translateexpand_more

Red Weather Alert Issued As Heavy Rains Hit Multiple Districts In Andhra Pradesh Gusty Winds 60 Kmph News

Latest updates from Telugu Digital news sources.

Oneindia Telugu03 Jun, 03:03 am
ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఏపీలో అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టింది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీలకుపైగా నమోదవుతూ వచ్చిన ఉష్ణోగ్రత ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. వడగాలుల తీవ్రత కూడా గణనీయంగా తగ్గుతూ వస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో చల్లగాలులు పలకరిస్తోన్నాయి.కొద్దిరోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు, ఓ మోస్తరు పడుతున్నాయి. ఈదురుగాలులు వీస్తోన్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. అక్కడక్కడ ఈదురుగాలులు సైతం బీభత్సాన్ని సృష్టించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడ్డాయి.ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకూ ఇదే పరిస్థితి కనిపించింది. అక్కడక్కడ తేలికపాటి జల్లులు, ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పిడుగులతో కూడిన భారీ వర్షాలు పలకరించాయి. ఇదే పరిస్థితి.. నేడు కూడా కొనసాగనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గి ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వాతావరణం కొంత చల్లగా మారుతుందని, ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.నేడు ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులు పడతాయని హెచ్చరించింది. బలమైన ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గాలుల తీవ్రత గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వరకు ఉండొచ్చని, అంచనా వేసింది.ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ సైతం జారీ చేసింది విపత్తు నిర్వహణ సంస్థ. పిడుగులు పడుతున్నప్పుడు, ఈదురుగాలులు వీచే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. చెట్లు, హోర్డింగుల కింద నిల్చోవద్దని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని, పిడుగులు పడే సమయంలో రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కింద ఉండరాదని అన్నారు.