translateexpand_more

Regrow Hair Naturally In 3 Weeks News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu03 Jun, 05:18 am
జుట్టు వేగంగా పెరిగేలా చేసే అమ్మమ్మ కాలం చిట్కాలు

బియ్యం కడిగిన నీళ్లలో అమైనో యాసిడ్స్, స్టార్చ్, విటమిన్లు ఉంటాయి. ఇవి జుట్టు వేగంగా, నల్లగా పెరిగేందుకు సహాయపడతాయి. దీనికోసం తలను ఈ బియ్యం నీళ్లతో కడిగితే సరిపోతుంది. కొబ్బరి నూనెలో కొన్ని కరివేపాకులు వేసి మరిగించి గోరువెచ్చగా అయ్యాక తలకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఉంటుంది. ఇది కుదుళ్లకు కావాల్సిన పోషణ అందించి జుట్టు ఒత్తుగా ఉండేందుకు సహాయపడుతుంది. దీనికోసం తాజా ఉల్లిపాయ రసం జుట్టుకు రాసి కాసేపయ్యాక తలస్నానం చేస్తే మంచిది. ఉసిరిలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు తొందరగా తెల్లబడకుండా కాపాడుతాయి. జుట్టును ఒత్తుగా మారుస్తాయి. దీనికోసం ఉసిరి పొడిలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి తలకు రాసుకోండి. గంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. చర్మంతో పాటు జుట్టు పెరుగుదలకు అలోవెరా చాలా బాగా సహాయపడుతుంది. దీనికోసం తాజా అలోవెరా జెల్‌ను తలకు రాసుకుని గంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. ఉల్లిపాయతో పాటు వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. దీనికోసం కొబ్బరి నూనెలో క్రష్ చేసిన వెల్లుల్లి, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మరిగించండి. తర్వాత దీనిని తలకు అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది తలకు బాగా మసాజ్ చేయడం వల్ల కుదుళ్లకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో జుట్టుకు కావాల్సిన పోషణ బాగా అందుతుంది. తద్వారా జుట్టు ఒత్తుగా, వేగంగా పెరుగుతుంది. అందుకే వారానికి రెండుసార్లు తలకు మర్దన చేయడం మంచిది. ఈమధ్య కాలంలో చాలామంది పోనీ టెయిల్, బన్స్ వంటి టైట్ హెయిర్ స్టైల్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ వీటి వల్ల జుట్టు తొందరగా డ్యామేజ్ అవుతుంది. అందుకే లూజ్ హెయిర్ స్టైల్స్ ఫాలో అవడం మంచిది. జుట్టుకు కావాల్సిన పోషకాలు మీ ఆహారం ద్వారా తీసుకోవడం చాలా అవసరం. అందుకే కోడిగుడ్లు, పప్పులు, చేపలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, బెల్లం, పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.