translateexpand_more

Tdp Workers News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu03 Jun, 01:45 pm
టీడీపీ వివాదంతో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

YSRCP-TDP : ఆత్మకూరులో హైటెన్షన్ నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP), టీడీపీ శ్రేణుల మధ్య రాజకీయ ఉద్రిక్తతతో పరిస్థితి తీవ్రంగా మారింది. వైసీపీ కార్యాలయంపై టీడీపీ శ్రేణులు దాడికి యత్నించారు. వైసీపీ కార్యాలయం మీదకు టీడీపీ శ్రేణులు రాళ్లను రువ్వారు. పార్టీ ఆఫీసు వద్దకు భారీ మొత్తంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి దాడికి యత్నించారు. ముందస్తుగా సమాచారం అందడంతో వైసీపీ కార్యాలయం వద్దకు పోలీసులు భారీగా మోహరించారు. ఇటీవల స్థానిక నేతలు, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మధ్య పరస్పర విమర్శల కారణంగా కారణంగా రాజకీయ వాతావరణం మరింత హీటెక్కింది. ఈ వ్యాఖ్యలు రెండు వర్గాల కార్యకర్తల మధ్య ఆగ్రహానికి దారి తీసింది. Read Also : Rajya Sabha : రాజ్యసభ టికెట్లపై టీడీపీ నేతల్లో టెన్షన్.. చంద్రబాబు చుట్టూ ఆశావాహుల ప్రదక్షిణలు! వైసీపీ పార్టీ ఆఫీసులో జరిగిన కార్యకర్తల సమావేశంలో శిల్పా చక్రపాణి రెడ్డి తీవ్ర విమర్శలు చేయడంతో టీడీపీ శ్రేణుల తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి ఒకరిపై ఒకరు అసభ్య పదజాలంతో దూషించుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ వ్యాఖ్యలను వ్యతిరికేస్తూ టీడీపీ కార్యకర్తలు, నేతలంతా భారీ సంఖ్యలో వైసీపీ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన చేపట్టారు. ఈ క్రమంలో రాళ్లు రువ్వడంతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. అందిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ముందస్తుగా భారీ బలగాలను మోహరించి రెండు వర్గాలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో పార్టీ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో మరింత ఉద్రిక్త వాతావరణంగా మారింది. శిల్పా చక్రపాణి రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ వర్గాలు కూడా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వైసిపి కార్యాలయం పరిసరాల్లో భారీగా పోలీస్ బలగాలు మోహరించారు. ప్రస్తుతం ఆత్మకూరులో ఉద్రికత్త పరిస్థితి కొనసాగుతోంది.

Tdp Workers News Keyword | Telugu Digital