translateexpand_more

Rcb Ipl 2026 Winners News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 12:00 pm
ఐపీఎల్ లో అత్యంత అరుదైన ఘనత అందుకున్న ఆర్సీబీ ప్లేయర్లు

ఐపీఎల్‌ చరిత్రలో ఒక్కేఒక్కరు సాధించిన అరుదైన ఘనతను, తాజాగా ఆర్సీబీ ఆటగాళ్లు ఫిల్‌ సాల్ట్‌, సుయాశ్‌ శర్మ సాధించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్‌ 2026 ఛాంపియన్‌గా నిలవడంతో ఈ ఇద్దరూ హ్యాట్రిక్‌ ఐపీఎల్‌ టైటిళ్ల అరుదైన ఫీట్‌ను నమోదు చేశారు. స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచిన సంగతి తెలిసిందే. వరుసగా రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకోవడంతో ఆ జట్టు సభ్యులతో పాటు అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఆర్సీబీ జట్టు విజయం సాధించడంతో పాటు ఐపీఎల్ చరిత్రలో అత్యంత అరుదైన ఘనతను ఆ జట్టులోని ఇద్దరు సభ్యులు సాధించారు. అది కూడా ఐపీఎల్‌ చరిత్రలో ఒకే ఒక్కరికి దక్కిన రికార్డును ఈ ప్లేయర్లు సాధించారు. మరి.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్‌ 2026 ఛాంపియన్‌గా నిలవడంతో ఆ జట్టులోని ఆటగాళ్లు ఫిల్‌ సాల్ట్‌, సుయాశ్‌ శర్మ హ్యాట్రిక్‌ ఐపీఎల్‌ టైటిళ్లు గెలిచిన అరుదైన ఫీట్‌ను నమోదు చేశారు. టైటిళ్లు గెలిచిన సీజన్‌లలో ఆయా జట్లలో కనీసం ఒక మ్యాచ్‌ అయినా ఆడిన ఆటగాళ్లుగా వీరు ఉన్నారు. గతంలో కర్ణ్‌ శర్మ ఒక్కడే ఈ ఘనతను సాధించగా.. తాజాగా సాల్ట్‌, సుయాశ్‌ ఈ జాబితాలో చేరారు. కర్ణ్‌ శర్మ 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో, 2017లో ముంబై ఇండియన్స్‌తో, 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్లలో సభ్యుడిగా ఉండి ఐపీఎల్‌ టైటిళ్లు సాధించాడు. అలానే సాల్ట్‌, సుయాశ్‌ ఇద్దరూ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో, 2025, 2026లో ఆర్సీబీతో ఐపీఎల్‌ టైటిళ్లు సాధించి... ఈ చారిత్రక రికార్డును సొంతం చేసుకున్నారు. ఐపీఎల్ 2026 వేలంలో 11.50 కోట్లకు సాల్ట్‌ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో ఆరు మ్యాచులు ఆడిన సాల్ట్ 168.33 స్ట్రైక్ రేట్‌తో 202 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో 40 మ్యాచులు ఆడిన సాల్ట్ 12 హాఫ్ సెంచరీలతో సహా 1258 పరుగులు సాధించాడు. ఇక సుయాశ్ విషయానికి వస్తే.. అతడిని ఐపీఎల్ 2026 వేలంలో ఆర్సీబీ రూ.2.60 కోట్లకు దక్కించుకుంది. ఈ యువ లెగ్ స్పిన్నర్ ఐపీఎల్-19లో 12 మ్యాచులు ఆడి 9.21 ఎకానమీ రేటుతో 9 వికెట్లు సాధించాడు. మొత్తంగా 39 ఐపీఎల్ మ్యాచుల్లో 44.07 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు. చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్... ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ జంట

Rcb Ipl 2026 Winners News Keyword | Telugu Digital