translateexpand_more

Suriya Next Movie News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu01 Jun, 11:57 am
లోడింగ్.. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ లైనప్

Suriya48 : భాషకు అతీతంగా అభిమానుల మనసులో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న నటుడు సూర్య. కోలీవుడ్ స్టార్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఈ స్టార్ హీరోకి తెలుగులో కూడా ఆ రేంజ్‌లో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం హీరో సూర్య తిరుగులేని ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ఇటీవల విడుదలైన ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్నారాయన. ఈ మాస్ కమర్షియల్ సక్సెస్ జోష్‌లో ఉండగానే, సూర్య తన అభిమానులకు సరికొత్త సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు వినిపిస్తుంది. తన 48వ ప్రాజెక్ట్ (#Suriya48) కోసం కల్ట్ క్లాసిక్ ‘జై భీమ్’ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్‌తో మళ్లీ చేతులు కలపబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. 'కరుప్పు' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సూర్య, తన నెక్ట్స్ మూవీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'విశ్వనాథ్ అండ్ సన్స్' (VAS) చేస్తున్న సంగతి తెలిసిందే, దీని తర్వాత జితు మాధవన్ కాంబోలో తెరకెక్కుతున్న 'సూర్య 47' పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌గా చేస్తున్నారని సమాచారం. ఈ మూడు చిత్రాల తర్వాత సూర్య మళ్లీ తన మార్క్ సోషల్ డ్రామా వైపు అడుగులు వేస్తున్నారని ప్రస్తుతం కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాన్ని ‘జై భీమ్’ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్‌ తెరకెక్కించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జై భీమ్’ ఓటీటీ వేదికగా విడుదలై, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సంచలన విజయం సాధించడమే కాకుండా న్యాయవ్యవస్థపై బలమైన ఇంపాక్ట్ చూపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి కాంబో తెరకెక్కబోతున్నట్లు జరుగుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఒక పవర్‌ఫుల్ రియల్ లైఫ్

Asianet News Telugu28 May, 03:51 pm
ఎట్టకేలకు బ్లాక్ బస్టర్.. 'కరుప్పు' ఫీవర్ తగ్గకముందే సూర్య కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

'కరుప్పు' ఫీవర్ ఇంకా తగ్గకముందే, సూర్య తర్వాతి సినిమా అప్డేట్ రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. 'కరుప్పు' లాగే 'విశ్వనాథ్ అండ్ సన్స్' కూడా పెద్ద హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి దర్శకుడు వెంకీ అట్లూరి ట్రాక్ రికార్డే కారణం. ఆయన గత చిత్రాలు 'వాతి', 'లక్కీ భాస్కర్' బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఈ జాబితాలో ఈ సినిమా కూడా చేరుతుందని ఆశిస్తున్నారు.

Asianet News Telugu28 May, 04:41 pm
బాక్సాఫీసు వద్ద 'కరుప్పు సునామీ ఆగనే లేదు, సూర్య తెలుగు సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది

సూర్య కెరీర్‌లో తొలిసారి రూ.200 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమా 'కరుప్పు'. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా నడుస్తూ రూ.300 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. ఇప్పుడు రూ.269కోట్లు రాబట్టింది. ఈ జోష్‌లో ఉన్న అభిమానులకు సూర్య మరో ట్రీట్‌ ఇవ్వబోతున్నాడు. కొత్త సినిమాతో అలరించేందుకు వస్తున్నారు. ఆయన నటించిన తెలుగు సినిమా రిలీజ్‌ కి రెడీ అయ్యింది. సూర్య తదుపరి సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఇది తెలుగు సినిమా కావడం విశేషం. `రక్తచరిత్ర` తర్వాత సూర్య నటించిన తెలుగు సినిమా ఇదే కావడం మరో విశేషం. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యకు జోడీగా మమితా బైజు నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కొన్ని నెలల క్రితం ఫస్ట్ లుక్ పోస్టర్లు, తర్వాత టీజర్ రిలీజ్ చేసి హైప్ పెంచారు. ఆ టీజర్‌లో సినిమా జులైలో వస్తుందని చెప్పారు. 'కరుప్పు' ఫీవర్ ఇంకా తగ్గకముందే, సూర్య తర్వాతి సినిమా అప్డేట్ రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. 'కరుప్పు' లాగే 'విశ్వనాథ్ అండ్ సన్స్' కూడా పెద్ద హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి దర్శకుడు వెంకీ అట్లూరి ట్రాక్ రికార్డే కారణం. ఆయన గత చిత్రాలు 'సార్‌', 'లక్కీ భాస్కర్' బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఈ జాబితాలో ఈ సినిమా కూడా చేరుతుందని ఆశిస్తున్నారు.