translateexpand_more

Tamil Nadu Politics News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu02 Jun, 12:32 pm
తమిళనాడులో బీజేపీకి భారీ షాక్ .. తీవ్ర మనస్తాపంతో అన్నామలై రాజీనామా

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Annamalai Resignation: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం తమిళనాడు రాజకీయాలు సంచలనాలకు కేంద్రంగా మారింది. ఇప్పటికే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అధికార టీవీకే పార్టీలో చేరుతుండగా.. ఇతర పార్టీలలో కూడా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన బీజేపీకి ఆ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాజీనామా చేశారు. త్వరలో ఆయన కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నారని చర్చ జరుగుతోంది. తమిళనాడు రాజకీయాల్లో అన్నామలై రాజీనామాతో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేస్తూ 5 పేజీల లేఖ రాశారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన అన్నామలై అనూహ్యంగా రాజీనామా చేయడం కలకలం రేపింది. రాజ్యసభ అవకాశం కల్పిస్తామని బీజేపీ ఇచ్చిన ఆఫర్‌ను కూడా ఆయన తిరస్కరించినట్లు సమాచారం. లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కి పంపారు. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు సిద్ధమైనా కూడా అన్నామలై రాజీనామా చేయడం వెనుక ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్లు స్పష్టమవుతోంది. రాజీనామా చేసిన అనంతరం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అన్నామలై సమావేశమయ్యారు. అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేసినా కూడా అన్నామలై వెనక్కి తగ్గకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సమాచారం ప్రకారం అన్నామలై త్వరలోనే సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ తాజా పరిణామాలతో తమిళనాడు రాజకీయాలతోపాటు దేశవ్యాప్తంగా ఆయన తదుపరి అడుగులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదే కారణమా? రాజీనామా చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అసెంబ్లీ సీట్‌ ఇవ్వకపోవడంతో అన్నామలై తీవ్ర నిరాశకు గురయ్యారు. అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకోవడంతో అతడికి పోటీ చేసే అవకాశం దక్కలేదు. అప్పటి నుంచి అసంతృప్తితో రగులుతున్న అన్నామలై చివరకు పార్టీని వీడారు. ఐపీఎస్ అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీ శ్రేణులతో సింగం అని పిలిపించుకున్న వ్యక్తి అర్ధాంతరంగా బీజేపీ నుంచి వైదొలిగాడు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన ప్రతిసారి అన్నామలై ఓటమి పాలయ్యారు. అయితే టీవీకే పార్టీ స్థాపించిన కొన్ని నెలల్లోనే అధికారంలోకి వచ్చిన విజయ్‌ మాదిరి అన్నామలై పార్టీని స్థాపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

SkyC Media02 Jun, 11:20 am
సచివాలయంలో బిజీ బిజీగా మారిన సీఎం జోసెఫ్ విజయ్

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. చెన్నైలోని సచివాలయంలో జూన్ 2, 2026 నాడు ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం నూతన సీఎం జోసెఫ్ విజయ్ తో భేటీ అయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చిదంబరం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇటీవలి ఎన్నికలకు ముందు డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు జరిగాయి. ఆ కీలక చర్చల్లో పి. చిదంబరం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారు. ఎన్నికల వ్యూహాలు, సీట్ల కేటాయింపుల్లో ఆయన అందించిన సహకారం కూటమి విజయానికి ఎంతో దోహదపడింది. ఈ నేపథ్యంలో నూతన సీఎం జోసెఫ్ విజయ్ ను కలిసి చిదంబరం అభినందనలు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల తర్వాతి పరిణామాలపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీ జరిగిన అదే రోజున సచివాలయానికి ఇతర ప్రముఖులు కూడా వచ్చారు. భారత ఆర్మీ దక్షిణ భారత్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ వి. శ్రీహరి ముఖ్యమంత్రిని కలిశారు. దీంతోపాటు ఎల్ఎండబ్ల్యూ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ జయవర్ధనవేలు కూడా సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉండగా తమిళనాడు ఓమ్ని బస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సైతం ముఖ్యమంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ ప్రముఖుల రాకతో సచివాలయం రోజంతా బిజీగా కనిపించింది. మరోవైపు రాష్ట్ర పరిపాలనా విభాగంలో ఒక అనూహ్య మార్పు చోటుచేసుకుంది. తమిళనాడు శాసనసభ కార్యదర్శి కే. శ్రీనివాసన్ తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. ఫలితంగా సచివాలయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆయన 2018 నుండి ఈ కీలక పదవిలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత 2023 లో ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత కారణాలను చూపుతూ ఆయన తన పదవికి రాజీనామా చేయడం చర్చకు దారితీసింది. ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ ఈ పరిణామాలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సీఎం జోసెఫ్ విజయ్ పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. అటు రాజకీయ ప్రముఖులు, ఇటు సైనిక, పారిశ్రామిక రంగాల ప్రతినిధులు ఆయనను వరుసగా కలుస్తున్నారు. ఈ వరుస భేటీలు ప్రభుత్వ భవిష్యత్తు కార్యాచరణకు ఎంతో కీలకం కానున్నాయి. కొత్త ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రతినిధులతో కలిసి ముందుకు సాగడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. కొత్త అసెంబ్లీ కార్యదర్శి నియామకంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. చిదంబరం భేటీ తర్వాత కాంగ్రెస్, నూతన ప్రభుత్వ బంధం మరింత బలపడేలా కనిపిస్తోంది. సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి అడుగులపై అందరి దృష్టి నిలిచింది. చెన్నై నుంచి వచ్చిన ఈ రెండు ముఖ్యమైన అప్‌డేట్లు తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి.

Asianet News Telugu02 Jun, 10:34 am
పై విజయ్ దళపతి సంచలన కామెంట్స్, ఫస్ట్ స్పీచ్ తోనే పొలిటికల్ హీట్

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు కొత్త శకం మొదలైంది. వెండితెరపై విలన్లను ఉతికి ఆరేసిన 'దళపతి' విజయ్, ఇప్పుడు పొలిటికల్ పిచ్‌పై ప్రత్యర్థుల వికెట్లు పడగొట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సీఎం అయ్యాక తిరుచిరాపల్లిలో జరిగిన తన మొదటి భారీ ర్యాలీలో విజయ్ (Thalapathy Vijay) మాట్లాడిన తీరు ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. అది కేవలం స్పీచ్ కాదు, ప్రత్యర్థులకు ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్. ర్యాలీకి పోటెత్తిన జనసంద్రాన్ని చూసి ఎమోషనల్ అయిన విజయ్, ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. "తమిళనాడు ఆరాధ్య దైవం, దివంగత సీఎం MGR గారికి కూడా తన మొదటి ఎన్నికల్లో ఇంత భారీ స్థాయిలో ఓట్లు రాలేదు. అలాంటి అద్భుతమైన సపోర్ట్ ను మీరు నాకు, మన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీకి ఇచ్చారు" అని గట్టిగా చెప్పారు. కానీ, వెంటనే "అయ్యో, నేను నన్ను MGR గారితో పోల్చుకోవట్లేదు. ఆయన ఒక మహానాయకుడు. నేను కేవలం MGR, అన్నా, పెరియార్ చూపిన దారిలో నడవడానికి వచ్చిన మీ ఇంటి బిడ్డను" అని చెప్పి అందరి మనసులు గెలుచుకున్నారు. దశాబ్దాలుగా తమిళనాడును ఏలుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే అనే రెండు పెద్ద పార్టీల ఆధిపత్యానికి విజయ్ చెక్ పెట్టారు. "ఇన్నేళ్లుగా మిమ్మల్ని క్యూలలో నిలబెట్టి మోసం చేసిన ఇద్దరినీ మీరు తిరస్కరించారు. ఆరు నెలలు సైలెంట్‌గా ఉంటాడని నా గురించి అన్నారు. కానీ ఆరు రోజులు కూడా వాళ్లు సైలెంట్‌గా ఉండలేకపోయారు. మీరు నన్ను కేవలం ముఖ్యమంత్రిని చేయలేదు, మీ 'మొదటి సేవకుడి'గా ఎన్నుకున్నారు" అని విజయ్ ఎమోషనల్‌గా మాట్లాడారు. ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఏకంగా 108 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించింది. స్వయంగా విజయ్ రెండు చోట్ల పోటీ చేసి, రెండింటిలోనూ ఘన విజయం సాధించారు. చెన్నై పెరంబూర్ లో విజయ్ 1,19,454 ఓట్లు సాధించి, 53,532 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. తిరుచిరాపల్లి ఈస్ట్ లో 91,381 ఓట్లు పొంది, 27,416 ఓట్ల తేడాతో గెలిచారు. ప్రస్తుతం విజయ్ తిరుచిరాపల్లి స్థానానికి రాజీనామా చేసి, చెన్నై పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తెరపై హీరోగా ప్రేక్షకులను మెప్పించిన విజయ్, ఇప్పుడు రియల్‌గా ప్రజల సేవకు సిద్ధమయ్యారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక విప్లవాత్మక మార్పులు విజయ్ తీసుకొచ్చారు. గుడి,బడికి దూరంగా వైన్ షాపులు తరలించడం, గతంలో ముఖ్యమంత్రుల స్కీములు తీసివేయకుండా కంటీన్యూ చేయడంతో పాటు చాలా విషయాల్లో విజయ్ దూకుడు చూపించాడు. ఇక 1977 నుంచి 1987 వరకు తమిళనాడును పాలించిన తొలి యాక్టర్ MGR దారిలోనే విజయ్ నడుస్తుండటం అభిమానుల్లో కొత్త ఆశలు రేపుతోంది. మొత్తానికి, దళపతి పొలిటికల్ జర్నీ ముందు ముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి

Asianet News Telugu02 Jun, 02:30 am
నా గర్భం పోడానికి కారణం సీఎం విజయ్.. బిగ్ బాస్ నటి సంచలన ఆరోపణలు

బిగ్‌బాస్ కంటెస్టెంట్, మాజీ నర్సు, నటి మరియా జూలీ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు గర్భస్రావం కావడానికి తమిళనాడు ముఖ్యమంత్రి, సౌత్ స్టార్ దళపతి జోసెఫ్ విజయ్ కారణమని ఆమె ఆరోపించారు.

Sakshi02 Jun, 01:44 am
ఢిల్లీలో అన్నామలై.. రెండు రోజుల్లో జరిగేది ఇదేనా

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రెండురోజుల్లో అన్ని చెబుతానని, కూర్చుని మాట్లాడుకుందామని విలేకరుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఆయన మద్దతుదారులు పోస్టర్లను హోరెత్తిస్తున్నారు. ఈ పరిస్థితులలో చెన్నై నుంచి ఢిల్లీకి ఆయన బయలుదేరి వెళ్లారు. సాయంత్రం విమానాశ్రయానికి వచ్చిన ఆయన బీజేపీ జెండా లేని కారులో రావడం చర్చకు దారి తీసింది. ఆయన్ని మీడియా ప్రతినిధులు చుట్టు ముట్టి ప్రశ్నలను సంధించగా, అన్నింటికి రెండురోజులలో సమాధానం చెబుతానని, కూర్చుని మాట్లాడుకుందామని, అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానంటూ ముందుకెళ్లారు. కాగా, ఢిల్లీ వెళ్లిన అన్నామలై మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. కాగా, కె.అన్నామలై త్వరలోనే పార్టీని వీడుతున్నట్లు సోమవారం తమిళనాట వార్తలు షికార్లు చేశాయి. వీటిపై ఆయన స్పందించలేదు. కానీ సోమవారం హడావుడిగా ఢిల్లీకి వెళ్లి పార్టీ చీఫ్‌ నితిన్‌ నబిన్‌తో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి. ఢిల్లీకి వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న అన్నామలైను మీడియా పలకరించింది. ‘‘రెండ్రోజుల్లో మనందరం కూర్చుని మాట్లాడుకుందాం. నా తదుపరి కార్యాచరణను మీకు తెలియజేస్తా’’అని చెప్పి వెళ్లిపోయారు. త్వరలో ఆయన సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు వార్తలొచ్చాయి. బీజేపీలో తనకిక భవిష్యత్‌ లేదు అని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో టీవీకే చీఫ్‌ విజయ్‌ జోసెఫ్‌ ప్రభంజనం ధాటికి ప్రధాన ద్రవిడ పార్టీలు చెల్లాచెదురుకాగా బీజేపీ కేవలం ఒకే ఒక్క చోట విజయబావుటా ఎగరేసింది. జూన్‌ నాలుగోతేదీన అన్నామలై పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో అదేరోజున ఆయన తన రాజకీయ భవిష్యత్‌ నిర్ణయాలను వెలువరించబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు సోమవారం వెల్లడించాయి. 41 ఏళ్ల అన్నామలై 2011 బ్యాచ్‌ కర్ణాటక క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి. బెంగళూరు సౌత్‌ డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌గా బదిలీచేసిన కాలంలో 2019లో హఠాత్తుగా ఉద్యోగానికి రాజీనామాచేసి తమిళనాడులో రాజకీయాల్లో చేరారు. తమిళనాడు బీజేపీ చీఫ్‌గా ఉంటూ మంచి పేరు సంపాదించారు. విజయవాడలో గ్రాండ్ గా ‘పెద్ది ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) భర్తతో కలిసి జపాన్ ట్రిప్‌లో రష్మిక.. ఇప్పటికీ దాచేస్తోంది!(ఫొటోలు) సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌.. అవతరణ అదిరేలా (ఫొటోలు) ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు) రాయల్‌ ఛాలెంజర్స్‌ రాజసం.. ఫైనల్‌లో దుమ్మురేపిన బెంగళూరు (ఫొటోలు) పేకాటలో ఫస్ట్ వస్తే టీచర్ ఉద్యోగం, సొల్లు కబుర్లు చెప్పడం కాదు నన్ను గెలవలేవ్ అన్నారు సీఎంగా మీ ముందుకొచ్చా నాకు అది ఇష్టం లేదు పెళ్లి, పిల్లలుపై క్లారిటీ ఇచ్చిన ప్రవల్లిక బెంగళూరులో జరగాల్సింది అహ్మదాబాద్ లో ..బాంబు పేల్చిన DK శివకుమార్