translateexpand_more

Singitam Srinivasa Rao News

Latest updates from Telugu Digital news sources.

Telugu Times01 Jun, 02:04 pm
సింగ్ గీతం'లో స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ చేశాను. ఇలాంటి జానర్ లో ఇప్పటివరకు సినిమా రాలేదు

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ ‘సింగ్ గీతం’ తో ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన ‘సింగ్ గీతం’ టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఈ సందర్భంగా హీరోయిన్ శాలిని కొండెపుడి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. సింగ్ గీతం జర్నీ ఎలా మొదలైయింది? -ఇంతకుముందు నేను జయమ్మ పంచాయితీ, శుభం, మై డియర్ దొంగ చిత్రాలు చేశాను. తెలిసిన వారి ద్వారా ఈ సినిమాలో ఒక నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఉందని తెలిసింది. సింగీతం గారి సినిమా అంటే ఎలాంటి పాత్ర అయినా చేయాలని నిర్ణయించుకున్నాను. ఆడిషన్‌కి వెళ్లాను. ఆడిషన్ ఇచ్చిన నెల రోజుల తర్వాత ఓకే అయ్యింది. -ఇలాంటి జానర్‌లో ఇప్పటివరకు సినిమా రాలేదు. ఈ సినిమాలో ప్రతిది మ్యూజికల్ గా వుంటుంది. ప్రతి ఆర్టిస్ట్‌కి కొంచెం శృతిలో పాడటం రావాలి. ఇందుకోసం చాలా వర్క్‌షాప్స్ చేశాం. ఈ కథ ఎలా ఉండబోతుంది? సంగీతం గారి దర్శకత్వంలో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? -ఈ కథ ఆలోచన సింగీతం గారికి చాలా ఏళ్ల క్రితమే వచ్చింది. అయితే ఈ రోజుకీ ఎంతో రిలెవెంట్‌గా అనిపించే కథ ఇది. ఇందులో ప్రతి మాట మ్యూజికల్‌గా ఉంటుంది. సంభాషణలు కూడా పాటల్లా సాగుతాయి. -ఇటీవల విడుదలైన పాట ద్వారా ప్రేక్షకులకు సినిమా టోన్‌పై కొంత క్లారిటీ