
Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..
Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..
© 2026 telugu.digital

Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..
నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఇందులోని ‘ఏష నాగుల’ పాట సరికొత్త రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ తెలంగాణ ఫోక్ రీమిక్స్.. కేవలం 17 రోజుల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న తొలి తెలుగు పాటగా ఆల్‌టైమ్ రికార్డ్ నెలకొల్పింది.

Folk Song : ఈపాట డీజేలో వింటే ఉంటది రా చారి.. యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..

వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. వీటిలో మరీ అంతగా అనే పాట ఒకటి. శ్రీరామచంద్ర ఆలపించిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా, మిక్కీ జే. మేయర్ సంగీతం సమకూర్చారు. ఈ పాట కేవలం వినడానికి ఆహ్లాదంగా ఉండడమే కాకుండా. జీవితంపై మన ఆలోచనా విధానాన్ని మార్చేంత గొప్ప సందేశం ఇందులో ఉంది. కష్టం వచ్చిన ప్రతిసారీ కుంగిపోవడం కంటే దాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలని చెబుతుంది. అందుకే ఈ పాటను ఒక్కసారి శ్రద్ధగా వింటే చాలు.. మనసులోని భారాన్ని కొంతైనా దించుకున్న అనుభూతి కలుగుతుంది. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మొదట మనసులో కలిగేది బాధ. ఆ బాధ క్రమంగా ఆందోళనగా మారుతుంది. ఆ తర్వాత అదే సమస్య గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మనల్ని మనమే మరింత బాధ పెట్టుకుంటాం. కానీ సమస్య గురించి ఆలోచిస్తూ ఏడవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. జరిగింది జరిగిపోయింది. దాన్ని మార్చలేం. అయితే దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇక ముందు అదే పరిస్థితి రాకుండా ఏం చేయాలి? అనే దానిపై దృష్టి పెట్టగలం. ఈ పాట మొదటి నుంచే ఇదే విషయాన్ని గుర్తుచేస్తుంది. బాధను అతిగా పెంచుకోవద్దని, మనసును అనవసరంగా కలవరపెట్టుకోవద్దని చెబుతుంది. కష్టం మన జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే.. అదే మన జీవితమంతా కాదు. ఈ ఒక్క ఆలోచన మనలో బలాన్ని నింపుతుంది. మనకు ఎదురైన సమస్యను చూసి భయపడటం సహజం. కానీ ఆ భయంతోనే ఆగిపోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగం పోయిందనుకోండి. మొదట బాధ కలుగుతుంది. భవిష్యత్తు గురించి భయం ఉంటుంది. కానీ అదే విషయాన్ని రోజంతా ఆలోచిస్తూ కూర్చుంటే కొత్త ఉద్యోగం రాదు. దాని బదులు కొత్త అవకాశాలను వెతకడం ప్రారంభిస్తే పరిస్థితి మారే అవకాశం ఉంటుంది. అలాగే

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Pawan Kalyan Flop Movies List: ఉస్తాద్ భగత్ సింగ్:‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా అందరి అంచనాలను తలకిందలు చేస్తూ డిజాస్టర్‌గా నిలిచింది. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో అత్యధిక రోజులు షూటింగ్ జరుపుకున్న చిత్రంగా రికార్డులకు ఎక్కింది. గతేడాది రిలీజైన ఈ పవన్ కళ్యాణ్ కెరీర్ లో డిజాస్టర్‌గా నిలిచింది. ఖుషీ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ మెగాఫోన్ పట్టుకొని తెరకెక్కించిన చిత్రం‘జానీ’. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా..అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అజ్ఞాతవాసి.. త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ‘అజ్ఞాతవాసి’. వీళ్ల కలయికలో వచ్చిన మూడో సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో అన్న నాగబాబు నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘గుడుంబా శంకర్’. వీర శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. తొలి ప్రేమ తర్వాత డైరెక్టర్ ఏ.కరుణా కరణ్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘బాలు’. ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై టాప్ డిజాస్టర్ మూవీగా నిలిచింది. ‘ఖుషీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎస్.జే.సూర్య కాంబినేషన్లో పవన్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Folk dancer Eshwar sai filed bail petition in telangana high court: ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి, మాధురీ రాథోడ్ ల వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాధురీ రాథోడ్ ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడని మాధురి రాథోడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించి తన పరువుకు భంగం కలిగించేలా ఫేక్ వీడియోలు సృష్టించి డిజిటల్ వేధింపులకు గురిచేశాడని కూడా మాధురీ రాథోడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాధురీ రాథోడ్ ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈశ్వర్ సాయి తాజాగా.. తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని భావించి ఈశ్వర్ సాయి తన లాయర్లతో ఈ బెయిల్ పిటిషన్ వేసుకున్నట్లు తెలుస్తొంది. మరోవైపు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈశ్వర్ సాయి, మాధురీ రాథోడ్ లు ఒకే గదిలో అడ్డంగా దొరికిపోయారు. వీరి బండారాన్ని ఈశ్వర్ సాయి శరణ్య బైటపెట్టింది. అప్పట్లో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. తొలుత మాధురీ రాథోడ్ ది తప్పని ప్రచారం జరిగింది. ఇక ఈశ్వర్ సాయి సైతం పదే పదే వీడియోలు రిలీజ్ చేయడంతో మాధురీ రాథోడ్ కూడా అసలు విషయాన్ని బైటపెట్టింది. Read more: Disha Salian Death Case: దిశా

మాస్ మహారాజ రవితేజ, నక్షత్ర, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్, హరిహర సుతుడు అయ్యప్ప ల 'ఇరుముడి' 200 కోట్ల రూపాయిలు చేరుకోవడానికి రెడీ అవుతుంది. తాజాగా ఇరుముడి నుంచి సరికొత్త డివోషనల్ వీడియో సాంగ్ 'కార్తీక మాసం' విడుదలై అభిమానులని ప్రేక్షకులని ఎంతోగానో ఆకట్టుకుంటోంది. స్వామి అయ్యప్ప భక్తి పారవశ్యాన్ని, మండల దీక్షా నియమాలను ఎంతో లోతుగా ఆవిష్కరించిన ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉంది. ఈ అద్భుతమైన గీతానికి దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా సాహిత్యాన్ని అందించగా, జి. వి. ప్రకాష్ కుమార్ తో కలిసి శివ నిర్వాణ ఆలపించాడు 4 నిమిషాల 5 సెకన్ల నిడివితో ఉండగా నేరుగా శబరిమల భక్తి లోకంలోకి తీసుకెళ్తుంది. "ఇది మరి కార్తీక మాసం స్వామి... తలపై చన్నీళ్ల స్నానం కాని మనసే మరింత భద్రం స్వామి" అంటూ సాగే లిరిక్స్ దీక్షా ధారుల జీవితాన్ని, శారీరక కష్టాలను దాటి పొందే ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రతిబింబిస్తాయి. భక్తులు పడే తపన, చలిలో ఉదయాన్నే చేసే స్నానాలు, కటిక నేలపై పడుకునే నిరాడంబరమైన జీవనశైలిని చాలా సహజంగా ఈ పాటలో వర్ణించారు. పాటలోని అతి ముఖ్యమైన అంతరార్థం ఏమిటంటే— "కనిపించని శత్రువు కాదు, యుద్ధం కాదీ మండల దీక్ష... నాతోటి నేనే చేసే యుద్ధమే ఈ దీక్ష". బయటి సమాజంతో లేదా శత్రువులతో చేసే పోరాటం కాదు మండల దీక్ష, మనలోని అహంకారాలు, ద్వేషాలు, కామక్రోధాలపై మనతో మనమే చేసే అంతర్యుద్ధం అనే గొప్ప సందేశాన్ని ఈ పాటకు శివ నిర్వాణ అందించారు. అలాగే "నేను అంటే నువ్వే అంటూ స్వామి పదవి ఇచ్చావు... ద్వేషాల్ని దూరం చేసి వర్ణాన్ని ఒక్కటి చేసి" అని అయ్యప్ప దీక్షలోని సమభావనను ఎత్తిచూపారు. కులమతాల భేదం లేకుండా, చిన్నపెద్ద తారతమ్యం లేకుండా నల్లటి దుస్తులు ధరించి ప్రతి ఒక్కరినీ 'స్వామి' అని పిలుచుకునే ఆచారాన్ని

హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 1: ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న ప్రస్థానం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 12వ తేదీన హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘సిల్వర్ జూబ్లీ పాటల పోరాటం’ పేరిట ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న తెలిపారు. మంగళవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణవ్యాప్తంగా ఉన్న కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థిలోకం పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ‘నా పేరే ఏపూరి -పోరాటమే నా దారి’ అని స్పష్టం చేశారు. తెలంగాణ సమాజంలో కవులకు, కళాకారులకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించడానికి, వారి పక్షాన నిలబడి ఎదిరించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ప్రకటించారు. పస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో యువత పెడదోవ పడుతూ మాదకద్రవ్యాలు(డ్రగ్స్) బారిన పడుతుండటంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యువతను జాగృతం చేసి సరైన మార్గంలో నడిపించేందుకు అక్టోబర్ నెల నుంచి తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా పర్యటనలు, చైతన్య కార్యక్రమాలు చేపడతానని సోమన్న వెల్లడించారు
యూట్యూబ్‌లో జానపద గీతాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ‘ప్రమీల ఓ ప్రమీల’, ‘బాసింగ బలాలే’ వంటి పాపులర్ ఫోక్ సాంగ్స్‌తో గుర్తింపు పొందిన ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ తోటి డ్యాన్సర్ మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ వివాదం కొద్దిరోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మొదలైంది. ఇప్పటికే వివాహమై ఒక బాబు ఉన్న ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌తో కలిసి వేములవాడలోని ఒక హోటల్ గదిలో ఉండగా.. ఆయన భార్య శరణ్య అక్కడికి చేరుకుని వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం, గొడవకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వివరణలు ఇచ్చే ప్రయత్నం చేశారు.* నా కెరీర్లో 'మోస్ట్ ఆల్ఫా' మూమెంట్ అదే... 'పుష్ప 2'లో లేడీ గెటప్‌పై బన్నీ ఓపెన్ కామెంట్స్ఇటీవల ఈ వివాదం మరింత ముదిరి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, నమ్మించి మోసం చేశాడని మాధురి రాథోడ్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మార్ఫింగ్ చేసిన నకిలీ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాడని, డిజిటల్ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపించారు.* వెండితెరపై తమ్ముళ్లతో రొమాన్స్.. నిజ జీవితంలో అన్నలకు జోడీగా... హీరోయిన్ల క్రేజీ లవ్ స్టోరీస్మాధురి రాథోడ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును

singer murder case:54 మిలియన్ వ్యూస్‌తో సంచలనం సృష్టించిన ఓ పాటలో నటించిన యువ సింగర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ పాటలోని వివాదాస్పద అంశాలే హత్యకు కారణమయ్యాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హర్యాన్వీ సింగర్ అంకిత్ బాల్యాన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. కేవలం 28 ఏళ్ల వయసున్న అంకిత్ ఆగస్టు 26న ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఓ జిమ్ బయట కాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అంకిత్ నటించిన ఓ పాట ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘భరీ కోర్ట్ మే గోలి మారేంగే’ అనే పాట యూట్యూబ్‌లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ పాటకు ఏకంగా 54 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే పాటలోని కొన్ని పదాలు ఓ గ్యాంగ్‌కు ఆగ్రహం తెప్పించాయని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం, ఈ పాటలోని లిరిక్స్ తమ నాయకుడిని అవమానించేలా ఉన్నాయని గోగి గ్యాంగ్ సభ్యులు భావించినట్లు తెలుస్తోంది. 2021లో ఢిల్లీలోని రోహిణి కోర్టులో గ్యాంగ్ లీడర్ జితేందర్ గోగి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ప్రత్యర్థి గ్యాంగ్‌తో జరిగిన ఘర్షణలో జరిగింది. అంకిత్‌కు ప్రత్యర్థి గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయని గోగి గ్యాంగ్ అనుమానించినట్లు సమాచారం. అంకిత్, ప్రత్యర్థి గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారనే కారణంతో కూడా అనుమానం పెరిగినట్లు తెలుస్తోంది. అయితే తాను పాటలో కేవలం నటించానని, పాటకు సంబంధించిన లిరిక్స్ లేదా మ్యూజిక్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని అంకిత్ గతంలోనే స్పష్టం చేసినట్లు సమాచారం. అయినప్పటికీ అతడిపై అనుమానాలు తగ్గలేదని పోలీసులు చెబుతున్నారు. గతంలో అంకిత్‌కు బెదిరింపులు కూడా వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే దాడికి ముందు నిందితులు షామ్లీలో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక పాటకు వచ్చిన భారీ

రీసెంట్ డేస్ లో ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి.. సినిమా సాంగ్స్ ను మించి జానపద గీతాలు క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి ఈ ఫోక్ సాంగ్స్. అంతే కాదు కొన్ని సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాయి. విదేశాల్లోనూ మన పాటలకు జనాలు ఊగిపోతున్నారు. అయితే ఇలా పాపులర్ అయిన పాటలను ఇప్పుడు సినిమాల్లోనూ వాడేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఫోక్ సాంగ్స్ సినిమాల్లో వినిపించాయి. అయితే రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ప్యారడైజ్ లోనూ పాపులర్ తెలంగాణ ఫోక్ సాంగ్ ను వాడేశారు... అదే ఏష నాగుల కట్టమీద. నాకంటే అతనే బాగా సూట్ అవుతాడు..! బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ తెలంగాణ జానపదగీతాల్లో ఈ పాటకు ప్రత్యేకత ఉంది.. తెలంగాణ కల్చర్ తోపాటు , మంచి మాస్ బీట్ కూడా ఉంది ఈ సాంగ్ లో.. ఇక ఈ సాంగ్ పాడిన ఫీమేల్ సింగర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె ఎవరు.? ఇంతకు ముందు ఏ పాటలు పాడింది అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ఆమె పేరు ప్రభ బంగారిగళ్ళ. అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది.. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడా శిక్షణ తీసుకోకుండా తన తల్లి వద్దే ఆమె పాటలు నేచుకుందట ప్రభ. జానపద గాయనిగా సోషల్ మీడియాలో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఆమె పాడిన పాటలు మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకున్నాయి. నిమ్మతోట వనములో, ఓ పిలగ వెంకటేశు.. ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకు తెలుసు ఆ పాటలు పాడింది ప్రభనే.. ఇప్పుడిప్పుడే ఆమె సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. మొన్నామధ్య విశాల్ మకుటం అనే సినిమాలో ఓ పాట పాడింది. ఇప్పుడు ఏష నాగుల
రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని ‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ రైటింగ్‌లో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2025లో సమయంలో చేరిన రాజశేఖర్.. సినిమా రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు, విశ్లేషణలు, స్పెషల్ స్టోరీలు రాస్తున్నారు. సినిమాల గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. సోషల్ మీడియా పోస్టులను ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. రాజశేఖర్ జేఎన్టీయూ-హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ నుంచి ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ పొందారు. తుపాకీ న్యూస్, ఏబీపీ దేశం, ఇండియా హెరాల్డ్ డాట్ కామ్ లాంటి మీడియా సంస్థల్లో సినిమా, ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు. 2019 ఎన్నికల టైంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

ప్రైవేట్ ఆల్బమ్స్‌తో ఓవర్ నైట్ బిజియెస్ట్ కంపోజర్‌గా మారాడు సాయి అభ్యంకర్. డైరీలో మైల్డ్ బ్లోయింగ్ ఆఫర్స్ ఉన్నా కూడా ఆల్బమ్స్ కంటిన్యూ చేస్తున్నాడు ఈ యంగ్ బాయ్. ఇండిపెండెంట్స్ సాంగ్స్ కోసం రైజింగ్ అండ్ యూత్‌లో అటెన్షన్ పే చేస్తున్న బ్యూటీల్నే గ్రాబ్ చేస్తుంటాడు. ముఖ్యంగా తమిళంలో క్లికైన భామలే అతడి టార్గెట్. ఆసా కూడాలో ప్రీతి ముకుందన్తో స్టెప్పులేయించిన సాయి.. ఆ తర్వాత సితిరి పుత్తిరిలో మీనాక్షి చౌదరిని పట్టుకొచ్చాడు. వీజీ వీకూరలో శాన్వీ మేఘనతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక ఈ ఏడాది పావళ మల్లి సాంగ్ కోసం టాలీవుడ్ అండ్ కోలీవుడ్ యూత్ క్రష్ కయాద్ లోహార్తో కలిసి మాస్ స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు సాయి అభ్యంకర్. తాజాగా మరో ఇండి ఆల్బమ్ రిలీజ్ చేశాడు నూనుగు మీసాల కుర్రాడు. ఈ సారి భాగ్యశ్రీ బోర్సేతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. రాధిమా బ్రేకప్ సాంగ్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ ఆల్బమ్‌కు తన మాజీ ప్రేయసి పేరైన “రాధిమా” అని పేరు పెట్టాడట 21 ఏళ్ల యంగ్ బాయ్. పేరుకు బ్రేకప్ సాంగ్ కానీ చూసేందుకు రొమాంటిక్ సాంగ్‌ను తలపిస్తోంది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. డ్యూడ్, కరుప్పు చిత్రాలతోతో ఫ్రూవ్ చేసుకున్న 21 ఇయర్స్ యంగ్ కంపోజర్ సాయి ఖాతాలో దాదాపు పది సినిమాలున్నాయి. అందులో మోస్ట్ యాంటిసిపెటెడ్ ఫిల్మ్ ‘రాకా’ కూడా ఒకటి. ఫస్ట్ కమిటైన ఫిల్మ్ బెంచ్ ఇంకా రిలీజ్ కాకుండా బోలెడు ఆఫర్స్‌తో స్టార్ కంపోజర్స్‌కు స్ట్రాంగ్ కాంపిటీటర్ అవుతున్నాడు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లైవ్ కాన్సర్ట్స్ అని, మ్యూజిక్ ఈవెంట్స్ అంటూ ఫోకస్ పెడితే ప్రైవేట్ ఆల్బమ్స్‌తోనే ఫేమ్ తెచ్చుకుంటున్నారు స్టార్ కిడ్. తన ఇండివిడ్యువల్స్ సాంగ్స్‌తో క్రేజీ హీరోయిన్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకుని హీరో కావాలన్న కోరికను ఫిల్ చేసుకుంటున్నాడు హరిణీ అండ్ టిప్పుల ముద్దుల కిడ్
సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా తీవ్ర వివాదాస్పదంగా మారిన జానపద కళాకారులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ల వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఎట్టకేలకు స్పందించడమే కాకుండా, తనపై దాడి చేసిన వారిపై రివర్స్ కేసు పెట్టడం ఇండస్ట్రీ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. వేములవాడలోని రెడ్డి భవన్లో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని మాధురి రాథోడ్ వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొందరితో కలిసి వచ్చిన శరణ్య, తనను అసభ్యకర పదజాలంతో దూషించడమే కాకుండా భౌతికంగా దాడికి తెగబడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా దాడి చేస్తున్న సమయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని మాధురి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ గొడవ సమయంలో తన వద్ద ఉన్న రూ. 50 వేల విలువైన ఐఫోన్‌ను దొంగిలించారని ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం. ఈ వ్యవహారంపై నిజానిజాలు తెలుసుకోకుండా తన వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిన కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఛానళ్లపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మాధురి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు సంబంధిత వ్యక్తులపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో 'బాసింగా బలాలు' పాటతో ఈశ్వర్ సాయి, అనేక ప్రైవేట్ జానపద గీతాలతో మాధురి రాథోడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పోలీసులు ఈ కేసు నమోదు చేయడంతో తదుపరి విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయోనని నెటిజన్లు ఎంతో ఉత్కంఠగా గమనిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ రిస్క్ ఫలించింది.. ఇరుముడి 200 కోట్లు పక్కా తమిళ ఇండస్ట్రీలో సంక్షోభం.. సెప్టెంబరు 1

వందేమాతరం' గౌరవ ప్రతిష్ఠలను కాపాడటం కోసం ప్రవేశపెట్టిన కీలక తీర్మానానికి భారతీయ జనతా పార్టీ అమోదం తెలిపింది. ఇంటర్నెట్ డెస్క్: 'వందేమాతరం' గౌరవ ప్రతిష్ఠలను కాపాడటం కోసం ప్రవేశపెట్టిన కీలక తీర్మానానికి భారతీయ జనతా పార్టీ అమోదం తెలిపింది. శనివారం జరిగిన బీజేపీ నూతన జాతీయ పదాధికారుల సమావేశంలో 10 పాయింట్లతో ఈ తీర్మానాన్ని బీజేపీ ఆమోదించింది. కాంగ్రెస్ సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. వందేమాతరం గేయంలోని తొలి 2 చరణాలను మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి 6 చరణాలను పాడి, వందేమాతరం గౌరవాన్ని కాపాడుతామని స్పష్టం చేసింది. 2026 పార్లమెంట్ చట్టాన్ని బీజేపీ సమర్థించింది. ఓటు బ్యాంకు రాజకీయాలకు 'వందేమాతరం' బలికాదని తేల్చి చెప్పింది. 'వందేమాతరం' గౌరవ ప్రతిష్ఠలను కాపాడతామని బీజేపీ ప్రతిజ్ఞ చేసింది. దేశవ్యాప్తంగా 'వందేమాతరం' ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టింది. వైసీపీపై మంత్రి నారా లోకేశ్ ఫైర్.. టీడీపీ కేడర్‌కు కీలక సూచనలు గృహ హింస, వరకట్న వేధింపుల కేసులో జోగి రమేశ్ కుటుంబానికి ఊరట

కాంగ్రెస్ కార్యక్రమాల్లో వందేమాతరం మొదటి 2 చరణాలను మాత్రమే పాడాలన్న నిర్ణయంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. వందేమాతరాన్ని పూర్తిగా గౌరవించకుండా వ్యతిరేకించడం రాజ్యాంగపరంగా తీవ్రమైన విషయమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వైఖరి రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. జాతీయ గేయాన్ని గౌరవించే విషయంలో రాజకీయ రాజీకి అవకాశం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఆగస్టు 19న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వందేమాతరం విషయంలో పార్టీ తన పాత వైఖరినే కొనసాగించాలని నిర్ణయించింది. 1937 నాటి తీర్మానానికి కట్టుబడి కార్యక్రమాల్లో మొదటి 2 చరణాలను మాత్రమే పాడాలని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ వెల్లడించారు. గాంధీ, నెహ్రూ, ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, పటేల్ వంటి నాయకుల కాలంలో రూపొందిన విధానాన్నే అనుసరిస్తున్నామని కాంగ్రెస్ పేర్కొంది. దీంతో కాంగ్రెస్ నిర్ణయాన్ని రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా తప్పుబడుతూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించారు. వందేమాతరాన్ని గౌరవించడానికి నిరాకరించడమే కాకుండా వ్యతిరేకించడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, పార్లమెంటు చేసిన చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. జాతీయ గేయానికి గౌరవం ఇవ్వకపోతే దేశభక్తిపైనా ప్రశ్నలు తలెత్తుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. 1937 తీర్మానం ముస్లిం లీగ్ డిమాండ్లకు తలొగ్గి తీసుకున్నదని కూడా ఆరోపించారు. ఫలితంగా వందేమాతరం అంశంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత స్మృతి ఇరానీ కూడా కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా ప్రశ్నించారు. జనగణమనతో సమాన గౌరవం పొందిన వందేమాతరాన్ని కాంగ్రెస్ ఎందుకు పరిమితం చేస్తోందని ఆమె నిలదీశారు. పార్లమెంటు చేసిన చట్టాన్ని పక్కనపెట్టే ప్రత్యేక హక్కు సోనియా గాంధీకి ఉందా అని ప్రశ్నించారు. వందేమాతరంలో దుర్గా, లక్ష్మీ దేవతల ప్రస్తావనపై కాంగ్రెస్‌కు అభ్యంతరమా అని కూడా ఆమె ప్రశ్నించారు. వందేమాతరం బంకిం చంద్ర ఛటర్జీ

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎక్కువగా చిరంజీవి సినిమాలే కనిపిస్తుంటాయి. మాస్ డైలాగ్స్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్కు సరికొత్త నిర్వచనం చెప్పిన ఆల్‌టైమ్ క్లాసిక్ సినిమాల్లో ‘గ్యాంగ్ లీడర్’ ముందు వరుసలో ఉంటుంది. ఈసినిమా రిలీజ్ అయ్యి 35 ఏళ్లు పూర్తి అయ్యింది. 1991 మే 9న విడుదలైన గ్యాంగ్ లీడర్.. మెగాస్టార్ చిరంజీవిని తిరుగులేని "నంబర్ వన్" సింహాసనంపై కూర్చోబెట్టింది. దర్శకుడు విజయ బాపినీడు సృజనాత్మకత, పరుచూరి సోదరుల మాస్ డైలాగ్స్, బప్పీలహరి సంగీతం కలగలిసి ఈ చిత్రాన్ని ఇండస్ట్రీ హిట్‌గా నిలబెట్టాయి. చిరంజీవి, విజయశాంతి, రావు గోపాల్ రావు, ఆనందరాజ్, శరత్ కుమార్, మురళీ మోహన్, నిర్మలమ్మ లాంటి స్టార్ తారాగణం నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడానికి గల కారణాలేంటో చూద్దాం. రఘుపతి (మురళీ మోహన్), రాఘవ (శరత్ కుమార్), రాజారామ్ (చిరంజీవి) ముగ్గురు అన్నదమ్ములు. రఘుపతి బాధ్యతాయుతమైన అన్నగా కుటుంబాన్ని పోషిస్తుంటే, రాఘవ ఐఏఎస్ (IAS) కు సిద్ధమవుతుంటాడు. రాజారామ్ బాధ్యతారాహిత్యంగా నలుగురు స్నేహితుల గ్యాంగ్‌తో జాలీగా తిరుగుతుంటాడు. తమ్ముడి ఐఏఎస్ ప్రిపరేషన్ కోసం డబ్బు కావాల్సి వస్తే, రాజారామ్ జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడడు. అయితే, నగరంలో అరాచకాలు సాగించే ఏకాంబరం (రావు గోపాల్ రావు), కనకాంబరం (ఆనందరాజ్) చేతిలో రఘుపతి దారుణంగా హత్యకు గురవుతాడు. ప్రమాదవశాత్తు జరిగిందనుకున్న అన్న మరణం వెనుక ఉన్న కుట్రను రాజారామ్ ఎలా బయటపెట్టాడు? తన కుటుంబానికి దూరమైన పరిస్థితి నుండి, తన గ్యాంగ్, ప్రియురాలు కన్యాకుమారి (విజయశాంతి) సహాయంతో విలన్ల అంతం ఎలా చూశాడు? తమతోనే ఎంతో సరదాగా ఉంటూ.. హీరోకి లైన్ వేసే కన్యాకుమారి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న విషాదం ఏంటి? అది ఎప్పుడు రివీల్ అవుతుంది? అనేదే మిగతా కథ. రాజారామ్ పాత్రలో చిరంజీవి నటన, ఆటిట్యూడ్, డ్యాన్సులు, ఫైట్లు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా

బుల్లితెరపై త్వరలోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే సామాన్యుల కోసం అగ్నిపరీక్ష 2 నిర్వహిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో సెలబ్రెటీ కంటెస్టెంట్స్ పేర్లు తెగ హల్చల్ చేస్తున్నాయి. సీరియల్ తారల నుంచి సినిమా హీరోహీరోయిన్లు, ఇన్ స్టా ఇన్ల్ఫుయేన్సర్స్ సైతం హౌస్ లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫోక్ డ్యాన్సర్లు శ్వర్ సాయి, మాధురి రాథోడ్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్, రివ్యూయర్ ఆది రెడ్డి కూడా వీరి ఎంట్రీపై తన అభిప్రాయాలను వ్యక్తపరచడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇటీవల రెండు రోజులుగా వీరిద్దరి పేర్లు నెట్టింట మారుమోగుతున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత వివాదంలో ఇద్దరి పేర్లు వార్తలలో నిలవగా.. ఇప్పుడు వీరి గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. బిగ్‌బాస్ షో ప్రతి సీజన్లోనూ వివాదాలు , లేదా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యే కాంబినేషన్లను లేదా వైరల్ కంటెస్టెంట్లను తీసుకోవడానికి ఆసక్తి చూపుతుంది. ఇటీవల ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ చుట్టూ ముసురుకున్న కుటుంబ వివాదం, సోషల్ మీడియా వ్యాఖ్యలు, మీడియాలో వచ్చిన వార్తలు విపరీతమైన వ్యూస్‌ను, పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి. దీంతో టీఆర్పీ కోసం బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రస్తుతం విపరీతమైన పబ్లిసిటీ క్రేజ్ ఉన్న వీరిని సంప్రదించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నాడు ఆదిరెడ్డి. గత సీజన్లలో కూడా వివాదాస్పదంగా మారిన ఇన్ఫ్లుయెన్సర్లకు, కాంట్రవర్సీ పెయిర్స్‌కు బిగ్‌బాస్ అవకాశాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఆది రెడ్డి చెప్పిందే నిజమవుతుందా? బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎవరిని తీసుకురావాలనేది ఆర్గనైజర్స్ చేతిలోనే ఉంటుంది. అయితే ఆది రెడ్డి అంచనాలు చాలా వరకు బిగ్‌బాస్ కంటెంట్ అండ్ మైండ్‌సెట్‌ను బట్టి సరిపోతుంటాయి. “ప్రమీల”, “రాతిరి రాతిరి” వంటి హిట్ పాటలతో వీరిద్దరికి ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. దానికి తోడు ఇటీవల
సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'జైలర్ 2'. 2023లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'జైలర్' మూవీకి సీక్వెల్ ఇది. దసరా కానుకా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ బయటకు వదల్లేదు. అప్పుడెప్పుడో వచ్చిన అనౌన్స్ మెంట్ టీజర్, ఇటీవల వచ్చిన రిలీజ్ డేట్ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్ విడుదల చేయడంతో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.'జైలర్ 2' నుంచి ''అలా బోలేలో'' అంటూ సాగే పాటను ఫస్ట్ సింగిల్ గా లాంచ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ ఈ డ్యాన్స్ నంబర్ కి ట్యూన్ చేయడమే కాదు, హుషారుగా ఆలపించారు. తెలుగు వెర్షన్ కి శ్రీనివాస మౌళి లిరిక్స్ రాశారు. ఈ పాట వినడానికి మలయాళం, తమిళం, తెలుగు మిక్స్ చేసినట్లుగా ఉంది. చూడ్డానికి కూడా బాగుంది. ఇందులో నటి పూర్ణ తన డ్యాన్సులతో సర్ప్రైజ్ చేశారు. మాస్, క్లాసికల్ మిక్స్ చేసి ఆమె వేసిన స్టెప్పులు అలరిస్తున్నాయి. దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.'గుంటూరు కారం' సినిమాలో పూర్ణ డ్యాన్స్ చేసిన 'కుర్చీ మడతపెట్టి' పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు 'అలా బోలేలో' సాంగ్ కూడా ఆమెకు అంతే పేరు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. లిరికల్ వీడియోలో రజనీకాంత్ డ్యాన్స్ చేసినట్టుగా చూపించలేదు. 'జైలర్'లో తమన్నా చేసిన 'కావాలయ్యా' పాట ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ గ నిలిచిందనే సంగతి తెలిసిందే. ఇప్పుడు 'జైలర్ 2'లో 'అలా బోలేలో' ఏ మేరకు వైరల్ అవుతుందో చూడాలి.'జైలర్ 2' చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. విజయదశమి పండగ సందర్భంగా 2026 అక్టోబర్ 15న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న సీక్వెల్ మూవీ జైలర్-2. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం తలైవా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. అలా బోలేలో అంటూ సాగే మాస్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు అరుణ్రాజా కామరాజ్ లిరిక్స్ అందించగా.. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఈ భారీ ప్రాజెక్ట్ అక్టోబర్ 15, 2026న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు) హైదరాబాద్ : హైటెక్స్‌లో హిమ్టెక్స్ ప్రదర్శన (ఫొటోలు) తీరని విషాదం.. కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా ! రోహిత్, గిల్ రికార్డులు OUT పంత్ @ NO.1 ఎవరికీ సాధ్యం కాని ఘనత - రామోజీరావు ఆస్తులు అమ్మాల్సిందే.. ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు నువ్వు 10 కోట్లు ఇవ్వకపోతే.. లింగమనేని కొడుకు యాక్సిడెంట్ పై KA పాల్

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, చిత్తా చిత్రాలతో టాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్ (Siddharth). బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, చిత్తా చిత్రాలతో టాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్ (Siddharth). ఆయన నటుడిగా ఎంత ఫేమసో.. వివాదాల ద్వారా కూడా అంతే ఫేమస్. ఏది మాట్లాడిన ముక్కుసూటిగా మాట్లాడుతూ కాంట్రవర్సీ కింగ్ గా మారాడు. తాజాగా సిద్ధార్థ్ ఒక ఇంటర్వ్యూలో తను ఎంచుకునే పాత్రలు, సినిమాలు, తన నైతిక విలువలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సమాజానికి చెడు సందేశాన్ని ఇచ్చే ఎలాంటి పాత్రల్లోనూ తాను నటించనని ఆయన స్పష్టం చేశాడు. సాధారణంగా ప్రతి సినిమాలో ఐటెంసాంగ్స్ చూస్తూనే ఉంటాం. కానీ సిద్దు సినిమాలలో ఐటెంసాంగ్స్ కనిపించవు. తాజాగా అలాంటి పాటలకు తాను ఎందుకు దూరంగా ఉంటాననే విషయంపై సిద్ధార్థ్ మాట్లాడుతూ.. "ఒక మహిళ చుట్టూ 40 మంది పురుషులు చేరి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే ఐటెం పాటల్లో నేను ఎప్పుడూ నటించలేదు, ఇకపై కూడా నటించను. మహిళలను తక్కువ చేసి చూపే ఎలాంటి సన్నివేశాలకు నేను మద్దతు ఇవ్వను" అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. అలాగే కేవలం హీరో పాత్రలే పోషించాలనే పట్టింపు తనకు లేదని, నటుడిగా వైవిధ్యమైన పాత్రలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. హీరో పాత్రలకు చెడు లక్షణాలు ఉండి, వారిని రోల్ మోడల్స్‌గా చూపే కథలను కూడా నేను ఎంచుకోను. సమాజానికి తప్పు సందేశం ఇవ్వడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. సినిమా చివరికి ఘోరంగా అంతమయ్యే నెగెటివ్ లేదా విలన్ పాత్రల్లో నటించడానికి కూడా నేను సిద్ధమే. కానీ చివరికి చెడు గెలిచేలా చూపించే పాత్రలను మాత్రం అంగీకరించను' అని సిద్ధార్థ్ స్పష్టం చేశాడు. సినీ పరిశ్రమలో కేవలం ఇమేజ్ కోసం కాకుండా బాధ్యతాయుతమైన కథలను ఎంచుకుంటానని చెప్పాడు. అయితే ఈ వ్యాఖ్యలపై

మధ్య కాలంలో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై ఫోక్ సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. యూట్యూబ్‌లలో జానపద గేయాలకు భారీగా ఆధరణ లభిస్తోంది. కోట్ల కొద్ది వ్యూస్ తో లక్షల కొద్ది డబ్బు తెచ్చిపెడుతున్నాయి పాటలు. దాంతో చాలామంది యంగ్ స్టార్స్ ప్రైవేట్ సాంగ్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. యంగ్ యాక్టర్స్, యంగ్ డాన్సర్లు తమ ప్రతిభ చూపించడానికి సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతుంది. అలా పాపులర్ అయినవారిలో మాధురి రాథోడ్ కూడా ఒకరు. నిమ్మతోట వనములో పాటతో తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఇమేజ్ సాధించి ఆమె.. ఈమధ్య ఎక్కువగా వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. మాధురి రాథోడ్ , ఈశ్వర్ సాయి వివాదంగురించి తెలిసిందే. 'బాసింగ బలాలు' అనే పాట ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు, డ్యాన్సర్ ఈశ్వర్ సాయి, నిమ్మతోట వనులో సాంగ్ ఫేమ్ మాధురి రాథోడ్ ఇద్దరు కలిసి చాలా సాంగ్స్ చేశారు. వీరిద్దరి మధ్య రిలేషన్ గురించి చోటుచేసుకున్న ఒక ఊహించని వివాదం ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ వివాదంతో మాధురి హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం మాధురి రాథోడ్ గురించి ఎక్కువగా నెట్టింట సెర్చ్ చేస్తున్నారట నెటిజన్లు. ఆమె సంపాదన గురించి తెలుసుకోడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సక్సెస్ అనేది ఒక్క రాత్రిలో వచ్చేది కాదు. దాని వెనుక ఎన్నో ఏళ్ల కష్టం, పట్టుదల, ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి. అవన్ని దాటుకుని ముందుకు సాగితేనే ఓ గుర్తింపు వస్తుంది. అది సాధించడం అంత ఈజీ కాదు. ఒకవేళ తెచ్చుకున్నా అదే క్రేజ్‌ను నిలబెట్టుకోవడం కూడా కష్టమే. ప్రస్తుతం మాధురీ రాథోడ్ పరిస్థితి అదే. ఈశ్వర్ సాయి వివాదం మాధరి కెరీర్ పై గట్టిగా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. రాతిరి ఓ రాతిరి, ప్రమీల, సిలకా, లాయి

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా, రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించే దిశగా అడుగులు వేస్తోంది. సినిమా విడుదలైన కేంద్రాల్లో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వ్యక్తమవుతోంది. థియేటర్ల వద్ద హారతులు, భజనలతో సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా చిత్రంలోని ‘మల్లెపూల పల్లకి’ పాటకు థియేటర్లలో పిల్లలు డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తుండగా, సంగీతంపై కూడా మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఉదయం షోల నుంచి మొదలైన ఈ జోరు షో టు షో మరింతగా పెరుగుతోంది. చాలా చోట్ల సెకండ్ షోలకు టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయి హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అన్ని సెంటర్లలోనూ భారీ కలెక్షన్ల దిశగా సాగుతున్న ‘ఇరుముడి’, థియేటర్లలో సరికొత్త మాస్ జాతరను సృష్టిస్తోంది
'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు', 'ఓయ్!' వంటి యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన చాక్లెట్ బాయ్ సిద్ధార్థ్, విభిన్నమైన పాత్రలతో దక్షిణాదిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఇటీవల విడుదలైన 'ఆపరేషన్ సఫేద్ సాగర్' వెబ్ సిరీస్‌లో స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా పాత్రలో అద్భుతమైన అభినయంతో మెప్పించిన ఆయన, తాజాగా సమాజం పట్ల ఒక నటుడిగా తనకున్న బాధ్యతలు, సినీ నైతిక విలువలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్రపరిశ్రమలో మహిళలను కేవలం ఒక వస్తువులా చిత్రీకరించే ధోరణిపై, ప్రత్యేకించి ఐటెమ్ పాటల సంస్కృతిపై సిద్ధార్థ్ స్పందిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఒక మహిళ చుట్టూ నలభై మంది మగవారు చేరి ఆమెతో ఎలాగైనా ప్రవర్తించవచ్చనే భావన కలిగించే ఐటెమ్ సాంగ్స్‌లో నేను నా కెరీర్లో ఎన్నడూ భాగం కాలేదు, ఇకముందు కూడా చేయను" అంటూ తన నిశ్చిత అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు తేల్చి చెప్పారు. సినిమాల్లో పాత్రల ఎంపికలో తనకు కొన్ని స్పష్టమైన నియమాలు, హద్దులు ఉన్నాయని ఈ సందర్భంగా సిద్ధార్థ్ వివరించారు. తాను కేవలం హీరో పాత్రలకే పరిమితం కావాలనుకోవడం లేదని, కథ డిమాండ్ చేస్తే పూర్తిస్థాయి విలన్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధమేనని తెలిపారు. అయితే చెడు పాత్రలను గొప్పగా చూపించి, ప్రేక్షకులకు తప్పుడు సందేశం ఇవ్వడం తనకు ఏమాత్రం నచ్చదని చెప్పారు. ఒకవేళ తాను అలాంటి నెగెటివ్ షేడ్స్ లేదా అసభ్యకర సన్నివేశాల్లో కనిపించాల్సి వస్తే, అది పూర్తిస్థాయి క్రూరమైన విలన్ పాత్ర అయినప్పుడే ఒప్పుకుంటానని స్పష్టం చేశారు. ఎందుకంటే అలాంటి కథల్లో చివర్లో ఆ విలన్ ఘోరమైన శిక్షను అనుభవిస్తాడు కాబట్టి అది సరైన సందేశాన్ని ఇస్తుందన్నారు. సమాజంలో చెడు పాత్రలను ఆదర్శంగా చూపే చిత్రాల్లో భాగం కావడం నటుడిగా తన నైతికతకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'బాయ్స్' చిత్రంతో వెండితెరకు పరిచయమై, అనేక కుటుంబ కథా చిత్రాలు