
తెలుగు టెలివిజన్ ప్రపంచంలో సంచలనంగా మారింది యాంకర్ సుమ. దాదాపు 30 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుమ... 20 ఏళ్లుగా యాంకరింగ్ రంగంలో దూసుకుపోతోంది. 50 ఏళ్లు దాటినా.. అదే ఉత్సాహంతో, అదే జోష్ తో కొనసాగుతోంది సుమ. మలయాళ అమ్మాయి అయినా.. సుమ తెలుగు భాషను అద్భుతంగా మాట్లాడుతుంది. అంతే కాదు 5 భాషలను అనర్గళంగా మాట్లాడగలదు స్టార్ యాంకర్. మరీ ముఖ్యంగా స్పస్టమైన తెలుగు, మాట తీరు, కామెడీ టైమింగ్, ఎనర్జీటిక్ యాంకరింగ్ తో ఆడియన్స్ ను అలరిస్తూ వస్తోంది. ఇన్నేళ్ల నుంచి యాంకరింగ్ చేస్తూనే ఉన్నా, ఆమె తీరులో ఎలాంటి మార్పు లేదు. మునుపటికంటే ఎక్కువ ఉత్సాహంతో పనిచేస్తోంది సుమ కనకాల. ఏ ఈవెంట్ అయినా.. తడబడకుండా..సమయస్పూర్తితో సక్సెస్ చేస్తుంటుంది సుమ. మధ్య మధ్యలో జోకులు వేస్తూ.. అందరిని నవ్వించడం సుమ కనకాలకు అలవాటు. టాలీవుడ్ నుంచి పెద్ద ఈవెంట్ ఏది ఉన్నా.. అక్కడ సుమ ఉండాల్సిందే. స్టార్ హీరోల ప్రీరిలీజ్ ఈవెంట్లు, ట్రైలర్ రిలీజ్, ఆడియో ఫంక్షన్స్, ఇండస్ట్రీకి సబంధించిన పెద్ద పెద్ద కార్యక్రమాలను ఎక్కువగా సుమనే హోస్ట్ చేస్తుంటుంది. ఏ కార్యక్రమం అయినా.. సుమ ఏమాత్రం తడబాటు లేకుంటా అద్భుతంగా సక్సెస్ చేస్తుంటుంది. ఇండస్ట్రీలో పరిచయాలు, స్టార్ హీరోలతో తన భర్తకు ఉన్న స్నేహం, అన్నింటికి మంచి సుమ టాలెంట్ ఆమెను ఇన్నాళ్లు ఈ రంగంలో రాణించడానికి ఉపయోగపడుతున్నాయి. యాంకర్ సుమ స్టార్ గా ఎదగడానికి, ఈ రేంజ్ లో సక్సెస్ అవ్వడానికి ఆమె టైమ్ సెన్స్, డెడికేషన్ కారణం. చిన్న ఈవెంట్ అయినా.. పెద్ద ఈవెంట్ అయినా... పక్కాగా ఆ టైమ్ కు అక్కడ ఉండటం సుమకు అలవాటు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సుమ మాత్రం