translateexpand_more

Ravi Kiran Kola News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu02 Jun, 09:36 am
రాజశేఖర్ కోసం విజయ్ సేతుపతిని తీసేశారా.. 'రౌడీ జనార్ధన' టీం షాకింగ్ డెసిషన్

Rowdy Janardhana: తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా లెవల్లో విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన ఒక సినిమా చేస్తున్నాడు అంటే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. అది అయన నటనకు, డేట్స్‌కు ఉన్న డిమాండ్. ఈ కారణంగానే చాలా సినిమాలను మిస్ చేసుకున్నాడు ఈ నటుడు. ఇటీవల, స్టార్ దర్శకుడు సుకుమార్ సైతం ‘పుష్ప’ చిత్రం కోసం చాలా కాలం వేచి చూశారు. అయినప్పటికీ సేతుపతి అందుబాటులోకి రాకపోవడంతో ఆ పాత్ర ఫాహద్ ఫాజిల్‌ను వరించింది. కేవలం తెలుగు, తమిళంలోనే కాకుండా కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల నుండి కూడా ఆయనకు భారీ ఆఫర్లు వస్తుంటాయి. Arjun Sarja: ఫేక్ కలెక్షన్స్ వేసి మోసం చేయలేను.. అర్జున్ సర్జా సంచలన కామెంట్స్.. నెటిజన్స్ ఫిదా కానీ, బయటి భాషా చిత్రాల ఎంపికలో సేతుపతి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్లమ్ డాగ్’ మినహా ఆయన మరే ఇతర చిత్రానికి సులువుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘రౌడీ జనార్ధన(Rowdy Janardhana)’. ఈ చిత్రంలోని పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ మొదటి నుండి విజయ్ సేతుపతినే అనుకున్నారు టీం. ఆయనను దృష్టిలో పెట్టుకునే దర్శకుడు ఆ పాత్రను మలిచారు. సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అడిగినంత పారితోషకం ఇవ్వడానికి నిర్మాత దిల్ రాజు కూడా సిద్ధపడ్డారు. అందుకే, ఆయన కోసం వెయిట్ చేస్తూ, విలన్ సీన్లను మినహాయించి మిగతా షూటింగ్‌ను పూర్తి చేస్తున్నారు. కానీ, సేతుపతి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ నిరీక్షణకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబరులోనే సినిమాను విడుదల చేయాలని టార్గెట్‌గా పెట్టుకోవడంతో, ఇక ఆలస్యం చేయడం కుదరదని ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ హీరో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్‌ను ఆ విలన్ పాత్ర కోసం సంప్రదించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇటీవలే రాజశేఖర్ ‘బైకర్’ చిత్రంలో తండ్రి పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా తన రూట్‌ను మార్చుకుంటున్న రాజశేఖర్ ఈ భారీ ప్రాజెక్టులో నటిస్తే సినిమాకు ఖచ్చితంగా సరికొత్త మైలేజ్ వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి ఇంతకాలం హీరోగా, నటుడిగా మెప్పించిన రాజశేఖర్, విలన్ గా ఏమేరకు ఆకట్టుకుంటాడు అనేది చూడాలి.