translateexpand_more

Tamil Nadu Bjp News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu02 Jun, 12:32 pm
తమిళనాడులో బీజేపీకి భారీ షాక్ .. తీవ్ర మనస్తాపంతో అన్నామలై రాజీనామా

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Annamalai Resignation: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం తమిళనాడు రాజకీయాలు సంచలనాలకు కేంద్రంగా మారింది. ఇప్పటికే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అధికార టీవీకే పార్టీలో చేరుతుండగా.. ఇతర పార్టీలలో కూడా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన బీజేపీకి ఆ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాజీనామా చేశారు. త్వరలో ఆయన కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నారని చర్చ జరుగుతోంది. తమిళనాడు రాజకీయాల్లో అన్నామలై రాజీనామాతో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేస్తూ 5 పేజీల లేఖ రాశారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన అన్నామలై అనూహ్యంగా రాజీనామా చేయడం కలకలం రేపింది. రాజ్యసభ అవకాశం కల్పిస్తామని బీజేపీ ఇచ్చిన ఆఫర్‌ను కూడా ఆయన తిరస్కరించినట్లు సమాచారం. లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కి పంపారు. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు సిద్ధమైనా కూడా అన్నామలై రాజీనామా చేయడం వెనుక ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్లు స్పష్టమవుతోంది. రాజీనామా చేసిన అనంతరం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అన్నామలై సమావేశమయ్యారు. అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేసినా కూడా అన్నామలై వెనక్కి తగ్గకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సమాచారం ప్రకారం అన్నామలై త్వరలోనే సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ తాజా పరిణామాలతో తమిళనాడు రాజకీయాలతోపాటు దేశవ్యాప్తంగా ఆయన తదుపరి అడుగులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదే కారణమా? రాజీనామా చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అసెంబ్లీ సీట్‌ ఇవ్వకపోవడంతో అన్నామలై తీవ్ర నిరాశకు గురయ్యారు. అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకోవడంతో అతడికి పోటీ చేసే అవకాశం దక్కలేదు. అప్పటి నుంచి అసంతృప్తితో రగులుతున్న అన్నామలై చివరకు పార్టీని వీడారు. ఐపీఎస్ అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీ శ్రేణులతో సింగం అని పిలిపించుకున్న వ్యక్తి అర్ధాంతరంగా బీజేపీ నుంచి వైదొలిగాడు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన ప్రతిసారి అన్నామలై ఓటమి పాలయ్యారు. అయితే టీవీకే పార్టీ స్థాపించిన కొన్ని నెలల్లోనే అధికారంలోకి వచ్చిన విజయ్‌ మాదిరి అన్నామలై పార్టీని స్థాపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

10TV Telugu02 Jun, 09:50 am
బీజేపీకి అన్నామలై రాజీనామా.. నితిన్ నబిన్ కు రాజీనామా లేఖ అందజేత

Annamalai : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిసింది. ఈ మేరకు మంగళవారం జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు తన రాజీనామా లేఖను సమర్పించినట్లు సమాచారం. అయితే, ఇవాళ సాయంత్రం కేంద్ర మంత్రి అమిత్ షాతో అన్నామలై భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ తరపున రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేసినప్పటికీ అన్నామలై తిరస్కరించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే, అన్నామలై రాజీనామా విషయంపై ఇప్పటి వరకు ఆ పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. Also Read : Trump – Netanyahu : ఇదెక్కడి ట్విస్ట్.. నెతన్యాహుని బండబూతులు తిట్టిన ట్రంప్.. నేను రక్షించకపోతే.. అన్నామలై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో 2020లో బీజేపీలో చేరారు. వెంటనే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏడాది తర్వాత ఎల్. మురుగన్ కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్లడంతో ఆయన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పదోన్నతి పొందారు. సాంప్రదాయకంగా ద్రావిడ ప్రధాన పార్టీల ఆధిపత్యంలో ఉన్న తమిళనాడులో అన్నామలై బీజేపీ ప్రాబల్యాన్ని గణనీయంగా పెంచారు. ఉధృతమైన ప్రచారాలు, విస్తృతమైన క్షేత్రస్థాయి పర్యటనలు, సోషల్ మీడియా ద్వారా ప్రజలను చేరుకోవడం ద్వారా, ఆయన పార్టీ సంస్థాగత విస్తరణకు సాయ పడటంతో పాటు, గణనీయమైన వ్యక్తిగత అనుచర వర్గాన్ని కూడా నిర్మించుకున్నారు. అయితే, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తమిళనాడు బీజేపీలో అధ్యక్ష మార్పు జరగాలని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి పట్టుబట్టడంతో అన్నామలై స్థానంలో నూతన అధ్యక్షుడిని బీజేపీ అధిష్టానం నియామకం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై బరిలోకి దిగుతారని అందరూ భావించారు. కానీ, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అలాగే బీజేపీ ప్రచారంలో కూడా అన్నామలై ప్రముఖ పాత్ర పోషించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘోర ఓటమి తరువాత అన్నామలై బీజేపీ వీడి కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే, తాజాగా.. అన్నామలై బీజేపీకి రాజీనామా చేశారని, రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడికి అందజేసినట్లు సమాచారం. అయితే, ఇవాళ సాయంత్రం అమిత్ షాతో అన్నామలై భేటీ అవుతారని తెలిసింది. ఆ భేటీ తరువాత అన్నామలై నిర్ణయంలో ఏమైనా మార్పు ఉంటుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి రాజీనామా చేసిన తరువాత అన్నామలై మొదట ఒక ఉద్యమాన్ని, ఆ తర్వాత పార్టీని ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఒకే రకమైన భావాలు గల వ్యక్తులను చేర్చుకోవడం, బలమైన స్వచ్ఛంద కార్యకర్తల నెట్‌వర్క్‌ను నిర్మించడం అన్నామలై లక్ష్యం అని చెబుతున్నారు. ఈ కొత్త ఉద్యమం పెద్ద ఎత్తున పని చేస్తుందని, విభిన్న వృత్తిపరమైన సామాజిక నేపథ్యాల నుండి స్వచ్ఛంద కార్యకర్తలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు.