
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరిత అన్నారు. హైదరాబాద్ నుంచి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన, ఇతర అధికారులతో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, విద్యాశాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆసిఫాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరిత అన్నారు. హైదరాబాద్ నుంచి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన, ఇతర అధికారులతో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, విద్యాశాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశా లలు, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల్లో 100 శాతం సీట్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుల అవకాశాలు ఉన్న కోర్సులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అధికారులు ప్రభుత్వ కళాశాలలు బలోపేతం కోసం సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని వీసీ హాల్ నుంచి కలెక్టర్ కె హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాటతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థుల సంఖ్య వందశాతం ఉండేలా ఉపాధ్యాయుల సమన్వయంతో కృషి చేస్తున్నామని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యాధికారులతో సమీక్ష, బడిబాట కార్యక్రమాల ద్వారా విద్యార్థుల నమోదు పెంపొందించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషక విలువలు కలిగిన రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.