translateexpand_more

Mamitha Baiju News

Latest updates from Telugu Digital news sources.

Sakshi01 Jun, 02:47 pm
ధనుశ్ లేటేస్ట్ మూవీ.. ఏకంగా నంబర్ వన్ గా ట్రెండింగ్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ధనుశ్, మమిత బైజు జంటగా నటించిన తాజా మూవీ కర. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న థియేటర్లలో రిలీజైంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌

SkyC Media31 May, 12:00 am
ఎల్లమ్మ మూవీలో హీరోయిన్ గా మమితా బైజు ఫిక్స్ అయినట్లేనా

దిల్ రాజు నిర్మాణంలో వేణు యెల్దండి దర్శకత్వంలో రాబోతున్న ఎల్లమ్మ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా మమితా బైజు పేరు దాదాపు ఫైనల్ స్టేజ్‌కు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేకర్స్ ఈమెతో జరుపుతున్న చర్చలు చాలా జోరుగా సాగుతున్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. చాలా మంది సినీ రిపోర్టర్లు కూడా ఈ సినిమాలో ఆమెనే హీరోయిన్‌గా ఫైనల్ అని గట్టిగా చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గనుక ఓకే అయితే తెలుగులో ఆమెకు ఇది చాలా పెద్ద అవకాశం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్ ఎంపిక కోసం మేకర్స్ గతంలో పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలించినట్లు సమాచారం. ముందుగా ఈ పాత్ర కోసం సాయి పల్లవి, కీర్తి సురేష్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పేరు కూడా గట్టిగా వినిపించింది. అయితే పలు కారణాల వల్ల వారు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాలేకపోయినట్లు తెలుస్తోంది. చివరకు మేకర్స్ మమితా బైజు వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం ఆమెతో చర్చల ప్రక్రియ తుది దశకు చేరుకుందని సమాచారం. ఇదిలా ఉండగా ఈ మలయాళ ముద్దుగుమ్మ ఇప్పటికే పలు విజయవంతమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె బాగా కనెక్ట్ అయింది. దీంతో పాటు ధనుష్‌తో కలిసి కర అనే సినిమాలో కూడా నటించింది. ఈ నేపథ్యంలో ఎల్లమ్మ సినిమాలో నటించే అవకాశం రావడం ఆమె కెరీర్‌కు ప్లస్ కానుంది. ఈ సినిమాలో హీరో డిఎస్‌పి పక్కన మమితా బైజు ఫ్రెష్ జోడీగా బాగా సెట్ అవుతుందని మేకర్స్

Chitrajyothy30 May, 10:59 am
ఆగిపోయిన ప్రేమలు 2.. కారణం అదే

ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సీక్వెల్స్ లో ప్రేమలు 2 (Premalu 2) కూడా ఒకటి. మలయాళంలోనే కాకుండా తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా హీరోయిన్ మమితా బైజు (Mamitha Baiju)ను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మార్చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సీక్వెల్స్ లో ప్రేమలు 2 (Premalu 2) కూడా ఒకటి. మలయాళంలోనే కాకుండా తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా హీరోయిన్ మమితా బైజు (Mamitha Baiju)ను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మార్చేసింది. నస్లీన్ కె గఫుర్ హీరోగా గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ప్రేమలు 2024 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. సచిన్- రీనూల క్యూట్ లవ్ స్టోరీని ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ అందరూ ఎంతో ఖుషీ అయ్యారు. ఎప్పుడెప్పుడు ఈ సీక్వెల్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే ప్రేమలు 2 సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఒక చేదు వార్త అందింది. గత కొన్నిరోజులుగా ప్రేమలు 2 సీక్వెల్ ఆగిపోయిందని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అవి రూమర్స్ అని ఫ్యాన్స్ అనుకున్నారు. తాజాగా అవి రూమర్స్ కాదని ప్రేమలు 2 ఆగిపోయిందని హీరో నస్లీన్ కన్ఫర్మ్ చేశాడు. ఒక ఇంటర్వ్యూలో నస్లీన్ ప్రేమలు 2 ఆగిపోవడానికి కారణాలను కూడా వెల్లడించాడు. 'ప్రేమలు 2 సినిమా ఆగిపోవడానికి ముఖ్య కారణం అనుకున్న స్క్రిప్ట్ ఆశించిన స్థాయిలో కుదరకపోవడమే. మొదటి భాగం సృష్టించిన భారీ విజయం కారణంగా ప్రేక్షకులు ఈ సీక్వెల్ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగా కథను సిద్ధం

10TV Telugu31 May, 09:09 am
అసలు కథే లేదు.. ప్రేమలు సీక్వెల్ పై అధికారిక ప్రకటన చేసిన టీమ్

Premalu 2: మలయాళంతో పాటు తెలుగులోనూ ఘనవిజయం సాధించిన ‘ప్రేమలు’. ఈ సినిమాకు సీక్వెల్ రానుందంటూ గతంలో ప్రకటనలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో, ఆడియన్స్ కూడా ఈ సీక్వెల్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూశారు. అయితే, షూటింగ్ ప్రారంభం కాకుండానే ‘ప్రేమలు 2(Premalu 2)’ ప్రాజెక్ట్‌ను నిర్మాతలు అధికారికంగా రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం క్రేజ్ ఉందనే కారణంతో కాకుండా, కథా పరంగా ఆశించిన స్థాయిలో వినోదం కుదరకపోవడం వల్లే ఈ సీక్వెల్ ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం. H Vinoth: నిజాలు మాట్లాడే ధైర్యం నాకు లేదు.. జన నాయకుడు డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు మరోవైపు, ఈ చిత్ర కథానాయకుడు నస్లెన్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కాల్ షీట్స్ సర్దుబాటు చేయలేని పరిస్థితి నెలకొంది. అలాగే కథానాయిక మమితా బైజు కూడా వరుసగా సీరియస్ పాత్రలు చేస్తుండటంతో, ఆమె లుక్స్‌లో మార్పులు వచ్చాయి. దీనివల్ల మొదటి భాగంలో ఉన్న కాలేజీ అమ్మాయి తరహా అమాయకత్వం, ఆ టీనేజ్ లుక్‌ను మళ్లీ తెరపై ఆవిష్కరించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్‌లో ఇటీవల అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి చిత్రానికి సీక్వెల్స్ ప్రకటించడం ఒక ట్రెండ్‌గా మారింది. ‘డెవిల్’, ‘యశోద’ వంటి చిత్రాలు పార్ట్-2 అంటూ హడావిడి చేసినా ఆ తర్వాత ఆ ఊసే లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో, సరైన స్క్రిప్ట్ లేకుండా బలవంతంగా సీక్వెల్స్ తీసి ఫ్లాప్ అవ్వడం కంటే, ‘ప్రేమలు 2’ను ఇక్కడితోనే ఆపేయడం సరైన నిర్ణయమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

Chitrajyothy28 May, 10:09 am
విశ్వనాథ్ అండ్ సన్స్ .. కొత్త రిలీజ్ డేట్

‘కరుప్పు’ సక్సెస్‌తో మంచి జోష్‌ మీదున్నారు సూర్య. అభిమానులకు రెట్టింపు ఆనందం పంచేలా తదుపరి చిత్రం అప్‌డేట్‌ను ఇచ్చారు. ‘కరుప్పు’ సక్సెస్‌తో మంచి జోష్‌ మీదున్నారు సూర్య (Suriya) అభిమానులకు రెట్టింపు ఆనందం పంచేలా తదుపరి చిత్రం అప్‌డేట్‌ను ఇచ్చారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ (Vishwanath And Sons) . వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. గురువారం ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. ఆగస్టు 14న వరల్డ్‌వైడ్‌ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలుత ఈ చిత్రాన్ని జులైలో విడుదలను ఆగస్ట్‌కు మార్చారు. కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన సూర్య వింటేజ్‌ లుక్‌ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా మమితా బైజు నటిస్తున్నారు. రవీనా టాండన్, రాధిక శరత్‌కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, నిమిష్ రవి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, బంగ్లాన్ కళా దర్శకుడిగా పనిచేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

NTV Telugu23 May, 08:57 am
Kara: ధనుష్‌ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ ..

- వర్సటైల్ యాక్టర్ ధనుష్ (Dhanush), మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు (Mamitha Baiju) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘కర’ (Kara). - థియేటర్లలో సాలిడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం.. - ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై రచ్చ చేయడానికి డేట్ ఫిక్స్ చేసుకుంది.

10TV Telugu28 May, 04:13 am
ఎల్లమ్మలో హీరోయిన్ గా మమిత బైజు

Yellamma : దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఎలమ్మ మూవీకి సంబంధించి హీరోయిన్‌ ఎవరు అనే దానిపై మేకర్స్ చాలాకాలంగా చర్చలు జరుపుతున్నారు. ముందు సాయిపల్లవి ఆ తర్వాత కీర్తి సురేష్‌ మధ్యలో మృణాల్ ఠాకూర్ ఇలా చాలా పేర్లు వినిపించాయి. ఇప్పుడు మమితా బైజు పేరు దాదాపు ఫైనల్‌ అయినట్లే అనే డిస్కషన్ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌తో దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇస్తుండగా ఆయన పక్కన కొత్త ఫేస్ కోసం చూస్తున్నారట. దీనికోసం మమిత పేరును ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే ఫ్రెష్ జోడీగా మంచి బజ్ క్రియేట్ అవుతుందనేది మేకర్ ఒపీనియన్‌. Kevvu Kartheek : భార్య సీమంతం వేడుకలు.. ఫొటోలు షేర్ చేసిన జబర్దస్త్ కెవ్వు కార్తీక్.. ప్రేమలు, డ్యూడ్‌లాంటి సినిమాలతో మమిత తెలుగు ప్రేక్షకులకు చేరువ అయింది. ధనుష్‌ హీరోగా వచ్చిన కర మూవీలో కనిపించింది మమిత. సెల్లి అనే మిడిల్‌క్లాస్ అమ్మాయి పాత్రలో ఆకట్టుకుంది. కర మూవీతో మమితకు మంచి గుర్తింపు రాగా.. పెద్ద బ్యానర్ల అటెన్షన్‌ డ్రా చేసింది. అదే ఎల్లమ్మలో చాన్స్‌ దక్కేలా చేసిందని, డీఎస్పీ పక్కన మమిత దాదాపు ఫైనల్ అయినట్లే అనే గాసిప్స్‌ జోరుగా వినిపిస్తున్నాయి.

Sakshi29 May, 12:55 am
ఎల్లమ్మలో

‘ఎల్లమ్మ’ చిత్రంలో భాగం కానున్నారట యువ హీరోయిన్‌ మమితా బైజు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఎల్లమ్మ’. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘బలగం’ ఫేమ్‌ వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్ర చేయనున్నారని తొలుత కీర్తీ సురేష్‌ పేరు వినిపించింది. కానీ ఆమె భాగం కాలేదు. ఆ తర్వాత మృణాల్‌ ఠాకూర్‌తో ‘ఎల్లమ్మ’ టీమ్‌ చర్చలు జరిపారనే టాక్‌ వినిపించింది. అయితే మృణాల్‌ ఇంకా ఫైనల్‌ కాలేదు. తాజాగా యంగ్‌ హీరోయిన్‌ మమితా బైజుతో ‘ఎల్లమ్మ’ సినిమా మేకర్స్‌ సంప్రదింపులు జరుపుతున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. మరి... ‘ఎల్లమ్మ’ చిత్రంలో మమితా బైజు ఫైనల్‌ అవుతారా? లేక మరో హీరోయిన్‌ పేరు ఏమైనా వినిపిస్తుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. సాయిపల్లవి ఫ్యామిలీ టైమ్.. అందరితో ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు) తిరుపతి: వైభవంగా నారాయణవనం బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు) రష్మిక జపాన్ ట్రిప్.. యానిమే అవార్డ్ వేడుకలో ఇలా (ఫొటోలు) తిరుపతి: స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్‌ దంపతులు (ఫోటోలు) ఆయన శాఖను గాలికి వదిలేశాడు.. లోకేష్ పై పేర్ని నాని పంచులు నా ఫ్యామిలీ జోలికి రావద్దు..! వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ రిలేషన్ లో ఉంటే గీ పనులు అసలు చేయకుండ్రి..!

SkyC Media29 May, 06:55 am
డీఎస్పీ హీరోగా వస్తున్న ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ గా మమితా బైజు

దేవిశ్రీ ప్రసాద్ హీరోగా వస్తున్న ఎల్లమ్మ సినిమా హీరోయిన్ గా ప్రేమలు ఫేమ్ మమితా బైజు నటించనున్నట్లు సమాచారం. దిల్ రాజు కాంపౌండ్ లో చర్చలపై ప్రత్యేక కథనం.

Chitrajyothy28 May, 11:49 am
దేవి శ్రీ ప్రసాద్ 'ఎల్ల మ్మ '.. జోడీగా ల క్కీ హీరోయిన్

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతుండటంతో ‘ఎల్లమ్మ’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బలగం’ (Balagam) వంటి సూపర్ హిట్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు యెల్దండి (venu yeldandi) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’(Yellamma). రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (devi sri prasad) ఈ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అవుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (dil raju) ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. కథపై ఉన్న నమ్మకంతో ఎంత లేట్ అవుతున్నా సరే, పట్టు వదలకుండా వేణుని తన దగ్గరే అట్టిపెట్టుకుని ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నారు. ఒకవేళ గతంలో ఈ కథకు నాని ఒప్పుకుని ఉంటే ఈపాటికి రిలీజైపోయి ‘దసరా’ను మించిన పేరు తెచ్చేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే ఈ పాత్ర దేవిశ్రీ ప్రసాద్‌ను వరించడంతో, కథాబలం రీత్యా ఆయనకు హీరోగా కూడా బ్లాక్ బస్టర్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల ‘ఎల్లమ్మ’కు సంబంధించి దేవి స్వంత ఊరి వీడియో ఒకటి బయటకు రావడం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమాలో హీరో పాత్ర ఎంత క్రేజీగా ఉండబోతుందో, హీరోయిన్ పాత్రకు కూడా అంతే ప్రాధాన్యం ఉందని సమాచారం. కేవలం గ్లామర్ పాత్రగా కాకుండా, ఇంటెన్స్ యాక్షన్ డిమాండ్ చేసే ఎమోషనల్ రోల్ కావడంతో హీరోయిన్ ఎంపిక మేకర్స్‌కు పెద్ద టాస్క్‌గా మారింది. డబ్బింగ్ తో మేనేజ్ చేయడం కాకుండా స్వయంగా పర్ఫెక్ట్ ఎమోషన్స్ పలికించగల నటి కోసం అన్వేషణ సాగుతోంది. ఈ క్రమంలో గతంలో పలువురు ముద్దుగుమ్మల పేర్లు తెరపైకి వచ్చాయి. మహానటి కీర్తి సురేష్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని ప్రచారం జరగ్గా.. ఆ

Sakshi28 May, 03:53 pm
సాయిపల్లవి, కీర్తి సురేశ్.. ఇప్పుడు మమిత

తెలుగు సినిమాల్లో హీరోయిన్లు అనగానే అయితే ముంబై నుంచి వస్తారు లేదంటే మలయాళ భామలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్లే సాయిపల్లవి, కీర్తి సురేశ్ లాంటి కేరళ కుట్టీలు టాలీవుడ్ స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు మమిత బైజు లాంటి యంగ్ బ్యూటీస్ కూడా అవకాశాలు చేజిక్కుంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే మమిత దగ్గరకు ఓ ఊహించని అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: 'పెద్ది' నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్) 'బలగం'తో దర్శకుడిగా మారిన కమెడియన్ వేణు.. అద్భుతమైన హిట్ కొట్టాడు. ఇది జరిగి చాన్నాళ్లయిపోయింది. తర్వాత 'ఎల్లమ్మ' పేరుతో ఓ సినిమా తీయాలి. అయితే ఇందులో నటించే హీరో ఎవరనే దగ్గర ఏళ్లు గడిచిపోయాయి. తొలుత నాని అనుకున్నారు కుదర్లేదు. తర్వాత నితిన్, శర్వానంద్ పేర్లు వినిపించాయి. చివరకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ దగ్గరకు వచ్చి ఆగింది. ఇతడు ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. హీరో ఎవరో తేలిపోయింది ఇక హీరోయిన్ సంగతి చూద్దాం అని మూవీ టీమ్ అనుకున్నారు. సాయిపల్లవి, కీర్తి సురేశ్, మృణాల్ ఠాకుర్, భాగ్యశ్రీ.. ఇలా చాలా పేర్లు వినిపించాయి. ఇప్పుడీ లిస్టులోకి మలయాళ లేటెస్ట్ సెన్సేషన్ మమిత బైజు వచ్చి చేరింది. ఒకవేళ ఈ పాత్ర గనుక ఈమె చేస్తే బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 'ఎల్లమ్మ'లో హీరోయిన్ పాత్రకు ఫెర్మార్మ్ చేసే స్కోప్ ఎక్కువుంది. మరి ఆ ఛాన్స్ మమితకు దక్కుతుందా? వేరే ఆప్షన్ ఏమైనా చూస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. దిల్ రాజు దీనికి నిర్మాత. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్) సాయిపల్లవి ఫ్యామిలీ టైమ్.. అందరితో ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు)

SkyC Media28 May, 11:49 am
నేడే ధనుష్ కారా నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్

కారా నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ మే 28, 2026 నుంచి ప్రారంభమైంది. ధనుష్, మమితా బైజు నటించిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఐదు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ధనుష్ క్రైమ్ థ్రిల్లర్ 'కారా' ఈరోజు నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది, అస్సలు మిస్ అవ్వకండి! #kara #dhanush #netflix #karastreaming #crimethriller మీకు నచ్చిన భాషలో ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించండి!

Sakshi28 May, 03:19 am
డ్యూడ్ హీరోయిన్ తో ప్రదీప్ మూవీ.. కాకపోతే ఓ ట్విస్ట్

ఇప్పుడు దర్శకులు, నటులు నిర్మాతలుగా మారుతున్న తరుణం. విజయాలకు దూరమవుతున్న నటులు సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి సక్సెస్‌ అయ్యే ప్రయత్నాలు చేస్తుంటారు. దర్శకులుగా ఉన్నత స్థాయికి చేరుకున్న వారు కూడా సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి తమ శిష్యులకు, ఇతర నూతన దర్శకులకు అవకాశాలు కల్పిస్తుంటారు. తాజాగా దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌ కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. 2019లో దర్శకుడిగా పరిచయమై రవిమోహన్‌ హీరోగా కోమాలి అనే చిత్రాన్ని తెరకెక్కించి హిట్‌ కొట్టారు. హీరోగానూ సక్సెస్‌ ఆ తరువాత హీరోగా రంగప్రవేశం చేసి స్వీయ దర్శకత్వంలో లవ్‌టుడే పేరుతో మూవీ చేసి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత డ్రాగన్‌ చిత్రంలో హీరోగా నటించి సంచలన విజయాన్ని అందుకున్నారు. అదే విధంగా ఈయన కథానాయకుడిగా నటించిన డ్యూడ్‌ ఘన విజయాన్ని సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో నయనతార నిర్మించిన ఎల్‌ఐకే చిత్రంలో ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటించారు. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. నిర్మాతగా.. ఇకపోతే మళ్లీ మెగాఫోన్‌ పట్టుకొనేందుకు రెడీ అయిన ప్రదీప్‌ రంగనాథన్‌ తానే హీరోగా ఏజీఎస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థలో చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన సడెన్‌గా సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి చిత్ర షూటింగ్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి దర్శకుడు ఎవరు? కథానాయకుడు ఎవరు? అన్న వివరాలు వెలువడలేదుగానీ హీరోయిన్‌గా మమితాబైజు నటిస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రదీప్‌ డ్యూడ్‌ మూవీలో మమిత హీరోయిన్‌ అన్న విషయం తెలిసిందే! వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ (ఫొటోలు) 'సమ్మర్ హాలీడేస్'

Mamitha Baiju News Keyword | Telugu Digital