణ్