translateexpand_more

Singareni News

Latest updates from Telugu Digital news sources.

Namasthe Telangana30 May, 02:08 pm
రామవరం డిస్పెన్సరీ మూసివేత కుట్రను యాజమాన్యం విరమించుకోవాలి

– సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కేంద్ర కమిటీ ప్రచార కార్యదర్శి వంగా వెంకట్ రుద్రంపూర్, మే 30 : రామవరం సింగరేణి డిస్పెన్సరీ మూసివేత కుట్రను యాజమాన్యం తక్షణమే విరమించుకోవాలని, ఆస్పత్రిని పునరుద్దరించాలని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రచార కార్యదర్శి వంగా వెంకట్ డిమాండ్ చేశారు. శనివారం అయన మీడియాతో మాట్లాడుతూ.. రామవరం ప్రాంతంలో నివసిస్తున్న వందలాది మంది సింగరేణి కార్మికులు, మాజీ కార్మికులు, వారి కుటుంబాలతో పాటు కాంట్రాక్టు కార్మికులకు ఈ వైద్యశాల ఎంతో కాలంగా వైద్య సేవలు అందిస్తోందని, ఈ ఆస్పత్రిలో కొత్త వైద్యుల నియామకం చేపట్టకుండా, కేవలం ఇద్దరు స్టాఫ్‌తో మందులు ఇచ్చేలా యాజమాన్యం కుట్రపూరితంగా మార్చిందని మండిపడ్డారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగి పదవీ విరమణ పొందడంతో, కొత్తవారిని నియమించకుండా ఆస్పత్రిని ఏకంగా సీల్ చేయడం సరైంది కాదన్నారు. ఈ ఆస్పత్రిని మూసివేయడం వల్ల స్థానిక కార్మిక కుటుంబాలు చిన్నపాటి వైద్య సేవలకు సైతం సుదూర ప్రాంతంలోని ప్రధాన వైద్యశాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వారికి ఆర్థికంగా, శారీరకంగా తీవ్ర భారంగా మారుతుందని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం మొండివైఖరి వీడి తక్షణమే ఇక్కడ వైద్యులను, సిబ్బందిని నియమించి ఆస్పత్రిని యధావిధిగా కొనసాగించాలని, లేనిపక్షంలో కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.

Vaartha29 May, 05:33 pm
సింగరేణి ఉద్యోగుల సమస్యలపై చర్చ

Singareni Employees: మందమర్రి, మే 29, ప్రభాతవార్త: మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అధ్యక్షతన గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి యూనియన్‌తో 18వ స్ట్రక్చర్ సమావేశం శుక్రవారం మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఘనంగా నిర్వహించబడింది. Read Also: Retired Employees: రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం వేదికగా నిలిచింది. గుర్తింపు కార్మిక సంఘం నాయకులు మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, రామకృష్ణపూర్ బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీతో పాటు ఇతర ఏఐటియుసి నాయకులు పాల్గొని ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలను జీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ సింగరేణి సంస్థ అభివృద్ధిలో కార్మిక సంఘాల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం రెండూ పరస్పర ఆధారితమైనవని పేర్కొన్నారు.ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుతో పాటు ఉద్యోగుల భద్రత, సంక్షేమం, సౌకర్యాల పెంపుపై సంస్థ ప్రత్యేక దృష్టి సారిస్తోందని స్పష్టం చేశారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమగ్ర సమీక్ష నిర్వహించి వాటి పురోగతిని అధికారులు వివరించారు. ఇంకా పరిష్కారం కాని సమస్యలపై చర్చించి వాటిని వేగవంతంగా పరిష్కరించేందుకు సంబంధిత విభాగాధిపతులకు జీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో పని పరిస్థితులు, భద్రతా చర్యలు, మౌలిక వసతులు, వైద్య సదుపాయాలు, ఉద్యోగుల సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.ఈ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని జీఎం అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను

Namasthe Telangana25 May, 01:55 pm
– కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు – కొత్తగూడెం ఏరియాలో ముగిసిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ రుద్రంపూర్, మే 25 :...

– కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు – కొత్తగూడెం ఏరియాలో ముగిసిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ రుద్రంపూర్, మే 25 : చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, అవి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కొ...

Namasthe Telangana30 May, 10:35 am
ఎస్ వో టు జీఎం జి.వి.కోటిరెడ్డి పదవీ విరమణ.. ఎస్ అండ్ పీసీ ఆధ్వర్యంలో ఘ న స

రుద్రంపూర్, మే 30 : జి.వి.కోటిరెడ్డి తన‌ ఉద్యోగ జీవితంలో అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచార‌ని, సంస్థ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవని కొత్తగూడెం ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష్ అన్నారు. శనివారం కొత్తగూడెం ఏరియాలో ఎస్‌వో టు జీఎంగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన జి.వి.కోటిరెడ్డిని ఎస్ అండ్ పీసీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమే, కానీ ఆయన సంపాదించిన గౌరవం, అనుభవం, సత్సంబంధాలకు ముగింపు కాదన్నారు. భవిష్యత్‌లో ఆరోగ్యం, ఆనందం, కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలతో సుఖసంతోషాలతో కూడిన జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. ఆయన సేవలు త‌మ‌కు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయ‌న్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి, జె.రాంబాబు, జూనియర్ ఇన్‌స్పెక్టర్ కామరాజ్, షిఫ్ట్ జమేదార్ కమల్ సింగ్, సీనియర్ సెక్యూరిటీ గార్డులు హానోక్ రాజు, త్రిపాఠి, మల్లికార్జున్, సురేశ్‌, పి.విజయ్‌తో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్‌వైజ‌ర్లు నూకరాజు, దినేష్ యాదవ్, కామేశ్‌, మురళి, చంటి పాల్గొన్నారు.

Namasthe Telangana30 May, 02:14 pm
జి.వి.కోటిరెడ్డి సేవలు ఆదర్శనీయం

రుద్రంపూర్, మే 30 : సింగరేణి కొత్తగూడెం ఏరియా ఎస్‌ఓ టు జనరల్ మేనేజర్ జి.వి. కోటిరెడ్డి సింగ‌రేణి సంస్థకు అందించిన సేవలు ఆదర్శప్రాయమని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. శనివారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్న కోటిరెడ్డి పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వట్టికొండ మల్లికార్జున్ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ముందు నుండి మేళ‌తాళాలతో పూలు చల్లుతూ ఆయన చాంబర్ వరకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో శాలెం రాజు మాట్లాడారు. 1983లో సింగరేణి సేవలో చేరిన జి.వి. కోటిరెడ్డి 42 సంవత్సరాలకు పైగా వివిధ హోదాల్లో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు. గనుల ఉత్పత్తి, భద్రత, పరిపాలన, శిక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక రంగాల్లో తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. ఎల్లెందు, శ్రీరాంపూర్, గోదావరిఖని, మణుగూరు, కొత్తగూడెం ప్రాంతాల్లో వివిధ బాధ్యతలు నిర్వహించిన ఆయన ఎక్కడ పనిచేసినా సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శించారని తెలిపారు. ముఖ్యంగా కొత్తగూడెం ఏరియా మైనింగ్ ట్రైనింగ్ సెంటర్ మేనేజర్‌గా, ఏరియా సేఫ్టీ ఆఫీసర్‌గా, అనంతరం ఎస్‌ఓ టు జనరల్ మేనేజర్‌గా సంస్థకు విశిష్ట సేవలందించారని కొనియాడారు. భద్రతా ప్రమాణాల పెంపు, ఉత్పత్తి లక్ష్యాల సాధన, శాఖల మధ్య సమన్వయం, సిఎస్‌ఆర్ కార్యక్రమాల అమలు, ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో కోటిరెడ్డి చూపిన చొరవ ప్రశంసనీయమని అన్నారు. ఆయన నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావం యువ ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షించిన

Namasthe Telangana28 May, 12:50 pm
స్థానికులకే ఉద్యోగాలివ్వాలి.. ఛలో కొత్తగూడెంను జయప్రదం చేయండి

– ఎల్‌హెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ డిమాండ్ – జూన్ 2న సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట మహా ధర్నా జూలూరుపాడు, మే 28 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. ఈ జిల్లాలో ఉన్న సింగరేణి సంస్థలో నిబంధనల ప్రకారం గిరిజనులకు 100 శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని, స్థానికులకే ఉపాధి అవకాశాలు దక్కేలా చూడాలని లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్టీ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్ రాజేష్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో గురువారం నిర్వహించిన ముందస్తు సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. గిరిజన ప్రాంతాల హక్కుల పరిరక్షణ కోసం జూన్ 2న నిర్వహించ తలపెట్టిన ‘ఛలో కొత్తగూడెం’ మహా ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట జరిగే ఈ నిరసన కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు, గిరిజన యువత పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. జిల్లాలో సింగరేణి అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ మైన్స్ వస్తే తమ నిరుద్యోగ సమస్యలు తీరుతాయని, స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశించిన గిరిజన యువతకు తీవ్ర నిరాశే ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక చట్టాలను తుంగలో తొక్కి, కాంట్రాక్టర్లు ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను తీసుకువచ్చి నియమించుకుంటున్నారని మండిపడ్డారు. దీనివల్ల స్థానిక గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని, తక్షణమే ఇతర రాష్ట్రాల కార్మికులను తొలగించి స్థానికులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో 1997 సమతా జడ్జిమెంట్, 1996 పెసా యాక్ట్ ప్రకారం గిరిజనులకు ఉద్యోగాలలో, కాంట్రాక్ట్ పనులలో 100 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత