తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడతలో భాగంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇళ్ల గృహ ప్రవేశం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. కోఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగానే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్‌ను ఆవిష్కరించారు. రెండో విడతలో రాష్ట్రంలో మరో రెండున్నర లక్షల మందికి ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగాలని సూచించారు. అటు లబ్ధిదారులకు, ఇటు అధికారులకు కూడా ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. ఇళ్ల నిర్మాణం శరవేగంగా పూర్తి చేసుకునేందుకు కొత్త టెక్నాలజీని తీసుకువస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ టెక్నాలజీతో కేవలం నెల రోజుల్లోనే ఇల్లు నిర్మాణం పూర్తి అవుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తండాలు, గూడెంలలో నివసించే అర్హులైన ఆదివాసీల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వంద శాతం ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గుడిసెలు లేని ఆదిలాబాద్ జిల్లాను తాను చూడాలనుకుంటున్నానని తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన రాష్ట్రంలో మరో లక్ష ఇందిరమ్మ ఇళ్లకు గృహ ప్రవేశాలు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఖర్చు చేసిన రూ.
Revanth Reddy Indiramma Illu Gruha Pravesham News
Latest updates from Telugu Digital news sources.
Samayam Telugu01 Jun, 04:35 pm
నెలరోజుల్లోనే ఇల్లు నిర్మాణం.. సరికొత్త టెక్నాలజీ.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు