translateexpand_more

Saunf News

Latest updates from Telugu Digital news sources.

Eenadu29 May, 02:56 pm
సోంపు కల్తీ అయిందా? కనిపెట్టాలంటే

మేడిపండు మాదిరిగా చూడ్డానికి ఆకర్షణీయంగానే కనిపించినా.. మార్కెట్లో చాలా పదార్థాలు కల్తీ అవుతున్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటిలో సోంపు కూడా చేరిపోయిందంటోంది ‘గుజరాత్‌ ఆహార భద్రతా విభాగం’. ఇటీవలే అక్కడ జరిపిన ఆహార భద్రతా తనిఖీల్లో సోంపు కల్తీ అయినట్లుగా అధికారులు గుర్తించారు. మేడిపండు మాదిరిగా చూడ్డానికి ఆకర్షణీయంగానే కనిపించినా.. మార్కెట్లో చాలా పదార్థాలు కల్తీ అవుతున్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటిలో సోంపు కూడా చేరిపోయిందంటోంది ‘గుజరాత్‌ ఆహార భద్రతా విభాగం’. ఇటీవలే అక్కడ జరిపిన ఆహార భద్రతా తనిఖీల్లో సోంపు కల్తీ అయినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే అందులో కల్తీ ఎంత మేర ఉందో తెలుసుకోవడానికి దాని నమూనాల్ని పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారట! ఇలా సోంపు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ఆహార పదార్థాల భద్రతపై మరోసారి ఆందోళనల్ని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో మనం కొనే సోంపు అసలైందా? కల్తీనా? కనిపెట్టాలంటే ఈ సింపుల్‌ చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. సోంపును కొందరు మౌత్‌ ఫ్రెష్‌నర్‌గా వాడితే.. మరికొందరు వంటకాలు, స్వీట్ల తయారీలో ఉపయోగిస్తుంటారు. వంటలకు అమోఘమైన రుచిని అందించే ఈ పదార్థం ఎన్నో పోషకాల మిళితం అంటున్నారు నిపుణులు. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌ నిండి ఉండే సోంపు.. జీర్ణ శక్తిని పెంచడంలో, నోటి దుర్వాసనను దూరం చేయడంలో, బరువు అదుపులో ఉంచుకోవడానికి, గుండె ఆరోగ్యానికి, నెలసరి సమస్యల్ని దూరం చేసుకోవడానికి.. ఇలా దీంతో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు. అయితే ఈ రోజుల్లో చాలావరకు ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నట్లే.. సోంపు కూడా వివిధ రకాలుగా కల్తీ అవుతోందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపించాలని కృత్రిమ రంగులు, రసాయనాలు కలపడం; సోంపును పోలిన గడ్డి గింజల్ని ఇందులో కలిపి విక్రయించడం..

Saunf News Keyword | Telugu Digital