translateexpand_more

Ranveer Singh Sends Legal Notice News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu03 Jun, 12:14 pm
ఇక సహించేది లేదు.. ఫిల్మ్ ఫెడరేషన్ కు లీగల్ నోటీసులు పంపించిన హీరో రణ్ వీర్ సింగ్

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Ranveer Singh Sends Legal Notice To FWICE: బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘డాన్‌ 3’ వివాదం రోజురోజుకూ ముదురుతూ చివరకు కోర్టు మెట్లెక్కింది. ఈ సినిమాలో హీరోగా నటించాల్సిన స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్.. ప్రాజెక్ట్ నుండి మధ్యలోనే తప్పుకోవడంతో వివాదం మొదలైంది. దీనిపై స్పందించిన ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) సంస్థ రణ్‌వీర్‌పై నిషేధం విధించింది. ఈ చర్యను సవాలు చేస్తూ రణ్‌వీర్ సింగ్ మంగళవారం ఆ సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. రణ్‌వీర్ సింగ్ చర్చలకు సహకరించకపోవడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ గతంలో పేర్కొంది. సినిమా ప్రీ ప్రొడక్షన్ ఆలస్యం కావడం వల్ల నిర్మాతలకు దాదాపు రూ.45 కోట్ల నష్టం వాటిల్లిందని, ఆ వివాదం పరిష్కారమయ్యే వరకు ఎవరూ రణ్‌వీర్‌తో కలిసి పనిచేయకూడదని ఆదేశించింది. ఇక తమకు లీగల్ నోటీసులు అందిన విషయాన్ని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ప్రతినిధి అశోక్ పండిట్ ధ్రువీకరించారు. దీనిపై ముంబైలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. మరోవైపు ఈ తీవ్ర వివాదంపై రణ్‌వీర్ సింగ్ బృందం స్పందించింది. రణ్‌వీర్‌‌కు తన వృత్తి పట్ల, పరిశ్రమ పట్ల అపారమైన గౌరవం ఉందని వెల్లడించింది. సినిమా బాగా రావాలనే ఉద్దేశంతోనే ఆయన ఇప్పటివరకు ఈ వివాదంపై మౌనంగా ఉన్నారని స్పష్టం చేసింది. అయితే రణ్‌వీర్ లీగల్ నోటీసుల వ్యవహారంతో ఈ వివాదం బాలీవుడ్‌లో మరింత వేడెక్కింది. Also Read: Telangana Govt: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మూడు నోటిఫికేషన్లు జారీ.. దరఖాస్తు, పరీక్షల తేదీలు ఇవే! Also Read: Zee Unite8 Sports: క్రీడాభిమానులకు అదిరిపోయే శుభవార్త.. 'యునైట్8 స్పోర్ట్స్' ఛానెల్ ప్రారంభించిన జీ న్యూస్ స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Ranveer Singh Sends Legal Notice News Keyword | Telugu Digital