translateexpand_more

Sports News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 04:06 pm
పంజాబ్ కింగ్స్ స్పిన్ కోచ్ కు టీమిండియా కీలక పదవి

ఐపీఎల్ 2026లో పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించిన సాయిరాజ్‌ బహుతులేకు భారత క్రికెట్ జట్టులో కీలక పదవి దక్కింది. ఈ మాజీ లెగ్‌ స్పిన్నర్‌ను టీమిండియా ప్రత్యేక స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమించింది. స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2026)లో పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించిన సాయిరాజ్‌ బహుతులేకు భారత క్రికెట్ జట్టులో కీలక పదవి దక్కింది. ఈ మాజీ లెగ్‌ స్పిన్నర్‌ను టీమిండియా ప్రత్యేక స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమించింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఇవాళ (మంగళవారం) అధికారికంగా ప్రకటించింది. అంతర్జాతీయ , దేశీయ క్రికెట్‌లో దిగ్గజ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన బహుతులేకు ఆటగాడిగా, కోచ్‌గా విశేష అనుభవం ఉంది. ముఖ్యంగా యువ స్పిన్నర్లను తీర్చిదిద్దడంలో, వారి ప్రతిభను మెరుగుపరచడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఆయనకు ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. బహుతులే టీమిండియా తరఫున 2 టెస్టులు, 8 వన్డేలు ఆడాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 6,176 పరుగులు చేశాడు. అంతేకాక 630 వికెట్లు సాధించి దేశీయ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఆల్‌రౌండర్లలో ఒకరిగా నిలిచాడు. అలానే కోచ్‌గా కూడా బహుతులే అనేక విజయాలు సాధించాడు. విదర్భ, కేరళ, గుజరాత్‌, బెంగాల్‌ దేశవాళీ జట్లకు ప్రధాన కోచ్‌గా సేవలందించాడు. అలాగే ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో పాటు రాజస్థాన్‌ రాయల్స్‌కు సుదీర్ఘంగా కాలం స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా పని చేశాడు. అతడు ఐసీసీ అండర్‌19 ప్రపంచకప్‌ 2022 గెలిచిన భారత జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. అండర్‌ 19 ప్రపంచకప్‌2024లో కూడా కోచింగ్‌ సిబ్బందిలో సభ్యుడిగా ఉన్నాడు. అదనంగా ఇండియా-ఏ, సీనియర్‌ జట్లతో పలు పర్యాయాలు ప్రత్యేక బౌలింగ్‌ కోచ్‌గా పని చేశాడు. యువ ఆటగాళ్ల అభివృద్ధిలో ఆయన చేసిన కృషి బీసీసీఐని ఆకట్టుకుంది. తన నియామకంపై స్పందించిన సాయిరాజ్‌ బహుతులే, భారత జట్టు స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. జమ్మూకశ్మీర్‌ పేసర్‌ ఆకిబ్ నబీ భారత టెస్ట్ జట్టుకు ఎంపికలో ట్విస్ట్! లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ యజమానిపై లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ జంట

Andhra Jyothy02 Jun, 12:00 pm
ఐపీఎల్ లో అత్యంత అరుదైన ఘనత అందుకున్న ఆర్సీబీ ప్లేయర్లు

ఐపీఎల్‌ చరిత్రలో ఒక్కేఒక్కరు సాధించిన అరుదైన ఘనతను, తాజాగా ఆర్సీబీ ఆటగాళ్లు ఫిల్‌ సాల్ట్‌, సుయాశ్‌ శర్మ సాధించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్‌ 2026 ఛాంపియన్‌గా నిలవడంతో ఈ ఇద్దరూ హ్యాట్రిక్‌ ఐపీఎల్‌ టైటిళ్ల అరుదైన ఫీట్‌ను నమోదు చేశారు. స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచిన సంగతి తెలిసిందే. వరుసగా రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకోవడంతో ఆ జట్టు సభ్యులతో పాటు అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఆర్సీబీ జట్టు విజయం సాధించడంతో పాటు ఐపీఎల్ చరిత్రలో అత్యంత అరుదైన ఘనతను ఆ జట్టులోని ఇద్దరు సభ్యులు సాధించారు. అది కూడా ఐపీఎల్‌ చరిత్రలో ఒకే ఒక్కరికి దక్కిన రికార్డును ఈ ప్లేయర్లు సాధించారు. మరి.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్‌ 2026 ఛాంపియన్‌గా నిలవడంతో ఆ జట్టులోని ఆటగాళ్లు ఫిల్‌ సాల్ట్‌, సుయాశ్‌ శర్మ హ్యాట్రిక్‌ ఐపీఎల్‌ టైటిళ్లు గెలిచిన అరుదైన ఫీట్‌ను నమోదు చేశారు. టైటిళ్లు గెలిచిన సీజన్‌లలో ఆయా జట్లలో కనీసం ఒక మ్యాచ్‌ అయినా ఆడిన ఆటగాళ్లుగా వీరు ఉన్నారు. గతంలో కర్ణ్‌ శర్మ ఒక్కడే ఈ ఘనతను సాధించగా.. తాజాగా సాల్ట్‌, సుయాశ్‌ ఈ జాబితాలో చేరారు. కర్ణ్‌ శర్మ 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో, 2017లో ముంబై ఇండియన్స్‌తో, 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్లలో సభ్యుడిగా ఉండి ఐపీఎల్‌ టైటిళ్లు సాధించాడు. అలానే సాల్ట్‌, సుయాశ్‌ ఇద్దరూ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో, 2025, 2026లో ఆర్సీబీతో ఐపీఎల్‌ టైటిళ్లు సాధించి... ఈ చారిత్రక రికార్డును సొంతం చేసుకున్నారు. ఐపీఎల్ 2026 వేలంలో 11.50 కోట్లకు సాల్ట్‌ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో ఆరు మ్యాచులు ఆడిన సాల్ట్ 168.33 స్ట్రైక్ రేట్‌తో 202 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో 40 మ్యాచులు ఆడిన సాల్ట్ 12 హాఫ్ సెంచరీలతో సహా 1258 పరుగులు సాధించాడు. ఇక సుయాశ్ విషయానికి వస్తే.. అతడిని ఐపీఎల్ 2026 వేలంలో ఆర్సీబీ రూ.2.60 కోట్లకు దక్కించుకుంది. ఈ యువ లెగ్ స్పిన్నర్ ఐపీఎల్-19లో 12 మ్యాచులు ఆడి 9.21 ఎకానమీ రేటుతో 9 వికెట్లు సాధించాడు. మొత్తంగా 39 ఐపీఎల్ మ్యాచుల్లో 44.07 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు. చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్... ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ జంట

Andhra Jyothy02 Jun, 10:13 am
వెస్టిండీస్ జట్టుకు ఊహించని షాకిచ్చిన ఐర్లాండ్

స్పోర్ట్స్ డెస్క్: వెస్టిండీస్‌ మహిళల జట్టుకు ఐర్లాండ్ ఊహించ‌ని షాకిచ్చింది. ట్రై సిరీస్‌లో భాగంగా డ‌బ్లిన్ వేదిక‌గా జ‌రిగిన విండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఒక్క ప‌రుగు తేడాతో ఐర్లాండ్ విజ‌యం సాధించింది. మ‌హిళ‌ల టీ20ల్లో వెస్టిండీస్‌పై ఐర్లాండ్‌కు ఇదే తొలి విజ‌యం కావ‌డం విశేషం.

ఈ విజయంతో ఐర్లాండ్ ఫైనల్‌కు చేరుకునే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఐర్లాండ్ కెప్టెన్ ఓర్లా ప్రెండర్‌గాస్ట్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ అదరగొట్టి తన జట్టు గెలుపులో కీలక పాత్రపోషించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. కెప్టెన్‌ హేలీ మాథ్యూస్‌(1), టేలర్‌(9),డాటిన్‌(16) వంటి సీనియర్‌ ప్లేయర్లు విఫలమయ్యారు. 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న విండీస్ జట్టును షెమైన కాంప్‌బెల్ ఆదుకుంది. ఆఖరిలో గ్లాస్కో(36) కాస్త దూకుడుగా ఆడడంతో విండీస్‌‌కు కాస్త గౌరవప్రదమైన స్కోర్‌ దక్కింది.

అనంతరం 142 పరుగుల టార్గెట్ తో ఐర్లాండ్‌ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఐర్లాండ్ స్కోర్‌ 14.1 ఓవర్లలో 95/5 వద్ద ఉండగా ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. అయితే ఆ సమయానికి డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఐర్లాండ్‌ 3 పరుగులు వెనుకబడి ఉంది. అంపైర్లు మ్యాచ్‌ను ఆపేసే ముందు కనీసం ఒక్క బంతి అయినా వేయాలని ఐర్లాండ్‌ బ్యాటర్లు పట్టుబట్టారు. జాజారా క్లాక్స్టన్ వేసిన బంతి లూయిస్ లిటిల్ ఫోర్ కొట్టాడు. వర్షం తీవ్రత పెరగడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు.

అప్పటికి డీఎల్‌ఎస్‌ పద్ధతి ప్రకారం ఐర్లాండ్ 1 పరుగు ఆధిక్యంలో ఉండటంతో ఐర్లాండ్ జట్టును విజేతగా ప్రకటించారు. ఓర్లా ప్రెండర్‌గాస్ట్(46 బంతుల్లో 71 పరుగులు) అజేయంగా నిలిచింది. ఈ ట్రై సిరీస్ లో పాకిస్థాన్, ఐర్లాండ్, వెస్టిండీస్ మహిళల జట్టు పాల్గొన్నాయి. ఇప్పటికీ రెండు మ్యాచులు ఓడి.. పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ చివరి స్థానంలో ఉంది. ఐర్లాండ్, విండీస్ జట్లకు సమానంగా నాలుగు పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ ప్రకారం వెస్టిండీస్ టాప్ ప్లేసులో ఉంది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఈ మూడు జట్టులో మిగిలిన జట్లతో రెండేసి మ్యాచులు ఆడాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...

జట్టు ఓడిపోవడం కోహ్లీకి అస్సలు నచ్చదు: వెంకటేశ్ అయ్యర్

10TV Telugu02 Jun, 09:34 am
కోట్ల ప్రైజ్ మ నీని ఆర్ సీబీ ఆట గాళ్లు ఎలా పంచుకుంటారు? భువ నేశ్వ ర్ కుమార్

RCB : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు విజేత‌గా నిలిచింది. విజేత‌గా నిలిచినందుకు ప్రైజ్‌మ‌నీ కింద ఆర్‌సీబీకి 20 కోట్ల మొత్తం ల‌భించింది. ఈ మొత్తాన్ని ఆట‌గాళ్లు ఎలా పంచుకుంటారు అన్న విష‌యం పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఉంది. ఇక ఇదే విష‌యాన్ని మిస్ట‌ర్ నాగ్స్ ఆర్‌సీబీ ఆట‌గాడు భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ను అడిగాడు. 17 ఏళ్ల సీజ‌న్ల పాటు క‌ప్పు కోసం నిరీక్షించిన ఆర్‌సీబీ ఎట్ట‌కేల‌కు 18వ సీజ‌న్‌లో విజేత‌గా నిలిచింది. అదే ఉత్సాహంలో 19వ సీజ‌న్‌లోనూ క‌ప్పును ముద్దాడింది. ఈ క్ర‌మంలో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ముంబైఇండియ‌న్స్ తరువాత వ‌రుస‌గా రెండు సార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన జ‌ట్టుగా ఆర్‌సీబీ నిలిచింది. RCB bench players : ఛాంపియ‌న్ జ‌ట్టులో భాగ‌మై.. ఒక్క మ్యాచ్ ఆడ‌ని ఆర్‌సీబీ ఆట‌గాళ్లు.. వేలంలో కోట్ల వ‌ర్షం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఫైన‌ల్ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌ను ఓడించిన త‌రువాత మైదానంలో ఆర్‌సీబీ ఆట‌గాళ్ల సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. ఈ స‌మ‌యంలోనే ఆర్‌సీబీ డిజిట‌ల్ హోస్ట్ మిస్ట‌ర్ నాగ్స్ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప‌లువురు ఆట‌గాళ్లను ఇంట‌ర్వ్యూలు చేశాడు. Tim David : ఆర్‌సీబీకి బిగ్ షాక్‌.. స్టార్ ఆట‌గాడిపై స‌స్పెప్ష‌న్.. వ‌చ్చే ఏడాది తొలి మ్యాచ్‌కు దూరం.. ఇక భువ‌నేశ్వ‌ర్ కుమార్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే స‌రికి మాత్రం 20 కోట్ల ప్రైజ్‌మ‌నీని ఆట‌గాళ్లు ఎలా పంచుకుంటార‌ని మిస్ట‌ర్ నాగ్స్ అడిగాడు. ఇందుకు భువీ ఎంతో తెలివిగా స‌మాధానం ఇచ్చాడు. న‌గదును ఎలా పంచుకుంటారు అనే విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని, దాని గురించి తెలుసుకోవ‌డానికి త‌న‌కు ఎంతో ఆస‌క్తిగా ఉంద‌ని స‌మాధానం ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఎలాంటి వివాదాంలో ఇరుక్కోకుండా భువీ చాలా చ‌క్క‌గా చెప్పాడ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Andhra Jyothy02 Jun, 09:32 am
చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్

స్పోర్ట్స్ డెస్క్:  ఐపీఎల్ 2026 టైటిల్ గెలిచిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, వారి అభిమానుల సంబరాలు ఏమాత్రం తగ్గడం లేదు. 17 ఏళ్ల తర్వాత గతేడాది తొలిసారి ఐపీఎల్ కప్పు సాధించడం, అదే ఊపుతూ వరుసగా రెండో సారి కూడా ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీతో సహా మిగిలిన సభ్యులందరూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కింగ్ కోహ్లీ అయితే ట్రోఫీ అందుకునే సమయంలో చేసిన సందడి అంతాఇంతా కాదు. తాను సీనియర్ ప్లేయర్‌ను అనే సంగతి మర్చి మరీ.. చిన్న పిల్లాడిలా మారిపోయాడు. తనలో ఎవ్వరూ డ్యాన్స్ ఆవహించిన ట్లుగా విరాట్ అదరగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియోను కూడా పంచుకున్నాడు. అందులో తన సహచరుడు భువనేశ్వర్ కుమార్‌తో కలిసి విరాట్ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు . జట్టు విజయోత్సవ వేడుకలో తీసిన ఈ క్లిప్‌లో ఆ ఇద్దరూ ఫ్లోర్‌పై 'కిక్లి' స్టెప్ వేస్తూ కనిపించారు. కిక్లి అనేది పంజాబ్‌కు చెందిన ఓ జానపద నృత్యం. ఈ డ్యాన్స్‌ను భువీ, విరాట్ వేస్తూ.. సహచరులను ఎంటర్ టైన్ చేశారు. దీని చూసిన అభిమానులు సైతం తెగ సంబరపడుతున్నారు.

క్రికెట్ దిగ్గజమైన కోహ్లీ.. ఇలా చిన్న పిల్లాడిలా మారి.. సంబరాల్లో మునిగి తేలడం.. అతడి అభిమానులతో పాటు క్రికెట్ ప్రియులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఇలా కోహ్లీ డ్యాన్స్ చేయడం ఇది మొదటిసారి కాదు. రెండు రోజుల క్రితం తన భార్య అనుష్క శర్మతో కలిసి కూడా విరాట్ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. మరోవైపు ఆర్సీబీ రెండవ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో కోహ్లీ చేసిన అజేయ 75 పరుగులు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో అతడు అద్భుత ప్రదర్శన చేయడం, తన జట్టు ఏకంగా ట్రోఫీని ముద్దాడటం పట్ల విరాట్ ఎంతో సంతోషంగా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి:

టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ రియాక్షన్ ఇదే!

జట్టు ఓడిపోవడం కోహ్లీకి అస్సలు నచ్చదు: వెంకటేశ్ అయ్యర్

10TV Telugu02 Jun, 08:59 am
ఛాంపియ న్ జ ట్టులో భాగ మై.. ఒక్క మ్యాచ్ ఆడ ని ఆర్ సీబీ ఆట గాళ్లు..

RCB bench players : ఐపీఎల్ 2026 సీజ‌న్ విజేత‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నిలిచింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌ను ఓడించి వ‌రుస‌గా రెండో సారి ట్రోఫీని ముద్దాడింది. విరాట్ కోహ్లీ, దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్, ర‌జ‌త్ పాటిదార్‌, వెంక‌టేశ్ అయ్య‌ర్, భువ‌నేశ్వ‌ర్ కుమార్, జోష్ హేజిల్ వుడ్ వంటి ఆట‌గాళ్లు జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. మెగా వేలంలో ఆర్‌సీబీ మొత్తం 24 మంది ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. వీరిలో 15 మంది క‌నీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడారు. మిగిలిన 9 మంది ఆట‌గాళ్ల‌కు ఈ ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఒక్క‌టంటే ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవ‌కాశం రాలేదు. అయిన‌ప్ప‌టికి కూడా వీళ్ల‌కు పూర్తి సీజ‌న్ ఫీజు అంటే మెగా వేలంలో ఎవ‌రిని ఎంత మొత్తానికి కొనుగోలు చేశారో అంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు ముందు ఈ ఎడ‌మ‌చేతి వాటం పేస‌ర్‌ను ఆర్‌సీబీ 5 కోట్ల‌కు రిటైన్ చేసుకుంది. అయితే.. ఈ సీజ‌న్‌కు ముందు అత‌డు వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో త‌ప్పుకున్నాడు. అయిన‌ప్ప‌టికి కూడా ఆర్‌సీబీ అత‌డిని విడుద‌ల చేయ‌లేదు. మ‌రో ఆట‌గాడిని తీసుకులేదు. దీంతో అత‌డు ఆర్‌సీబీలో భాగంగానే ఉన్న‌ట్లు. *IPLలో 5 టీమ్స్ లో ఆడిన ప్లేయర్.. టీమిండియాకు ప్రాతినిధ్యం.. ఇప్పుడు ఏకంగా మంత్రి.. మంగేష్ యాద‌వ్.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన ఎడ‌మ‌చేతి వాటం పేస‌ర్ మంగేష్ యాద‌వ్ ను ఆర్‌సీబీ వేలంలో 5.20 కోట్ల‌కు కొనుగోలు చేసింది. అయితే.. భువ‌నేశ్వ‌ర్ కుమార్, రసిఖ్ సలాం దార్ వంటి పేస‌ర్లు అద్భుతంగా రాణిస్తుండ‌డం, కూర్పులో భాగంగా మంగేష్ యాద‌వ్ కు ఒక్క మ్యాచ్‌లో ఆడే అవ‌కాశం రాలేదు. నువాన్ తుషారా.. శ్రీలంక పేస‌ర్ నువాన్ తుషారాను ఆర్‌సీబీ 1.60 కోట్ల‌కు రిటైన్ చేసుకుంది. ఫిట్‌నెస్ స‌మ్య‌స‌లు, జ‌ట్టు కూర్పు కార‌ణంగా అత‌డు తుది జ‌ట్టులో చోటు ద‌క్కించుకోలేక‌పోయాడు. ప్లేఆఫ్స్‌కు ముందు అత‌డి స్థానంలో ఇంగ్లాండ్ పేస‌ర్ రిచ‌ర్డ్ గ్లీస‌న్‌ను ఆర్‌సీబీ తీసుకుంది. జోర్డాన్ కాక్స్‌.. ఇంగ్లాండ్‌కు చెందిన వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ అయిన జోర్డాన్ కాక్స్‌ను ఆర్‌సీబీ వేలంలో 75లక్ష‌ల‌కు కొనుగోలు చేసింది. అత‌డు బ్యాక‌ప్ వికెట్ కీప‌ర్‌గా ఉన్నారు. టీమ్ఇండియా ఆట‌గాడు జితేశ్ శ‌ర్మ ప్ర‌తి మ్యాచ్ తుది జ‌ట్టులో ఉండ‌డంతో జోర్డాన్‌కు ఒక్క మ్యాచ్ ఆడే అవ‌కాశం రాలేదు. స్వ‌ప్నిల్ సింగ్‌.. స్పిన్న‌ర్ స్వ‌ప్నిల్ సింగ్‌ను ఆర్‌సీబీ 50ల‌క్ష‌ల‌కు అట్టిపెట్టుకుంది. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మలు ఉండ‌డంతో స్విప్నిల్‌కు తుది జ‌ట్టులో ఆడే ఛాన్స్ రాలేదు. విక్కీ ఓస్త్వాల్‌.. అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్‌లో అద‌ర‌గొట్టిన భార‌త స్పిన్ ఆల్‌రౌండ‌ర్ విక్కీ ఓస్త్వాల్ ను 30 ల‌క్ష‌ల‌కు ద‌క్కించుకుంది. విరాట్ కోహ్లీ, ప‌డిక్క‌ల్‌, జితేశ్, వెంక‌టేశ్ అయ్య‌ర్ వంటి స్టార్ ఆట‌గాళ్లు ఉండ‌డంతో ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవ‌కాశం రాలేదు. *Tim David : ఆర్‌సీబీకి బిగ్ షాక్‌.. స్టార్ ఆట‌గాడిపై స‌స్పెప్ష‌న్.. వ‌చ్చే ఏడాది తొలి మ్యాచ్‌కు దూరం.. స‌త్విక్ దేశ్వాల్‌.. దేశవాళీలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన లెగ్ స్పిన్న‌ర్ స‌త్విక్ దేశ్వాల్‌ను 30 లక్ష‌ల‌కు కొనుగోలు చేసింది. కూర్పు కార‌ణంగా అత‌డికి తుది జ‌ట్టులో చోటు రాలేదు. విహాన్ మ‌ల్హోత్రా.. భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టుకు చెందిన విహాన్ మ‌ల్హోత్రాను 30ల‌క్ష‌ల‌కు ద‌క్కించుకుంది. అయితే.. ఆల్‌రౌండర్‌కు ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసే అవ‌కాశం రాలేదు. క‌విష్క్ చౌహాన్‌.. యువ ఆల్‌రౌండ‌ర్ క‌నిష్క్ చౌహాన్‌ను 30ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది. అయితే.. ఇత‌డికి ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవ‌కాశం రాలేదు.

Andhra Jyothy02 Jun, 04:54 am
పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం ధరలు

ఇంటర్‌నెట్ డెస్క్: పసిడి ప్రియులకు ఊరట కలిగించే విధంగా గత కొద్దిరోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న (సోమవారం) 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంపై 820 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 750 రూపాయలు.. 18 క్యారెట్లపై 610 పది రూపాయలు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,56,220 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం 1,43,200 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం 1,17,170 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.

ఈ రోజు (మంగళవారం) బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,56,220 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,43,200 రూపాయల వద్ద.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,17,170 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

వెండి ధరలు ఇలా..

ఈ రోజు (మంగళవారం) వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ మార్కెట్‌లో 100 గ్రాముల వెండి 29 వేల రూపాయల వద్ద.. కేజీ వెండి 2,90,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఇవి కూడా చదవండి

సిటీ బస్సులపై ఓవర్‌లోడ్‌

టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ రియాక్షన్ ఇదే!