
Pawan Kalyan-Chirri Balaraju: ఇన్నాళ్లు పాలన మీద పట్టు సాధించేందుకు టైమ్ కేటాయించిన పవన్.. ఇప్పుడు పార్టీని సెట్‌రైట్ చేసే పనిలో ఉన్నారు. వివాదాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు, నేతలకు పిలిచి మరీ క్లాస్‌లు ఇస్తున్నారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు.. పవన్ నాలుగు వారాల డెడ్‌లైన్ విధించడం ఇప్పుడు రాజకీయంగా హాట్‌టాపిక్ అవుతోంది. ఈ నాలుగు వారాల్లో వివాదాల నుంచి ఆయన బయటపడగలరా.. ఇకపై బాలరాజుకు ఎదురుకాబోయే సవాళ్లేంటి.. పోలవరం రాజకీయాల్లో ఒక్కసారిగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో.. ఈ మధ్య జనసేనాని పవన్ వన్ టు వన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మాములుగా రివ్యూలు అంటే నియోజకవర్గాల అభివృద్ధిపై జరుగుతాయ్. ఐతే వివాదాలపై ఎమ్మెల్యేకు క్లాస్ తీసుకున్న పవన్.. వాటిని సెట్‌రైట్ చేసుకునేందుకు నాలుగు వారాల డెడ్‌లైన్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. నాలుగు వారాల్లో బాలరాజు అంతా క్లియర్ చేసుకుంటారా.. ఒకవేళ చేసుకోకపోతే పరిస్థితి ఏంటి.. అసలు ఆయనకు ఎందుకు పవన్ డెడ్‌లైన్ విధించారు.. ఆయన చుట్టూ ఉన్న వివాదాలు ఏంటి అని ఏపీ రాజకీయాల్లో డిస్కషన్ కనిపిస్తోంది. పంచాయితీల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం 147 కోట్ల నిధులు కేటాయించగా.. క్షేత్రస్థాయిలో పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలుస్తోంది. దీనిపై పవన్ నిలదీసినట్లు తెలుస్తోంది. నిధుల కేటాయింపు, టెండర్ల వెనక తప్పులు జరిగాయని విపక్షాలతో పాటు సొంత పార్టీలోనే ఆరోపణలు వినిపించడం పవన్‌కు కోపం తెప్పించింది. దీంతో నాలుగు వారాల్లో పనులు స్పీడప్ కావాలని.. ఆరోపణలకు చెక్ పెట్టాలని.. నాలుగు వారాల డెడ్‌లైన్ పెట్టి ఎమ్మెల్యేకు పవన్ అల్టిమేటం జారీ చేశారని టాక్. చిర్రి బాలరాజుకు కేవలం ఆర్థిక,















