
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. PEDDI Telangana Exhibitors: టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన థియేటర్ల 'పర్సంటేజ్' వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి ఎగ్జిబిటర్లతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ వివాదానికి ముగింపు పడింది. ఇటీవల కాలంలో థియేటర్ల యాజమాన్యాలు (ఎగ్జిబిటర్లు), టాలీవుడ్ నిర్మాతల మధ్య పర్సంటేజ్ విధానంపై పెద్ద చర్చ నడిచింది. అయితే, చిరంజీవి జోక్యంతో త్వరలో విడుదల కాబోతున్న 'పెద్ది' సినిమాను పాత పద్ధతి అయిన రెంటల్ (అద్దె) విధానంలోనే ప్రదర్శించేందుకు ఎగ్జిబిటర్లు అంగీకరించారు. అయితే చర్చల అనంతరం ఇరు వర్గాల మధ్య ఒక కీలక ఒప్పందం కుదిరింది. భవిష్యత్తులో ఏ సినిమాకైనా ప్రభుత్వం ద్వారా టికెట్ ధరల పెంపును పొందితే, ఆ పెంచిన ధరల ద్వారా వచ్చే లాభాల్లో 7.5 శాతం వాటాను ఎగ్జిబిటర్లకు చెల్లించాలని నిర్ణయించారు. జూన్ 30 తర్వాత కొత్త విధానం.. తెలంగాణ ఎగ్జిబిటర్లు తమ భవిష్యత్తు కార్యాచరణను మెగాస్టార్ చిరంజీవికి వివరించారు. జూన్ 30 తర్వాత థియేటర్లలో విడుదలయ్యే అన్ని సినిమాలను ఖచ్చితంగా 'పర్సంటేజ్' (శాతాల) విధానంలోనే ప్రదర్శిస్తామని వారు స్పష్టం చేశారు. ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను విన్న చిరంజీవి వారికి ఒక కీలక సూచన చేశారు. సినిమా ఇండస్ట్రీలో అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఫిలిం ఛాంబర్ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం మాత్రమే
