translateexpand_more

Speaker News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy03 Jun, 10:10 am
టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేల లేఖను స్వీకరించిన స్పీకర్.. నిర్ణయంపై ఉత్కంఠ

కోల్‌కతా: అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీలో తుపాను రేగింది. తనకు 59 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ సంతకాలతో కూడిన లేఖను పార్టీ బహిష్కృత నేత రితబ్రత బెనర్జీ స్పీకర్‌కు బుధవారంనాడు సమర్పించడం సంచలనమవుతోంది. రెబల్ వర్గం లేఖను స్పీకరించిన స్పీకర్ దీనిపై తన నిర్ణయాన్ని మధ్యాహ్నం 4 గంటలకు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. దీంతో టీఎంసీలో తిరుగుబాటు ఏ ములుపు తిరగనుందనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

మరోవైపు, తిరుగుబాటు వర్గానికి సమాంతరంగా అసెంబ్లీలో తమ పార్టీ కీలక నియామకాలను టీఎంసీ సీనియర్ నేత కల్యాణ్ బెనర్జీ సామాజిక మాధ్యమం 'ఎక్స్' ద్వారా స్పీకర్‌కు తెలియజేశారు. శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయ్‌ను అసెంబ్లీలో విపక్ష నేతగా, ఆశిమా పాత్ర, నారాయణ్ బందోపాధ్యాయ్‌లను డిప్యూటీ నేతలుగా, ఫర్హద్ హకీమ్‌ను చీఫ్ విప్‌గా నియమించామని అందులో పేర్కొన్నారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే అభియోగంపై రితబ్రత బెనర్జీ, సందీపన్ సహాలను టీఎంసీ ఇటీవల బహిష్కరించింది. ఈ క్రమంలో రితబ్రత బెనర్జీ నాయకత్వంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందించడం సంచలనమవుతోంది. ఈ పరిణామంపై పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

పార్టీ కమిటీలు, అనుబంధ సంస్థల రద్దు

పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ బుధవారంనాడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్‌లో పార్టీ కమిటీలు, అనుబంధ సంస్థలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రతిస్థాయిలోనూ సమగ్ర పరిశీలన, పనితీరు సమీక్ష, సంస్థాగత అంచనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

ఇవి కూడా చదవండి..

టీఎంసీలో తిరుగుబాటు.. 59 మంది ఎమ్మెల్యేల సంతకాలతో స్పీకర్‌కు లేఖ

హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Speaker News Keyword | Telugu Digital