
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన సాయిరాజ్ బహుతులేకు భారత క్రికెట్ జట్టులో కీలక పదవి దక్కింది. ఈ మాజీ లెగ్ స్పిన్నర్‌ను టీమిండియా ప్రత్యేక స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2026)లో పంజాబ్ కింగ్స్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన సాయిరాజ్ బహుతులేకు భారత క్రికెట్ జట్టులో కీలక పదవి దక్కింది. ఈ మాజీ లెగ్ స్పిన్నర్‌ను టీమిండియా ప్రత్యేక స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఇవాళ (మంగళవారం) అధికారికంగా ప్రకటించింది. అంతర్జాతీయ , దేశీయ క్రికెట్‌లో దిగ్గజ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన బహుతులేకు ఆటగాడిగా, కోచ్‌గా విశేష అనుభవం ఉంది. ముఖ్యంగా యువ స్పిన్నర్లను తీర్చిదిద్దడంలో, వారి ప్రతిభను మెరుగుపరచడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఆయనకు ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. బహుతులే టీమిండియా తరఫున 2 టెస్టులు, 8 వన్డేలు ఆడాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 6,176 పరుగులు చేశాడు. అంతేకాక 630 వికెట్లు సాధించి దేశీయ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఆల్‌రౌండర్లలో ఒకరిగా నిలిచాడు. అలానే కోచ్‌గా కూడా బహుతులే అనేక విజయాలు సాధించాడు. విదర్భ, కేరళ, గుజరాత్, బెంగాల్ దేశవాళీ జట్లకు ప్రధాన కోచ్‌గా సేవలందించాడు. అలాగే ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్‌కు సుదీర్ఘంగా కాలం స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. అతడు ఐసీసీ అండర్19 ప్రపంచకప్ 2022 గెలిచిన భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. అండర్ 19 ప్రపంచకప్2024లో కూడా కోచింగ్ సిబ్బందిలో సభ్యుడిగా ఉన్నాడు. అదనంగా ఇండియా-ఏ, సీనియర్ జట్లతో పలు పర్యాయాలు ప్రత్యేక బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. యువ ఆటగాళ్ల అభివృద్ధిలో ఆయన చేసిన కృషి బీసీసీఐని ఆకట్టుకుంది. తన నియామకంపై స్పందించిన సాయిరాజ్ బహుతులే, భారత జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ భారత టెస్ట్ జట్టుకు ఎంపికలో ట్విస్ట్! లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ యజమానిపై లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ జంట