translateexpand_more

Tamil Nadu Government News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy01 Jun, 12:32 pm
నేను సీఎంను కాను.. ప్రజా సేవకుడిని

చెన్నై, జూన్ 01: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, దళపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానేమీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కానని, కేవలం ప్రజా సేవకుడిని మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు తనను ఒక ముఖ్యమంత్రిలా కాకుండా సొంత సోదరుడిలా గుండెల్లో పెట్టుకుని ఆదరించారని భావోద్వేగానికి లోనయ్యారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ మంచి మాత్రమే చేస్తుందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

ఇదే సమయంలో తన ప్రభుత్వంపై వస్తున్న రాజకీయ విమర్శలపై సీఎం విజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాధారణంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కనీసం ఆరు నెలల సమయం ఇచ్చి, ఆ తర్వాత విమర్శలు చేస్తామని చెప్పిన విపక్షాలు.. కనీసం ఆరు రోజులు కూడా ఓపిక పట్టలేకపోయాయని మండిపడ్డారు. పదవిలోకి వచ్చిన ఆరో రోజు నుంచే తమపై బురదజల్లడం ప్రారంభించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక చివరకు తన డ్రెస్సింగ్ స్టైల్‌ను కూడా విమర్శిస్తున్నారని, తాను బ్లాక్ అండ్ వైట్ దుస్తుల్లో ఉంటే తప్పేంటని విపక్షాలను నిలదీశారు. తనను ఎంజీఆర్ (MGR) లాంటి మహోన్నత నాయకుడితో పోల్చవద్దని విజయ్ విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులోనూ తమిళనాడు రాజకీయాల్లో తమిళగ వెట్రి కజగం (TVK), ద్రావిడ మున్నేట్ర కజగం (DMK) మధ్యే అసలైన పోటీ ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమకు పూర్తి మెజారిటీ అందించి.. స్థిరమైన, బలమైన ప్రభుత్వాన్ని అందించాలని సీఎం విజయ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి..
<p style="text-align:

Andhra Jyothy29 May, 10:16 am
దేవాలయాల్లో ప్రత్యేక దర్శనాలపై పిటిషన్.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

దేవాలయాల్లో వీఐపీ సంస్కృతి, ప్రత్యేక దర్శనాలపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుడి ముందు అందరూ సమానమేనని స్పష్టం చేసింది. ప్రత్యేక దర్శనాలను సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌పై ప్రభుత్వం స్పందించేందుకు ఆరు వారాల గడువు ఇచ్చింది. ఇంటర్నెట్ డెస్క్: దేవాలయాల్లో వీఐపీ సంస్కృతిపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవాలయంలో దేవుడొక్కడే వీఐపీ అని వ్యాఖ్యానించింది. భగవంతుడు ఎవరి కోసమూ వేచి ఉండడన్న న్యాయస్థానం.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. దేవుడి ముందు అందరూ సమానమేనని స్పష్టం చేసింది. ఆలయాల్లో స్పెషల్, పెయిడ్ దర్శనాలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు తప్ప ఎవరికీ ప్రత్యేక మర్యాదలు వద్దని పిటిషనర్లు తమ వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వీఐపీల కోసం సామాన్య భక్తులను క్యూ లైన్లలో వేచి ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు తాము ప్రత్యేకమని భావించవద్దని స్పష్టం చేసింది. ఎక్కువ డబ్బులు వసూలు చేసి ప్రత్యేక దర్శనాలు కల్పించడం ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. వీఐపీ సంస్కృతి, పెయిడ్ దర్శనాల రద్దుపై సమాధానం చెప్పాలని తమిళనాడు ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 6 వారాల పాటు న్యాయస్థానం వాయిదా వేసింది. భారత్‌లోకి ఎలా వచ్చారో చెప్పిన బంగ్లాదేశీ అక్రమ వలసదారులు సోనియా, రాహుల్ గాంధీలతో సిద్దరామయ్య భేటీ..