translateexpand_more

Telugu Cinema News 2026 News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu27 May, 07:06 am
అదిగో విశ్వంభర.. ఇదిగో రిలీజ్

ఈ ఏడాది ఆరంభంలోనే ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇదే జోష్‌లో తదుపరి చిత్రాన్ని దర్శకుడు బాబీ దర్శకత్వంలో పట్టాలెక్కించేశారు. రీసెంట్‌గా గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ సినిమా మరుసటి రోజు నుంచే షూటింగ్ మొదలుపెట్టుకుని ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కానీ అప్పుడెప్పుడో మొదలైన మెగాస్టార్ ‘విశ్వంభర’ పరిస్థితేంటి? ఏంటి అంటే క్లారిటీ లేకుండాపోయింది. చెప్పాలంటే మెగా అభిమానులు ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని దాదాపుగా మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై మొదట్లో భారీ అంచనాలు ఉండేవి. కానీ గ్రాఫిక్స్ వర్క్ డిలే కారణంగా గత కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ ఊసే వినిపించడం లేదు. ఆ మధ్యన సమ్మర్‌లో రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు మేకర్స్. కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్ కూడా వెళ్లిపోతోంది అయినా కూడా ఇంతవరకు విడుదల తేదీపై ఎలాంటి క్లారిటీ లేకపోవడం గమనార్హం. కనీసం సినిమా రిలీజ్ ఎప్పుడు? టీజర్ లేదా సాంగ్స్ అప్‌డేట్స్ ఎప్పుడు? అనే కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. దీనివల్ల ఈ సినిమా బజ్ క్రమంగా తగ్గిపోతోందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా కేవలం VFX పనుల వల్ల ఆలస్యమవుతోందా? లేక మరేదైనా కారణమా అనేది? హాట్ టాపిక్‌గా మారింది. మరి ‘విశ్వంభర’ పరిస్థితేంటో మేకర్స్‌కే తెలియాలి.

NTV Telugu01 Jun, 11:57 am
రామ్ చరణ్ బాడీ గార్డుకు బాడీ గార్డులు.. ఇది కదా క్రేజ్ అంటే

ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ఎంత ట్రెండ్ అవుతుందో, రామ్ చరణ్ బాడీగార్డ్ కూడా అంతే ట్రెండ్ అవుతున్నాడు. నిజానికి నాలుగేళ్ల క్రితం నుంచే అతను చరణ్‌కు బాడీగార్డ్‌గా కనిపిస్తున్నాడు. కానీ, ఇటీవల వీడియోల్లో కనిపించడంతో అతను ఎవరా అని ఆరా తీయడం ఎక్కువైపోయింది. అయితే, ఈరోజు విజయవాడలో సాయంత్రం ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ ఈవెంట్ కోసం రామ్ చరణ్ విజయవాడ బయలుదేరి వెళ్లాడు. కానీ, రామ్ చరణ్ కన్నా ముందే సదరు బాడీగార్డ్ వెళ్లి విజయవాడలో ల్యాండ్ అయ్యాడు. అక్కడ అతను బయటకు వస్తున్న క్రమంలో, రామ్ చరణ్ కోసం అక్కడికి వచ్చిన చాలామంది అభిమానులు సదరు బాడీగార్డ్‌తో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ విమానాశ్రయ సిబ్బంది ఆ బాడీగార్డ్‌కే బాడీగార్డులుగా మారి, అతన్ని అక్కడి నుంచి వాహనం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈరోజు విజయవాడలో జరుగుతుండగా, దానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం, రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ హాజరుకాబోతున్నారు.

Telugu Cinema News 2026 News Keyword | Telugu Digital