
సాధారణంగా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయినా హీరో, హీరోయిన్ హైలైట్ అవుతారు. ముఖ్యంగా హీరోయిన్.. ఎందుకంటే.. ఈ మధ్యకాలంలో వారు తమ సినిమా టైటిల్ ని ప్రింట్ చేసిన చీర కానీ, డ్రెస్ కానీ ధరించి హైలైట్ అవ్వడం చాలా ఈవెంట్స్ లో చూస్తూనే ఉన్నాం. సాధారణంగా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయినా హీరో, హీరోయిన్ హైలైట్ అవుతారు. ముఖ్యంగా హీరోయిన్.. ఎందుకంటే.. ఈ మధ్యకాలంలో వారు తమ సినిమా టైటిల్ ని ప్రింట్ చేసిన చీర కానీ, డ్రెస్ కానీ ధరించి హైలైట్ అవ్వడం చాలా ఈవెంట్స్ లో చూస్తూనే ఉన్నాం. హీరోలు సైతం షర్ట్స్ మీద సినిమా టైటిల్స్, హీరో లుక్ ని ప్రింట్ చేయించుకుంటున్నారు. కానీ, పెద్ది (Peddi) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కన్నా, రామ్ చరణ్ (Ram Charan) కన్నా యాంకర్ సుమ (Suma) హైలైట్ గా నిలిచింది. స్టార్ హీరోల ఈవెంట్స్ అంటే సుమ కచ్చితంగా ఉండాల్సిందే. సినిమాకు తగ్గట్లు ఆమె ధరించే దుస్తులు ఆమెపై మరింత గౌరవాన్ని తీసుకొస్తాయి. ఎలాంటి అందాల ఆరబోత లేకుండా.. ఎంతో హుందాగా కనిపించడంలో సుమ ఎప్పుడు ముందు ఉంటుంది. ఇక ప్రతిసారిలా కాకుండా ఈసారి పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ మరింత హైలైట్ అయ్యింది. దానికి కారణం ఆమె కట్టుకున్న చీర. హీరోయిన్లు కట్టుకున్నట్లు సినిమా టైటిల్ థీమ్ ఉన్న చీరను ఆమె కట్టుకొచ్చింది. మెరూన్ కలర్ చీరపై బ్లాక్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ లో ఆమె అద్భుతంగా కనిపించింది. ఇక సుమ కట్టుకున్న చీరపై పెద్ది పోస్టర్ ని ప్రింట్ చేశారు.

