translateexpand_more

Andhra Politics News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 09:57 am
పనిచేయకపోతే నమస్కారం పెట్టి పక్కనపెట్టేస్తా.. ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు

అమరావతి, జూన్ 2: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్‌పై వర్క్ షాప్‌లో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 4న ఎన్డీఏ నేతల సమావేశం జరగనుందని తెలిపారు. రాష్ట్ర, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఎన్డీఏ సమన్వయ కమిటీల నియామకం జరగనున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలను కలుపుకువెళ్లాలని.. బలం ఎక్కువా తక్కువా అనేది అనవసరమని, అటువంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దన్నారు. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేలకు సీఎం స్పష్టం చేశారు. జెండా మోయాలంటే జెండా ద్వారా వచ్చిన అధికారంలో కార్యకర్తలను భాగస్వామ్యులను చేయాల్సిందే అని చెప్పారు.

పదవి ఎవరికీ శాశ్వతం కాదని.. పనిచేసినంత కాలం పదవికి ఢోకా ఉండదని సీఎం అన్నారు. పని చేయకపోతే నమస్కారం పెట్టి ఎటువంటి మొమమాటం లేకుండా పక్కనపెట్టేస్తానని తేల్చిచెప్పేశారు. ఎవరూ వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దన్నారు. అమెరికన్ డెమోక్రసీలో రెండు సార్లు మాత్రమే ఎన్నికయ్యేందుకు అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. ‘మన దగ్గర ప్రజలు మెచ్చినంత కాలం మనం ఎమ్మెల్యేగా ఉండవచ్చు. ఎమ్మెల్యేల ప్రవర్తన బాగుంటే.. ఓట్లు పడతాయి.. ప్రజలు ఆదరిస్తారు. ఎమ్మెల్యేల ప్రవర్తన బాగోలేకపోతే ఓట్లు పోతాయి.. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. పనిచేయకపోయినా పర్వాలేదు.. నోరు మాత్రం పారేసుకోవద్దు. తస్మాత్... జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలను చంద్రబాబు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి..

మే నెలలో రికార్డు స్థాయి దర్శనాలు

తెలంగాణ ప్రజలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

Read Latest AP News And Telugu News

Andhra Jyothy01 Jun, 02:58 pm
తాటికల్లు రుచి చూసిన సీఎం చంద్రబాబు

కాకినాడ జిల్లా, తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలం ఇంటికి స్వయంగా వెళ్లారు. కాకినాడ జిల్లా, తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలం ఇంటికి స్వయంగా వెళ్లారు. గీత కార్మికులు ఎంతో నైపుణ్యంతో తాటి చెట్టుపైకి ఎక్కి సాంప్రదాయ పద్ధతిలో కల్లు తీసే ప్రత్యేక విధానాన్ని ముఖ్యమంత్రి ఎంతో ఆసక్తిగా, క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో గీత కార్మికులు అప్పుడే తాటి చెట్టు నుంచి స్వచ్ఛంగా తీసిన తాజా తాటి కల్లును ఆయన స్వయంగా రుచి చూడటం అక్కడ ఉన్న స్థానికులను, అధికారులను ఎంతగానో ఆకట్టుకుంది.

Andhra Jyothy29 May, 09:23 am
సాధారణ పీఏ ఖాతాలోకి అన్ని కోట్లు ఎలా వచ్చాయి

లిక్కర్ స్కామ్‌లో వైసీపీ నేతలు కోట్ల రూపాయిలు దోచుకున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభిరామ్ విమర్శించారు. ఈ స్కామ్‌లో వేళ్లన్నీ తాడేపల్లి పెత్తందారుల వైపే చూపిస్తున్నాయని మండిపడ్డారు. అమరావతి, మే29: లిక్కర్ స్కామ్‌లో వైసీపీ నేతలు కోట్ల రూపాయిలు దోచుకున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభిరామ్ విమర్శించారు. ఈ స్కామ్‌లో వేళ్లన్నీ తాడేపల్లి పెత్తందారుల వైపే చూపిస్తున్నాయని మండిపడ్డారు. గొడ్డలి పార్టీకి P4 పథకం ఉందన్నారు. అవే.. పవర్, ప్రాపర్టీ, పైసా, పార్ట్‌నర్షిప్‌‌లని వ్యంగ్యంగా అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జేబులు నింపుకోవడమే గొడ్డలి పార్టీ P4 లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం రాజధాని అమరావతిలో కె.పట్టాభిరామ్ మాట్లాడుతూ.. 2019-24 మధ్య వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వర్ రెడ్డి (కేఎన్ఆర్) భార్య ఖాతాలోకి రూ.20 కోట్లు వచ్చాయని ఆరోపించారు. ఓ సాధారణ పీఏ కేఎన్ఆర్ ఖాతాలోకి అన్ని కోట్లు ఎలా వచ్చాయి? అని పట్టాభిరామ్ ప్రశ్నించారు. అలాగే బెంగళూరుతో సహా పలు ప్రాంతాల్లో అతడికి ప్లాట్లు ఎలా వచ్చాయని సందేహం వ్యక్తం చేశారు. జగన్ పీఏకు మూడు రాష్ట్రాల్లో ఆస్తులున్నాయని పట్టాభిరామ్ తెలిపారు. ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ వ్యవహారంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పీఏ కేఎన్ఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు. సిట్ కార్యాలయంలో గురువారం ఉదయం 11.00 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ రాత్రి వరకు కొనసాగింది. బుధవారం కూడా కేఎన్‌ఆర్‌ను సిట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా సిట్ అధికారులకు కేఎన్ఆర్ పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. 2019కి ముందు కేఎన్ఆర్ సాధారణ జీవితాన్ని గడిపారు. అయితే 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం హయాంలో అతడు వందల కోట్ల రూపాయిలకు అధిపతిగా మారినట్లు సిట్

10TV Telugu25 May, 02:19 pm
Pawan Kalyan: రాజకీయ పార్టీ నడపడం అంత సులువు కాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తనతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన...

Pawan Kalyan: రాజకీయ పార్టీ నడపడం అంత సులువు కాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తనతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన విషయాలు బయటవాళ్లకు ఎలా తెలుస్తాయి అని పవన్ ప్రశ్నించారు. ఈ అంశంపై ఏపీ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడ...

10TV Telugu26 May, 12:30 am
Pawan Kalyan: ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క ! తీరు మారిందా సరే.. లేదంటే మామూలుగా ఉండదు. ఇలానే కనిపిస్తున్నారు జనసేన...

Pawan Kalyan: ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క ! తీరు మారిందా సరే.. లేదంటే మామూలుగా ఉండదు. ఇలానే కనిపిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆయన ఫైర్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చూస్తూనే.. మరోవైపు...

Andhra Jyothy27 May, 01:27 am
ప్రొఫెసర్ నాగేశ్వర్ పై పవన్ కీలక వ్యాఖ్యలు

ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగేశ్వర్ రాజకీయ విశ్లేషణలకు అర్థం లేదని పవన్ అన్నారు. ఆయన పొరపాటున భావోద్వేగంతో మాట్లాడి ఉండొచ్చని పేర్కొన్నారు. ఇంటర్నెట్ డెస్క్: ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగేశ్వర్ రాజకీయ విశ్లేషణలకు అర్థం లేదని పవన్ అన్నారు. ఆయన పొరపాటున భావోద్వేగంతో మాట్లాడి ఉండొచ్చని పేర్కొన్నారు. నాగేశ్వర్‌పై కేసులు పెడితే వదిలేయమని తాను చెప్పానని తెలిపారు. తమపై పదేపదే ఆరోపణలు చేసే వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి.. పంచ్‌ ప్రభాకర్‌ను అరెస్ట్‌ చేయాలి: టీజీ వెంకటేశ్‌

Sakshi27 May, 03:54 am
సీఎం పదవి చేపట్టలేని సిగ్గులేని జాతి మాది

సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో కాపులు ముఖ్యమంత్రి కావాలన్నది తమ చిరకాల ఆకాంక్ష అని.. కాపు యువత ఇదే కోరుకుంటోందని తెలుగుదేశం పార్టీ నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ అన్నారు. తిరుపతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాపు సామాజికవర్గం పవన్‌ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలనుకుందన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించడం లేదన్నారు. సీఎం పదవి చేపట్టలేని సిగ్గు లేని జాతి తమదని, ఎంతకాలం తాము బ్రోకర్లుగా, జోకర్లుగా ఉండాలని ఆయన ప్రశ్నించారు. రానురాను కాపు జాతికి సిగ్గు, పౌరుషం తగ్గిపోతోందన్నారు. టీడీపీ అంటే కమ్మ, జనసేన అంటే కాపు పార్టీ అన్న విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు. అయితే పవన్‌ కళ్యాణ్‌ మాత్రం తనకు కులం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నిజంగా పవన్‌కు కులం అవసరం లేదనుకుంటే కాపు జాతి వద్దని బహిరంగంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాపు కులం లేకపోతే పవన్‌ కళ్యాణ్, చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేవారా?. పవన్‌ ఈ రోజు మాత్రం రాణించగలిగే వాడా అంటూ ప్రశ్నించారు. కాపు కులం గురించి పవన్‌ తక్కువ చేసి మాట్లాడడం బాధాకరమని అన్నారు. పవన్‌కు ఆ ఆలోచన లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. కాపులను దూరం పెట్టే పనిలో పవన్‌.. గత ఎన్నికల్లో కాపు జాతి పవన్‌ కళ్యాణ్‌ను సొంతం చేసుకుందని... కానీ పవన్‌ కళ్యాణ్‌ కాపులను దూరం పెట్టే పనిలో ఉన్నారని ఓవీ రమణ అన్నారు. కాపు కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కూడా కేటాయించని ప్రభుత్వంలో కాపు నేతగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌కు ప్రశ్నించే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాపులు, ఎస్సీ, ఎస్టీలు కలిసి ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్నారని, పవన్‌ ఇలాగే ఉంటే రాష్ట్రంలో

Andhra Politics News Keyword | Telugu Digital