translateexpand_more

Telugu Cinema Updates News

Latest updates from Telugu Digital news sources.

SkyC Media31 May, 12:00 am
ఎల్లమ్మ మూవీలో హీరోయిన్ గా మమితా బైజు ఫిక్స్ అయినట్లేనా

దిల్ రాజు నిర్మాణంలో వేణు యెల్దండి దర్శకత్వంలో రాబోతున్న ఎల్లమ్మ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా మమితా బైజు పేరు దాదాపు ఫైనల్ స్టేజ్‌కు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేకర్స్ ఈమెతో జరుపుతున్న చర్చలు చాలా జోరుగా సాగుతున్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. చాలా మంది సినీ రిపోర్టర్లు కూడా ఈ సినిమాలో ఆమెనే హీరోయిన్‌గా ఫైనల్ అని గట్టిగా చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గనుక ఓకే అయితే తెలుగులో ఆమెకు ఇది చాలా పెద్ద అవకాశం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్ ఎంపిక కోసం మేకర్స్ గతంలో పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలించినట్లు సమాచారం. ముందుగా ఈ పాత్ర కోసం సాయి పల్లవి, కీర్తి సురేష్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పేరు కూడా గట్టిగా వినిపించింది. అయితే పలు కారణాల వల్ల వారు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాలేకపోయినట్లు తెలుస్తోంది. చివరకు మేకర్స్ మమితా బైజు వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం ఆమెతో చర్చల ప్రక్రియ తుది దశకు చేరుకుందని సమాచారం. ఇదిలా ఉండగా ఈ మలయాళ ముద్దుగుమ్మ ఇప్పటికే పలు విజయవంతమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె బాగా కనెక్ట్ అయింది. దీంతో పాటు ధనుష్‌తో కలిసి కర అనే సినిమాలో కూడా నటించింది. ఈ నేపథ్యంలో ఎల్లమ్మ సినిమాలో నటించే అవకాశం రావడం ఆమె కెరీర్‌కు ప్లస్ కానుంది. ఈ సినిమాలో హీరో డిఎస్‌పి పక్కన మమితా బైజు ఫ్రెష్ జోడీగా బాగా సెట్ అవుతుందని మేకర్స్

Andhra Jyothy31 May, 05:08 am
సూపర్ స్టార్ కృష్ణ జయంతి.. సీఎం చంద్రబాబు ఘన నివాళి

అమరావతి: సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమకు కృష్ణ చేసిన సేవలను ఆయన కొనియాడారు. నటుడిగా, దర్శకుడిగా, సాహసోపేత నిర్మాతగా కళామతల్లికి విశిష్ట సేవలందించారని సీఎం ప్రశంసించారు. నూతన సాంకేతికతలను తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేసి కొత్త పుంతలు తొక్కించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు పోస్టు చేశారు.

సీఎం చంద్రబాబు ఎక్స్ పోస్టు..

'తెలుగు సినీ పరిశ్రమకు నటుడిగా, దర్శకుడిగా, సాహసోపేత నిర్మాతగా విశిష్ట సేవలందించిన పద్మభూషణ్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాం. నూతన సాంకేతికతలను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ సినీ రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయం. అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిన ఆ మహానటుడికి ఘన నివాళులు' అంటూ పోస్టు చేశారు.

మరోవైపు, సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కృష్ణను స్మరించుకుంటున్నారు. సూపర్ స్టార్ నటించిన సినిమాలను, ఆయన పోషించిన పాత్రలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు..

మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. కత్తులతో రైతుపై దాడికి యత్నం..

NTV Telugu01 Jun, 09:53 am
ఎడిటింగ్ లో బలయ్యా.. పుష్ప 2’పై జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘పుష్ప 2: ది రూల్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ భారీ విజయం వెనుక కొందరు స్టార్ నటుల్లో తీవ్ర అసంతృప్తి దాగుందనే విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌ అయింది. సినిమాలో తమ పాత్రలను డిజైన్ చేసిన విధానంపై, స్క్రీన్ టైమ్‌పై ఒక హీరో,ఒక సీనియర్ హీరో బహిరంగంగానే పెదవి విరవడం సంచలనం రేపుతోంది. సినిమాలో మెయిన్ విలన్‌గా నటించిన మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ (భన్వర్ సింగ్ షెకావత్) ఇప్పటికే తన పాత్ర నిడివిపై అసంతృప్తి వ్యక్తం చేయగా... ఇప్పుడు అదే లిస్టులోకి టాలీవుడ్ సీనియర్ హీరో, వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు కూడా చేరారు. థియేటర్లలో కనిపించిన తమ పాత్రల అవుట్‌పుట్ చూసి ఇద్దరూ తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. సినిమా నిడివి ఇప్పటికే 3 గంటల 21 నిమిషాలు ఉన్నప్పటికీ తమకు సంబంధించిన ఎన్నో కీలక సీన్లను ఎడిటింగ్‌లో లేపేశారని వారు అసహనం వ్యక్తం చేశారు. దీంతో అసలు సుకుమార్ ఈ సినిమా కోసం ఇంకెంత ఫుటేజ్ షూట్ చేసి ఉంటారనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంత పెద్ద నటులను పెట్టుకుని, వారి సీన్లు ట్రిమ్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఇదే తరుణంలో జగపతి బాబు ‘పుష్ప’ ఫ్రాంచైజీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన నిజాన్ని బయటపెట్టారు. నిజానికి సుకుమార్ ‘పుష్ప పార్ట్ 2’, ‘పుష్ప పార్ట్ 3’లను విడివిడిగా కాకుండా... ఒకే ఒక సినిమాగా ముగించాలని మొదట ప్లాన్ చేశారట. కానీ, ఫుటేజ్ భారీగా పేరుకుపోవడంతో దాన్ని రెండు భాగాలుగా మార్చాల్సి

NTV Telugu01 Jun, 03:58 pm
పెద్ది సినిమాలో కధే పెద్ద హీరో

తెలుగు సినిమాను చూసి ప్రపంచం మొత్తం ఉలికిపడే రోజు, రామ్ చరణ్ రూపంలో తెరమీద అద్భుతాన్ని చూసి హాలీవుడ్ సైతం అదిరిపడే రోజు ఇంకెంతో దూరంలో లేదు. ఆ రోజు 'పెద్ది' బల్లగుద్ది రికార్డులు బద్దలకొట్టి మరి నిరూపించుకునే రోజు జూన్ 4, 2026! అన్నారు లిరిసిస్ట్ అనంత శ్రీరాం. పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ ఆ రోజు మొదలు మీ జోరు, మీ హుషారు ఎవ్వరూ ఆపలేరు అని గంటాపథంగా తెలియజేస్తున్నా. పెద్ది ఎవరో కాదు.. ఒక క్రాస్ ఓవర్ అథ్లీట్! కాగితం మీద కథ రాయడం, తెర మీద ఆ కథని తీయడం అన్న రెండు ఆటల్ని ఒకే చోట, ఒకే సమయంలో ఆడిన ఆ క్రాస్ ఓవర్ అథ్లీట్ మరెవరో కాదు.. ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా ఇంటి పేరు నిలబెట్టాలనుకుంటారేమో, అందుకనే మమ్మల్ని అందరినీ ఇలా సానబడుతూ ఉంటారు; మా మెదళ్లకు అలా సానపెడుతూనే ఉంటారు. రేపు నాలుగో తారీఖున మీరు చూడబోయేది 'పెద్ది' సినిమా మొదటి ఆట కాదు, 'పెద్ది'ని గెలిపించడానికి బుచ్చిబాబు చివరి వరకు చేసిన పోరాటం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ సినిమా టీంలో ఎవరి గురించి ఎంత చెప్పినా, ఆ ఒక్కరి గురించి మాత్రం ఏం చెప్పినా తక్కువే. ఆయన ఎవరో కాదు.. ఈ చిత్రాన్ని నడిపించిన కథానాయకుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. గాయాలపాలైనా షూటింగ్‌లో పాల్గొన్న ఆయన అంకితభావం, మాలలో ఉన్నా సరే మల్లయోధుడిగా తన శరీరాన్ని మలుచుకున్న ఆయన కష్టం, వాటి వెనకాలున్న కథలు వింటూ ఉంటే మీకు ఒక్కొక్కరికీ రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం.కాని, ఈ సినిమాకి రామ్ చరణ్

SkyC Media30 May, 07:00 pm
రవితేజ ఇరుముడి సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది

మాస్ మహారాజా రవితేజ 77వ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రవితేజ ఇరుముడి సినిమా ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో రవితేజ ఒక శక్తివంతమైన అయ్యప్ప భక్తుడి పాత్రలో కనిపించనున్నారు. ఆయన రెగ్యులర్ మాస్ హీరో ఇమేజ్‌కి భిన్నంగా ఈ పాత్ర సాగనుంది. తండ్రి, కూతుళ్ల మధ్య ఉండే బలమైన ఎమోషనల్ ఎలిమెంట్స్ ఈ కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే మే 2026 నాటికి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కీలకమైన షెడ్యూల్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దాదాపు ముగింపునకు వచ్చినట్లు సమాచారం అందుతోంది. దీంతో చిత్ర యూనిట్ తమ దృష్టిని పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పెట్టింది. దీనితో పాటు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా భారీ ఎత్తున ప్లాన్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సినిమాకు సంబంధించిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రచార చిత్రాలకు ప్రేక్షకులు, అభిమానుల నుండి మంచి బజ్ లభించింది. రవితేజ ఇరుముడి సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో రవితేజను ఒక కొత్త కోణంలో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భక్తి, యాక్షన్ డ్రామా కలయికగా ఈ చిత్రం రూపొందుతోంది. రవితేజ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఫలితంగా సోషల్ మీడియా వేదికగా సినిమా గురించిన చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. రవితేజ కొత్త లుక్స్, సినిమా వైవిధ్యమైన కథాంశం

NTV Telugu30 May, 09:47 am
రాజేంద్ర ప్రసాద్ సినిమాకి పెరుగుతున్న థియేటర్లు

డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, సరికొత్త సందేశాత్మక వినోదాత్మక కథాంశంతో తెరకెక్కిన చిత్రం “నేనెవరు?”. చిరంజీవి తన్నీరు రూపొందించిన ఈ చిత్రం మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, ప్రేక్షకాదరణతో ప్రదర్శితమవుతోంది. 'సరికొండ మల్లిఖార్జున్' సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి సంయుక్తంగా ఈ సినిమాకి నిర్మించారు. సినిమాకు అన్ని ప్రాంతాల నుండి పాజిటివ్ టాక్ వస్తుందని, రోజురోజుకూ థియేటర్ల సంఖ్య పెరుగుతోందని నిర్మాతలు అత్యంత ఆనందాన్ని వ్యక్తం చేశారు. నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఒక మంచి కథతో, సమాజానికి అవసరమైన సందేశంతో వచ్చిన “నేనెవరు?” చిత్రాన్ని ప్రేక్షకులు ఇంతలా ఓన్ చేసుకోవడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు భారీగా తరలివచ్చి థియేటర్లలో సినిమాను ఆదరించడం తనకు మరింత సంతృప్తిని కలిగించిందని తెలిపారు. దర్శకుడు చిరంజీవి తన్నీరు, నిర్మాతలు అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి సహా చిత్ర బృందానికి ఆయన కంగ్రాట్స్ చెప్పారు.

Samayam Telugu01 Jun, 01:24 am
పొల్లాచ్చి షెడ్యూల్ కు సిద్ధమైన మెగా 158’.. చిరంజీవిపై భారీ యాక్షన్ సీక్వెన్స్

మెగాస్టార్ చిరంజీవి , మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో తాజా చిత్రం ‘Mega158’ ఇటీవలే గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించడంతో, ఈ సరికొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.పొల్లాచ్చిలో భారీ షెడ్యూల్ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త మరియు కీలకమైన షూటింగ్ షెడ్యూల్ తమిళనాడులోని పొల్లాచ్చిలో ప్రారంభం కానుంది. దాదాపు రెండు వారాల పాటు ఏకధాటిగా సాగే ఈ సుదీర్ఘ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొనబోతున్నట్లు సమాచారం. పొల్లాచ్చిలోని అందమైన లొకేషన్లలో చిరంజీవిపై కొన్ని కీలకమైన, భారీ సన్నివేశాలను దర్శకుడు బాబీ ఇక్కడ తెరకెక్కించనున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవిలోని వింటేజ్ హ్యూమర్‌ను అద్భుతంగా పండించిన బాబీ, ఈసారి మెగాస్టార్‌లోని పవర్‌ఫుల్ ఎమోషనల్ యాంగిల్‌ను విభిన్నంగా ఆవిష్కరించబోతున్నారని ఇన్‌సైడ్ టాక్. మాస్ అంశాలతో కూడిన పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ పాత్ర రెండు విభిన్న కోణాల్లో సాగుతుందని తెలుస్తోంది. * మరో బంపరాఫర్ కొట్టిన నారా రోహిత్‌.. ‘మెగా 158’ మూవీలో కీలక పాత్ర? కన్నడ బడా నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ, లోహిత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనే KVN ప్రొడక్షన్స్ టాలీవుడ్‌లోకి ఘనంగా అడుగుపెడుతోంది. ఇక ఈ మెగా ప్రాజెక్ట్‌లో మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్, సీనియర్ నటి ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్

NTV Telugu29 May, 09:17 am
సంజయ్ రావ్ బర్త్ డే స్పెషల్ హిట్ అండ్ రన్’ ఫస్ట్ లుక్ అవుట్

ప్రస్తుతం టాలీవుడ్‌లో సరికొత్త స్క్రీన్‌ప్లేతో వచ్చే క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆడియన్స్ ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్‌ను ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు ఇష్టపడుతుండటంతో ఈ తరహా సినిమాలకు డిమాండ్ మరింత పెరిగింది. ఈ క్రమంలోనే యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సంజయ్ రావ్, నటాషా సింగ్ మెయిన్ లీడ్స్‌గా రాబోతున్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ హిట్ అండ్ రన్. ‘శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి’ సమర్పణలో సతీష్ రెడ్డి అల్లం ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్‌లపై సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ వైవిధ్యమైన చిత్రానికి సాయి కృష్ణ సాగర్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, హీరో సంజయ్ రావ్ పుట్టినరోజును పురస్కరించుకుని.. శనివారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన మోస్ట్ ఎవైటెడ్ **ఫస్ట్ లుక్ పోస్టర్‌ను** మేకర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని ఒక్కసారిగా పీక్స్‌కు తీసుకెళ్లింది. ఈ పోస్టర్‌లో సంజయ్ రావ్ ముఖంపై తీవ్రమైన గాయాలు, ఒంటిపై రక్తపు మరకలతో కనిపిస్తున్న ఇంటెన్స్ లుక్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆయన కళ్లల్లో కనిపిస్తున్న కోపం, బ్యాక్‌డ్రాప్ థీమ్ చూస్తుంటే.. టైటిల్‌కు తగ్గట్టే ఒక రోడ్ యాక్సిడెంట్ లేదా క్రైమ్ మిస్టరీ చుట్టూ ఈ కథ నడవబోతోందని స్పష్టమవుతోంది. పోస్టర్‌లోనే ఈ రేంజ్ వైబ్స్ కనిపిస్తుండటంతో ‘హిట్ అండ్ రన్’ సిల్వర్ స్క్రీన్‌పై ప్రేక్షకులకు ఒక సాలిడ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వబోతోందని అర్థమవుతోంది.

NTV Telugu26 May, 09:10 am
మే 29న రాజేంద్ర ప్రసాద్ నేనెవరు

డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, “నువ్వేకావాలి”, “ప్రేమించు” వంటి సూపర్ హిట్ చిత్రాల ఫేమ్ సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్యపాత్రల్లో చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ “నేనెవరు?” మే 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ తన అనుభవంతో కూడిన ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుండగా, కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను ఆకట్టుకునే అంశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. భావోద్వేగాలు, వినోదం, సస్పెన్స్ మేళవింపుతో దర్శకుడు చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ప్రతి వ్యక్తి జీవితానికి సంబంధించిన ప్రశ్నను ప్రతిబింబించేలా “నేనెవరు?” అనే టైటిల్‌కు తగ్గట్టుగా ఆసక్తికరమైన కథనాన్ని సిద్ధం చేసినట్లు మేకర్స్ పేర్కొన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ మరియు రాజేంద్ర ప్రసాద్ నటన ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయని తెలిపారు. టెక్నికల్‌గా కూడా సినిమా మంచి స్థాయిలో రూపొందిందని, సంగీతం, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రత్యేక బలంగా నిలుస్తాయని చిత్రబృందం వెల్లడించింది. ఇప్పటికే ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ప్రివ్యూ షోల అనంతరం ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం విడుదల రోజున మంచి స్పందన అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Sakshi28 May, 11:47 am
పెద్ది' కూడా రిలీజ్ అవుతోంది.. 'విశ్వంభర' ఎక్కడ

పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేని హీరోల సినిమాలకు సమస్యలు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి మూవీ కూడా రిలీజ్ అవడానికి నానా పాట్లు పడుతుంటే ఏమనుకోవాలి. అవును 'విశ్వంభర' గురించే ఈ డిస్కషన్. అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితం మొదలైంది. భారీ బడ్జెట్, సోషియో ఫాంటసీ ‍స్టోరీ అని ఓ రేంజ్ హైప్ ఇచ్చారు. తీరా చూస్తే థియేటర్లలోకి ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. ఇంతకీ 'విశ్వంభర' రిలీజ్ ఎక్కడివరకు వచ్చింది? (ఇదీ చదవండి: మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌ 'త్రికాల' రివ్యూ) చిరంజీవి హీరోగా 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో చాన్నాళ్ల క్రితం మొదలైన సినిమా 'విశ్వంభర'. యూవీ క్రియేషన్ దాదాపు రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టిందని రూమర్స్ వచ్చాయి. అయితే రెండున్నరేళ్ల క్రితం టీజర్ రిలీజైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఘోరాతీఘోరంగా విమర్శలు వచ్చాయి. దీంతో టీమ్ అంతా పునరాలోచనలో పడిపోయింది. తర్వాత మరో వీడియో రిలీజ్ చేశారు. ఓ పాట వదిలారు. అయినా సరే బజ్ రాలేదు. దీని షూటింగ్ గతేడాది పూర్తి చేసిన చిరంజీవి.. అనిల్ రావిపూడితో 'మన శంకరవరప్రసాద్' సినిమా చేశారు. ఇది రిలీజై 5 నెలలు దాటేసింది. విశ్వంభర చిత్రం ఈ ఏడాది వేసవిలో రావొచ్చని కొన్ని నెలల క్రితం అన్నారు. తీరా చూస్తే ఇప్పుడు వేసవి కూడా దాదాపు అయిపోవచ్చింది. కానీ చిరు మూవీ సంగతేంటనేది ఎవరికీ తెలీదు. అదుగో ట్రైలర్, ఇదుగో మూవీ రిలీజ్ డేట్ అని పలు సందర్భాల్లో రూమర్స్ వస్తున్నాయి. కానీ వీటిని జనాలు లైట్ తీసుకుంటున్నారు. చూస్తుంటే ప్రస్తుతం మెగా ఫ్యాన్స్‌కే ఈ చిత్రంపై దాదాపుగా ఇంట్రెస్ట్ పోయినట్లు అనిపిస్తుంది. రీసెంట్‌గానే బాబీ దర్శకత్వంలో కొత్త సినిమాని మొదలుపెట్టిన చిరు..

Samayam Telugu24 May, 06:50 am
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం... ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ జి. హరి ఆకస్మిక మరణం

- రచయిత గురించివీరేష్ బిళ్ళవీరేశ్ బిళ్ల ‘సమయం తెలుగు’లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. - ఇక్కడ సినీ రంగానికి చెందిన తాజా వార్తలు, స్టోరీలు రాస్తుంటారు. - ఆయన గతంలో ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, పొలిటికల్ న్యూస్, సినిమా, క్రికెట్, లైఫ్‌ స్టైల్ కథనాలు రాశారు.

NTV Telugu25 May, 07:13 am
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ బడ్జెట్ చిత్రాలతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోగా...

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ బడ్జెట్ చిత్రాలతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోగా దూసుకుపోతున్నారు. హైదరాబాద్‌లోని అత్యంత కాస్లీ ఏరియాగా పేరుగాంచిన కోకాపేటలో ప్...

NTV Telugu01 Jun, 04:19 pm
తెలుగులో అదరగొట్టిన మీర్జాపూర్ మున్నా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్-ఇండియా 'పెద్ది' ప్రీ-రిలీజ్ వేడుక విజయవాడలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న ప్రముఖ నటుడు (మీర్జాపూర్ ఫేమ్) దివ్యేందు శర్మ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన తొలి తెలుగు సినిమా అనుభవాలను, చిత్ర యూనిట్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన ప్రేక్షకులతో పంచుకున్నారు. తన ప్రసంగం ప్రారంభంలో, భాష కొత్తదైనందున ఏవైనా తప్పులు ఉంటే క్షమించాలని విజయవాడ ప్రజలను కోరారు దివ్యేందు. ఆ తర్వాత తెలుగులో మాట్లాడి అభిమానులను ఖుషీ చేశారు,. తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన 'మీర్జాపూర్' సిరీస్‌లోని ఒక డైలాగ్‌ను గుర్తుచేస్తూ.. "మీరంతా మా ఫ్యామిలీ" అనే హిందీ డైలాగ్‌ను తెలుగులోకి అనువదించి, "మీరే మా కుటుంబం"* అనడంతో స్టేడియం మొత్తం కేరింతలతో మారుమోగిపోయింది,. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటించడంపై దివ్యేందు శర్మ సంతోషం వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "రామ్ చరణ్ అద్భుతమైన వ్యక్తి. ఆయనతో కలిసి నటించడం అంత సులువు కాదు, కానీ ఆయన నన్ను సెట్స్‌లో ఎంతో కంఫర్టబుల్‌గా ఉంచారు. దానివల్ల నా పాత్రను నేను అనుకున్న రీతిలో, చాలా చక్కగా ప్రెజెంట్ చేయగలిగాను." దర్శకుడు బుచ్చిబాబు సానాపై దివ్యేందు ప్రశంసలు కురిపించారు. ఆయనను ఒక "మ్యాడ్ జీనియస్" గా అభివర్ణిస్తూ.. తనపై నమ్మకం ఉంచి ఈ పాత్రను ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు,. తనకు తెలుగు సంస్కృతి, భాష, భావోద్వేగాలు కొత్తవైనప్పటికీ చిత్ర యూనిట్ ఎంతో మద్దతుగా నిలిచిందని చెప్పారు. అలాగే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సతీష్ గారికి మరియు విజయవాడ ప్రేక్షకుల అద్భుతమైన ఎనర్జీకి ఆయన థాంక్స్ చెప్పారు.

TV9 Telugu27 May, 11:37 am
చీరకట్టుతోనే చితక్కొడుతున్న హీరోయిన్లు.. ఇండస్ట్రీలో కొత్త మాస్ ట్రెండ్

చీరకట్టుకుంటే సంప్రదాయంగానే కనిపించాలా ఏంటి? ఛలో ఇరగదీద్దాం అని యాక్షన్‌లోకి దిగేస్తే మాస్‌గా ఉండదా? రీసెంట్‌ గా మాస్‌ యాక్షన్‌ సినిమాలకోసం రంగంలోకి దిగేటప్పుడు శారీస్‌నే ప్రిఫర్‌ చేస్తున్నారు మన ఇంటి బంగారాలంతా. మా ఇంటి బంగారం ట్రైలర్‌తో ఇంట్రస్ట్ క్రియేట్‌ చేస్తున్నారు సమంత. ఒక్కొక్కరినీ కొడతాను చూడూ అంటూ ట్రైలర్‌లో డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. దానికి తోడు చీరకట్టుతో సామ్‌ చేసిన యాక్షన్‌ సీక్వెన్స్ మెప్పిస్తోంది. దీని గురించి మాట్లాడుతూ మాస్‌గా ఉంది కదా అని సామ్‌ అన్న తీరు యమా క్యూట్‌ అంటున్నారు ఫ్యాన్స్. చీరకట్టుకుని యాక్షన్‌ చేయడం నెక్ట్స్ లెవల్‌ అంటూ బ్లాస్ట్ ప్రెస్‌మీట్‌లో అభిరామి కూడా ఓపెన్‌ అయ్యారు. ప్యాంటు షర్టులతో కాదు, చీరకట్టుతో చేసే ఫైట్స్ ఇక ట్రెండ్‌ అవుతాయనే మాట వినిపిస్తోంది ఇండస్ట్రీలో. ఆల్రెడీ ఇదే రూట్లోనే ఉన్నానంటున్నారు నయన్‌ కూడా. ఆమె నటిస్తున్న ఫీమేల్‌ ఓరియంటెడ్‌ సినిమా రాక్కాయి గ్లింప్స్ లో ఫైట్‌ షాట్‌ కూడా చీరకట్టులోనే ఉంది. అటు రష్మిక మైసా ఫైట్స్ కూడా ఈ కోవలోనే ఉండే ఛాన్సెస్‌ పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో, ఇక ఫైట్స్ అంటే అమ్మాయిలు ప్యాంట్‌ షర్టుల జోలికి పోనక్కర్లేదన్నమాట. చీరకట్టుకున్నా చితక్కొట్టడం గ్యారంటీ అంటోంది ఫిల్మ్ ఇండస్ట్రీ. సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు US Visa Rules: ‘అమెరికా ఫస్ట్’ కొత్త వీసా షెడ్యూలింగ్ టూల్‌ పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు! నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్

NTV Telugu30 May, 05:46 am
ఆసక్తికరంగా రిస్క్ ట్రైలర్

‘సంపంగి’, ‘16’ వంటి సంచలన చిత్రాలకు చార్ట్‌బస్టర్ ఎవర్‌గ్రీన్ మ్యూజిక్ అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ స్వీయ దర్శకత్వంలో, నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం 'రిస్క్'. 'GK మిరాకిల్స్' బ్యానర్‌పై రూపొందుతున్న ఈ యూత్ ఫుల్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌లో సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను జూన్ రెండో వారంలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర బృందం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. హీరో సందీప్ అశ్వ ఎమోషనల్ అవుతూ.. "నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ప్యాషన్. షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోలు చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను. సిల్వర్ స్క్రీన్ పై నన్ను నేను హీరోగా చూసుకోవడానికి దాదాపు పదేళ్ల సుదీర్ఘ కాలం పట్టింది. దీన్నే నా తొలి విజయంగా భావిస్తున్నాను. ‘రిస్క్’ ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ప్యాకేజ్. ఫస్ట్ హాఫ్‌లో లవ్, కామెడీ, ఫ్రెండ్‌షిప్ ఉంటే.. సెకండ్ హాఫ్ అంతా మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లింగ్‌గా సాగుతుంది. రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా వంటి సీనియర్లతో నటించడం గొప్ప అనుభూతి. ఘంటాడి కృష్ణ గారు తన అద్భుతమైన పాటలతోనే కథ చెప్పారు. జూన్ రెండో వారంలో వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించాలి" అని కోరారు.

Telugu Cinema Updates News Keyword | Telugu Digital